జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

సాతాను అంటే ఎవరు?ి

సాతాను గురించి పూర్తి విశ్లేషణ ? సాతాను ఎవరు?( ఆ దెయ్యం ఏమైన అపా యం చేస్తుందా మనకి? ) నీకు ఏమైన అపా యము తలపెడుతుందా?

-

హాస్యపు బొమ్మలలోను, పత్రికలలోను, దెయ్యం అందంగాను, నిన్ను సోధించేదిగాను, ఏదో ఒక తప్పు చేయడం ద్వార ఆనందాన్ని కల్పించేదిగాను కనపడుతుంది. కాని నిజానికి, ఇంకా చెప్పాలంటే సాతాను ఎలగైనా మారగలడు.

దెయ్యం ఎవరు? దేవునితో సహపోటిగా వుండలేదు ఎందుకంటె, దేవునితో సమానులు లేరు. వ్యతిరేకము లేదు. దేవుని ఉన్నికి నిరంతరము ఉంది ఈ భూమి మీద ఉన్న ప్రతిది దూతలతో సహా దేవుని చేత సృష్టింపపడినవే.

దెయ్యం (కొన్ని సార్లు సాతాను లాగాను, లూసిఫర్ గాను ప్రస్తావించబడాడు) దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన దేవదూత. దెయ్యం దేవునికి మాత్రమే శత్రువు కాదు మానవజాతికి కూడ. నిర్వీర్యముగా తన పని కొనసాగిస్తునాడు: చంపుటకు,నాసనం చేయుటకు,బందించుటకు మనం హెచ్చించబడాము." మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదుకుచు తిరుగుచునాడు.”1

దేవుని శక్తితో పోలిస్తే దెయ్యం శక్తి హాస్యాస్పదమైనది. కాని, వాడు ప్రజలందరికీ నిజమైనటువంటి ముప్పు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం వాడు నాశనం చేయగలడు.

సాతాను యొక్క ప్రధాన వ్యూహం: మనలను మోసపరచటం. సాతాను రాజ్యాలను, ప్రపంచాని, వ్యక్తులను మోసంచేయటానికి పరిస్థితులు వెతుకుతూనే వుంటాడు.

డాక్టర్ నీల్ యాన్ డర్సన్ గారు ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని గమనించారు. ఆయన చెప్పారు, బైబిల్ గ్రంధం సాతానుని మూడు రకాలుగా వివరించెను.
      - శోధించెవాడు
      - దూషించేవాడు
      - అబద్దములకు తండ్రి

డాక్టర్ నీల్ యాన్ డర్సన్ పేర్కొన్నది ఏమిటంటే," నేను ఒకవేళ్ళ నిన్ను శోధించానంటే నీకు తెలుస్తుంది. నేను ఒకవేళ్ళ నిన్ను దూషించానంటే నీకు తెలుస్తుంది. కాని ఒక వేళ్ళ నిన్ను మోసంచేయాలంటే అది నీకు తెలియదు. సాతాను యొక్క శక్తి అబద్దములో ఉంది. ఒకవేళ్ళ నీవు అబద్దాన్ని తీసివేసినట్లయితే సాతాను యొక్క శక్తిని కూడ నీవు తీసివేయవచ్చు.

ఏ విధంగా సాతాను అబద్దాలు చెబుతాడు?

క్రింద కొన్ని ఉదాహరణలు పేర్కొన్నపడినవి.

దేవుడు ఆదామును, హవ్వను స్వతహాశక్తితో ఎంచుకోడానికి మరియు నిర్ణయములు తీసుకొనుటకు సృజించెను, ఏ విధముగా అయితే మానవులు ఈ రోజు తమ స్వతహాశక్తితో ఎన్నుకుంటున్నారో అదే విధముగా ఏదేను వనములో ఒకవేళ్ళ వందలాది ఫలాలను ఫలించే వృక్షాలు వుండి ఉండవచ్చు. ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి షరత్తు కేవలము ఒక వృక్షపు ఫలాన్ని మాత్రమే భుజించకూడదు అని చెప్పెను. ఇది వాళ్ళు పాటించవలసినటువంటి, సూటిగా ఇవ్వబడిన ఆఙ్ఞ. కేవలము ఆ ఒక వృక్షపు ఫలాన్ని భుజించకూడదు లేని యెడల మరణింతువు. సరిపోదగినటువంటి విషయం.

కాని సాతాను హవ్వను ప్రలోబపరిచెను," నీవు నిశ్చయముగా మరణించవు." ఇదే ప్రారంభపు అబద్దము మరియు సాతాను ఈ రీతిగా అబద్దము ఆడెను, " నీవు నిశ్చయముగా మరణించవు. కాని, ఏలనగా మీరు మంచి చెడ్డలను ఏరిగినవారై దేవతలవలె ఉందురు అన్నియు దేవునికి తెలియున్ననియు చెప్పెను.”2

ఈ ఫలము వారిని దేవుని వలె చెయునన్నియు సాతాను హవ్వను మోసపరిచెను, దేవుడు వారి దగ్గర నుండి అద్భుతమైనటువంటిది నిలిపి వేశాడు అనె విషయాన్ని హవ్వకు ఒప్పింపచెసెను, దేవుని వలె చేయును అనేది మంచి విషయము కాదా?ఇక్కడ సమస్య ఏమిటంటే, సాతను చెప్పిన విషయము నిజము కాదు. ఆదాము హవ్వ సాతాను అబద్దాన్ని నమ్మెను, దేవుడు చెప్పిన మాటకంటే, సాతాను చెప్పిన మాటను నమ్మెను అది భయంకరమైనటువంటి ఫలితాలకు దారి తీసింది. కశ్చితముగా సాతాను ఈ రీతిగా వ్యవహరిస్తాడు. ఒక వ్యక్తిని నాశనం చేయుటకు వాడు సత్యమును వక్రీకరించెను.

సాతాను ఏ రీతిగా దేవున్ని నిందిస్తాడు

సాతాను యొక్క గొప్ప అభిలాష ఏమిటంటే ప్రజలను దేవుని యొద్ద నుండి దూరముగా ఉంచటం. వాడు దేవుని యొక్క ఉనికిని తృణీకరించినందున దేవుని స్వభావము అబద్దమన్నియు నీకు చెప్పును. ఇక్కడ ఒక ఉదాహరణ.

దేవుడు తన యొక్క ప్రేమను పదె పదె మనకు ధ్రువపరుస్తుంటాడు." చలాకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్ల నెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ యెడల కృప చూపుచున్నాను."3 "మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చితమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది."4 " మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏల యనగా అది ఆయనను ఎరుగలేదు."5 "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”6

కాని, సాతాను ఏమి చెప్తాడు? "దేవుడు నిన్ను ప్రేమించడు నీకున్న సమస్యలన్ని చూడు. ఒకవేళ్ళ దేవుడు నిన్ను ప్రేమించిన్నట్లయితే నీకు ఈ సమస్యలు ఉండేవి కాదు కదా." ఇవ్వన్ని నమ్మకమును పుట్టించేవిగా ఉంటాయి.

కాని, ప్రతిఒకరు సమస్యల్ని ఎదుర్కొంటారు. అది జీవితములో భాగము. సాతాను నీకు చెప్పనటువంటి విషయం ఏమిటంటే, నీవు దేవునితో సమాదానము కలిగి ఆయన మీద ఆదారపడినట్లయితే దేవుడు నిన్ను ఈ సమస్యలో కూడ నడిపించగలడు.

నీ అంతట నీవే భుజాల మీద వేసుకుని లేక పరిష్కరించుకోవాలసిన అవసరము లేదు. దేవుడు నీకు నిజమైనటువంటి బుద్దిని, ఙ్ఞనమును ఈ సమస్యల మీద ఇవ్వగలడు. అంత మాత్రమే కాదు కాని, ఆయన మనకు చెప్పేది ఏమిటంటే మనము సమస్యల్ని ఎదుర్కొనప్పుడు," నా సమాధానము నీకు అనుగ్రహించుచున్నాను"7 ఎందుకు? కారణమేమిటంటే ఆ వ్యక్తికి దేవుడుని నమ్మవచ్చు అని తెలుసు కాబట్టి.

దేవుడు లేకుండ ఒకవ్యక్తిని ఈ రీతిగా వివరించవచ్చు." ఈ లోకములో నిరీక్షణ లేనటువంటి వాడిగా." ఎవరి నిమ్మితమైనప్పటికి ఇది దేవుడు అభిలాష కాదు.

సాతాను నిన్ను నింధించే విధానం

సాతాను కేవలము దేవుని యొక్క మంచితనము విషయమై మాత్రమే నిన్ను మోసపరచడు. కాని, సాతాను నిన్ను, దేవుని దూషకుడుగా, కూడ నిన్ను చేయును.

యోబు అన్నేటువంటి వ్యక్తి జీవితములో కూడ ఇదే జరిగింది. సాతాను చెప్పిందేమిటంటే యోబు ఒకవేళ్ళ శ్రమనొందిన్నట్లయితె, అప్పుడు యోబు దేవుడుని ముఖము మీద దూషించును, కాని యోబు ఈ రీతిగా ఎప్పుడు చెయ్యలేదు. సాతాను, నిన్ను దేవుని ఎదురుగా బలహీనపరటానికి మరియు నింధించటానికి చూస్తాడు. అయితే ఇది ఒకటే కాదు. సాతాను తన దూషణను నిందను నీవైపు తిప్పుతాడు.

," నీవు దేవునికి అక్కరలేదు.” అని నిన్ను ఒప్పింపజేస్తాడు. నువ్వు ఎప్పుడు పరిసుద్దునిగా ఉండలేవు. నీ జీవితములో ఉన్న వ్యర్ధమైన విషయాలు చూడు, నువ్వు అన్ని విషయాలలో ఓడిపోయావు, నువ్వు చేసే పన్నుల్లోను, నువ్వు కలిగిన వ్యసనాలు, ఇవన్ని నీకు చుపిస్తాడు. దేవుడు నిన్ను ఇంక ఎప్పుడు అంగీకరించడు లేక నువ్వు దేవునికి అవసరము లేదు అంటాడు. నువ్వు అసల ఎప్పుడు దేవునికి చేరుకోలేవు.”

సాతాను చెప్పేవన్ని అబద్దాలే. దేవుని చేత అంగీకరించబడాలంటే దేవుడు మనతో స్పష్టముగా చెప్పేది ఏమిటంటే, నీకు పరిసుద్దత అక్కర్లేదు నువ్వు మంచిగా ఉండక్కరలేదు, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే పాపము లేని వారముగా ఉండనవసరము లేదు, సాతాను చెప్పేవన్ని అబద్దాలే.

యేసయ్య సాతాను గురించి ఇలా చెప్పారు. "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు; వాని యందు సత్యము లేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు."8

సాతానుకి దేవునికి మద్యలో ఉన్న వ్యత్యాసం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. యేసయ్య ఇలా అన్నారు," దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికి రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."9

యేసయ్య మీద నమ్మకం ఉంచిన వారి గురించి ఇలా అన్నారు," కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు."10

సాతాను చేత మోసపరచబడటంకంటే, దేవుడు తన గురించి తాను చెప్పేటువంటిది తెలుసుకునే అవకాశము ఉన్నది, నీ జీవితము గురించి, సంబంధాలు గురించి కూడా. ఒకవైపు సాతాను నిన్ను మోసపరచుట ద్వారా బానిసగా చెయ్యాలి అనుకుంటాడు, కాని దేవుడు నువ్వు సత్యాన్ని తెలుసుకును విదుదల పొందుకుని నిజ జీవితాన్ని అనుభవించాలనుకుంటాడు.

సాతాను అబద్దాలతో పాటు మోసాలతో పాటు, వాడి అబద్దాలతో, ప్రజలను బానిసత్వముతో మరియు వ్యసనాలతో శోధిస్తాడు. " పర్వాలేదు ముందుకు వెళ్ళు, ఇంకొకటి తీసుకో నీకు ఏమి అవ్వదు. ఎవ్వరు నిన్ను చూడరు. నువ్వు ఎవరని భాదపెటట్లేదు. నీకు చాలా బాగుంటుంది.”

సాతానుతో ఎలా వ్యవరించాలి

నువ్వు దేవునితో నడవాలని నిర్ణయంతేసుకున్నట్లయితే, నువ్వు సాతాను చేత కశ్చితముగా శోధించబడతావు. నువ్వు ఏ నిర్ణయం తేసుకోవాలన్నా నీ దగ్గర స్వేచ్చ వుంది. చాల సందర్భాలలో సాతాను అబద్దాలలో పడకుండా ఏది నిజమో మనం తెలుసుకోగలం, ఆ సందర్భాలలో మనం అతి తక్కువ నిస్సాహాయ స్థితిలో ఉంటా, అతి తక్కువగా భయపడతాము లేక ఆందోళన చెందుతాం. అంతకుమించి, దేవుడు కూడ మనకు సహాయం చేస్తాడు.

మన గురించి ఇలా చెప్పబడింది." సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును."11

సాతాను ఎవ్వరు ? శోధించేవాడు, దూషించేవాడు, అబద్దీకుడు వాడి అభిలాష ఏమిటంటే ప్రజలు దేవున్ని విడిచి ఒంటరిగా ఉంచాలని, అలా చేయటం ద్వార ప్రజలు వాడి స్వరాన్ని మాత్రమే వినాలని, వాడితో కలిసి తిరుగుబాటు చేసి నాశనాన్ని అనుభవించాలని అనుకుంటాడు. దేవుని గురించి గాని నీ గురించి గాని వాడు చెప్పేదాంట్లో నిజముండదు.

దేవుడు నీతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు తద్వారా నీవు ఆయన ప్రేమను అనుభవించాలని కోరుకుంటున్నాడు. నీవు చీకటిలో జీవించాలని ఆయన నిన్ను సృజించలేదు, అయోమయముతో కాదు, కాని సత్యాన్ని తెలుసుకోవాలని." మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.”12

దేవునితో సంబంధాన్ని ఎలా ప్రారంభించాలో నీవు ఎప్పుడైన విన్నావా?ఈ సంగతి: దేవుని తెలుసుకోనుట ఎలాగో వివరిస్తుంది.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) పేతురు 5:8 (2) ఆదికాండము 3:4,5 (3) యిర్మీయా 31:3 (4) 1 యోహాను 4:10 (5) 1 యోహాను 3:1 (6) యోహాను 3:16 (7) యోహాను 14:27 (8) యోహాను 8:44 (9) యోహాను 10:11 (10.యోహాను 8:31 (11) 1 కొరింధీయులకు 10:13 (12) యోహాను 8:12

ఇతరులతో పంచుకోండ  

TOP