జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

గ్రుడ్డి నమ్మకాన్ని మించినది

యేసు ఎవరు? యేసు దేవుడా? యేసు తన్ను గూర్చి తానూ ఏమని చెప్పుకొనెను మరియు దేవునితో సమానత్వమును గూర్చి ఏమి చెప్పెను, వాటిని నిరూపించుకొనుటకు ఏమి చేసెను?

పాల్ ఈ. లిటిల్

దేవుడు ఉన్నాడు అని ఆయన పలానా రీతిగా ఉంటాడని, ఆయన చొరవ తీసుకుని తననుతాను ప్రత్యక్షపరచుకొననిదే మనము ఆయనను గూర్చి తెలుసుకొనుట అనునది అసాధ్యమే.

మనము దేవుని యొక్క ప్రత్యక్షతను గూర్చిన ఆనవాలు ఏమైన ఉన్నవో అని చరిత్ర యొక్క పుటలు తెరచి చూడాలి. ఒక స్పష్టమైన ఆనవాలు ఉన్నది. పాలస్తీనలోని ఒక చిన్న గ్రామంలో 2000 సంవత్సరాల క్రితం, పశువుల పాకలో ఒక పిల్లవాడు పుట్టినాడు. ఈరోజు యావత్ ప్రపంచం మంచి కారణంతో యేసుయొక్క పుట్టుకను వేడుక చేసుకోనుచున్నది.

యేసు క్రీస్తు దేవుడా? ఆయన ఎప్పుడైనా దేవునిగా చెప్పుకొన్నాడా?

“సామాన్య ప్రజలు ఆయన బోధ సంతోషముతో విన్నారు” మరియు “ఆయన వారి యొక్క ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము గలవానిగా బోధించెనని”1 చెప్పబడుతుంది.

అయితే, ఆయన తనను గూర్చి చేసిన నిర్గాంతపోయే ఆశ్చర్యమైన ఉలిక్కిపడే ప్రకటనలు చేసాడని చాలా స్పష్టమైయినవి. ఆయన తన్ను మంచి బోధకుని కంటేను మరియు ప్రవక్తకంటే ఎక్కువగా కనుపరచుకున్నాడు. ఆయన దేవుడని చాలా స్పష్టముగా చెప్పుకొనుటకు మొదలు పెట్టెను. అయన బాధలో తానూ ఏమైయున్నాడో అన్నది ముఖ్యమైన అంశంగా చేసుకున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమంటే? “జనులు తన్ను గూర్చి ఏమనుకొనుచున్నారని అడుగగా దానికి పేతురు ఇలా అన్నాడు, “నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు”.2 యేసుప్రభువు దానికి ఆశ్చర్యపోలేదు గద్దించనులేదు. పైగా ఆయనను ప్రశంశించాడు.

యేసు తరచు “నా తండ్రీ” అంటు చెప్పేవాడు మరియు ప్రజలకు ఆయన మాట యొక్క పూర్తీ భావం అర్ధమైంది. “ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సామానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నమూ చేసిరి”3 అని చెప్పబడినది.

మరొక సందర్భంలో “నేనును తండ్రియును ఏకమైయున్నాము అని ఆయన అనగా”. వెంటనే మతసంబంధమైన అధికారులు ఆయనను రాళ్ళతో కొట్టవలెననియుండిరి అందుకు ఆయన “అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుడురని వారినడిగెను. “అందుకు వారు – నీవు మనుష్యుడవైయుండి దేవుడానని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.”4

యేసు దేవుడా? ఆయన జీవితమును చూడండి.

పక్షవాతం వచ్చిన వ్యక్తిని స్వస్థపరచటానికి ఆయన ముందుకు తీసుకువచ్చినప్పుడు. యేసు “కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పెను. మతపెద్దలు వెంటనే కోపంతో స్పందించి ఇతడీలగు ఎందుకు చెప్పుచున్నాడు. దేవదూషణ చేయుచున్నాడు పాపములను ఎవరు క్షమించగలరు దేవుడు తప్పా? అని తమలోతామనుకొనిరి”.

యేసుప్రభువుని ప్రధాన యాజకుడు తీర్పుతీర్చు సమయంలో, ప్రధాన యాజకుడు ఆయనను సూటిగా ఒక ప్రశ్న అడిగెను. “పరమాత్ముని కుమారుదవైన క్రీస్తువు నీవేనా?

అందుకు యేసు అవును నేనే, మీరు మనుష్యకుమారుడు సర్వశక్తివంతుని కుడి పార్శ్వమున కూర్చుండు టయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను”.

ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని – మనకు ఇక సాక్షులతో పని యేమి! ఈ దేవ దూషణ మీరు విన్నారు కారా”5 అనెను.

యేసు ప్రభువు దేవునితో ఎంత సాన్నిహిత్యాన్ని కలిగిఉన్నాడంటే, ఒక వ్యక్తి తనపట్ల ఉన్న దృక్పధాన్ని, ఒక వ్యక్తికి దేవుని పట్ల ఉన్న దృక్పధంతో సమానం చేసెను. కాబట్టి ఆయనను తెలుసుకొనుట దేవునిని తెలుసుకొనుటయే.6 ఆయనను చూచుట దేవునిని చూసినట్టే.7 ఆయన యందు విశ్వాసముంచుట దేవుని యందు విశ్వాసముంచుటయే.8 ఆయనను అంగీకరించుట దేవునిని అంగీకరించడమే.9 ఆయనను ద్వేషించుట దేవునిని ద్వేషించుటే10 మరియు ఆయనను ఘనపరచుట దేవునిని ఘనపరచడమే.11

యేసుక్రీస్తు దేవుడా? సాధ్యమైన వివరణలు

ప్రశ్న ఏమిటంటే ఆయన సత్యం చెప్పుచున్నాడా?

బహుశ యేసు తానూ దేవుడనని చెప్పినట్టు అబద్ధమాడి ఉండవచ్చు. బహుశ ఆయన దేవుడు కాదని ఆయనకు తెలిసియుండవచ్చు అయితే తన బోధ అధికారం కలిగియుండుటకు వినువారిని మోసగించియుండవచ్చు. చాలా తక్కువ మంది ఈ రీతిగా ఆలోచిస్తారు. ఆయన దేవత్వమును వ్యతిరేకించేవారు సైతాను ఆయన గొప్ప నైతిక బోధకుడని ఒప్పుకుంటారు. కాని ఈ రెండు వాక్యాలు ఒక దానికి ఒకటి విరుద్ధముగా ఉన్నవని గ్రహించుటలో విఫలమౌతారు. అయితే ఒక సంక్లిష్ట అంశాన్ని గూర్చిన బోధను బట్టి యేసు ఓ గొప్ప బైటిక బోధకుడై యుండాల లేదా తన గుర్తింపు – అతను ఒక పచ్చి అబద్ధికుడై యుండాలి. యేసు చాలా కష్టం మీద ఒక గొప్ప నైతిక బోధకునిగా ఉంటాడు, ఒకవేళ చాలా ప్రాముఖ్యమైన విషయం తన బోధ అనగా తన గుర్తింపుపై విషయమై అబద్ధకుడి.

“క్రీస్తు యొక్క దావాలను మనం ఎదుర్కొనుచుండగా, కేవలం నాలుగు సాధ్యతలు మాత్రమే ఉన్నాయి. ఆయన అబద్ధికుడు కావచ్చు, మాకసిక రోగి కావచ్చు, ఒక పురాణం కావచ్చు, లేక సత్యం కావచ్చు.”

మరొక ఆలోచన యేదనగా ఆయన యదార్ధవంతుడె కాని తనకుతాను మోసగించుకునే వ్యక్తి. ఈ దినాలలో తనకు తానే దేవుడా నని చెప్పుకోను వ్యక్తిని ఏమంటామో మనకు తెలుసు – మతి స్థిమితంలేని వ్యక్తి. అయితే యేసు ప్రభువు యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే అలాంటి అసాధారణ మరియు అసమతుల్యత గాన, ఒక మానసికంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఉన్నట్లు మనకు కనబడదు. దానికి భిన్నంగా ఆయనలో ఒత్తిడికూడా చాలా గొప్ప నిబ్బరం మనము చూడగలము.

మూడవ ప్రత్యామ్నాయము ఏమిటంటే ఉత్సాహవంతులైన అనుచరులు ఆయన వింటేనే కలత చెందేటటువంటి మాటలు ఆయనను ద్వారానే చెప్పించారు. ఈ సిద్ధాంతమును ఆధునిక పురావస్తు శాస్త్రం తప్పని నిరూపించినది.

క్రీస్తు యొక్క నాలుగు జీవిత చరిత్రలు, ఆయనను చూచినవారు, వినినవారు అనుసరించినవారి యొక్క జీవితకాలంలోనే వ్రాయబడినవి. ఈ సువార్తలలోని (క్రీస్తు యొక్క నాలుగు చరిత్రలు) నిర్దిష్ట వాస్తవాలు మరియు వివరణలు వారియొక్క ప్రత్యక్ష సాక్ష్యాలై యున్నవి. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలు చాలా ముందుగా వ్రాయబడినవి గనుక అవి ఎక్కువ ప్రాచుర్యం మరియు ప్రభావం కలిగియున్నవి, కాని శతాబ్దాల తరువాత వచ్చిన కల్పిత న్ఘోష్టిక్ (గ్నోస్టిక్) సువార్త అలా పొందలేదు.

యేసు అబద్ధికుడు కాదు, లేదా మనోవైకల్యం కలిగినవాడు కాదు. చరిత్రాత్మక వాస్తవానికి వేరుగా కల్పించినవి కాదు. మరి మరో ఏకైన ప్రత్యామ్నాయం ఏమిటంటే యేసు తాను దేవుడను అని చెప్పినప్పుడు మంచి అవగాహనతో నిజముగా ఆ మాటను పలికెను.

యేసు దేవుడా? దానికి ఏంటీ నిదర్శనం?

ఒక వైపునుండి చూస్తే, ఏది ఏమైన ఆరోపణలు అంతగా లెక్కలోనికి రావు. మాట్లాడటం తేలికే. ఎవరైనా ఆరోపణలు చేయవచ్చు. తమ్మునుతాము దేవునిగా చెప్పుకున్నవారు ఉన్నారు. నేను దేవుదానని చెప్పుకోవచ్చు, మీరు దేవునిగా చెప్పుకోవచ్చు కాని మనము జవాబీయవలసిన ప్రశ్న ఏదనగా “మనము ఆరోపించిన దానికి ఏ ఏ విషయాలు యాదారం`ఆధారం చూపగాలము. నా విషయమైతే నేను తప్పు అని నిరూపించటానికి ఐదు నిమిషాలు పట్టదు. మీ విషయము కూడా అదే అయిoడవచ్చు.

అయితే నజరేయుడైన ఏసువిషయమైతే అది అంట సులువుకాదు. ఆయన ఆరోపించినది ఋజువుపరచుటకు ఆధారాలు ఉన్నవి. “నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నన్నకుడి, చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను”12.

యేసు యొక్క జీవితము ఆయన విలక్షణమైన నైతిక గుణశీలము.

ఆయన యొక్క నైతిక గుణశీలము ఆయన ఆరోపించుకున్న వాటితో ఏకీభవిస్తాయి. ఆయన జీవితం యొక్క నాణ్యత ఎటువంటిదంటే తన శత్రువులకు సయితము ఒక సవాలు విసిరాడు,” నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగబరు”13. అందరూ మౌనముగా ఉన్నారు. ఆయన గుణశీలతలో ఏదైనా ఒక తప్పు పట్టాలని అవకాశం కోసం ఎదురుచూసేవారు సయితం ముక్కు మీద వేలువేసుకున్నారు.

యేసు ప్రభువు సాతాను చేత శోధింపబడినట్లు మనము చదువు తము, గాని ఆయన ఎప్పుడు పాపమును ఒప్పుకొన్నట్టు మనము చూడము. ఆయన క్షమించుమని ఎప్పుడు అడగ లేదు, ఆయన అనుచరులను మటికి అలా చేయమని చెప్పెను.

యేసు జీవితంలో ఏమాత్రము నైతిక పతనము అనేది పరిశుద్ధుల యొక్క అనుభవలను మరియు యోగులు యొక్క అనుభవాలను బేరీజు వేసి చరిత్రలో చూచినట్లయితే అది ఏంటో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్త్రీ పురుషులు దేవుని చెంతకు ఎంత దగ్గరగా వెళ్తారో అంతగా వారి యొక్క సొంత వైఫల్యాలను అవినీతిని, అపరాధాలను గుర్తించి ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి తేజరిల్లె వెలుగుకు ఎంత దగ్గరగా ఉంటాడో అంత ఎక్కువుగా తానూ స్నానం చేయాలని గుర్తిస్తాడు. ఇదే విషయం సాధారణ మర్త్యమైనవారి నైతిక విషయంలో కూడా సత్యం.

అంత మాత్రమే కాదు యోహాను, పౌలు మరియు పేతురు, వారి యొక్క బాల్యం నుండి పాపం యొక్క సార్వత్రికట యందు నమ్మికఉంచుటకు తర్ఫీదు పొందినవారు కూడా యేసు యొక్క పాపరాహిత్యాన్ని గూర్చి చెప్పడం అనేది గమనించ దగిన విషయం. “ఆయన యే పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు.”14

ఆఖరికి యేసుకు మరణ తీర్పు తీర్చిన పిలాతు సహితము ఆయన చేసిన తప్పిదమేమని అడిగాడు. ప్రజల యొక్క స్పందనానంతరం పిలాతు, అన్నాడు, “ఈ మనుష్యుని రక్తము విషయంలో నేను నిరపరాధిని దీని విషయం మీరే చూచుకొనుడి”. ప్రజలు కనికరము లేకుంగా యేసుని సిలువవేయమని గట్టిగా అడిగారు. (ఆయన దేవదూషణ చేశాడని, అనగా దేవుదానని ఆరోపించుకున్నాడని.) యేసుని శిలువ వేయుటకు సహకరించిన రోమా శతాధిపతి, “నిజముగా యితడు దేవుని కుమారుడే”15 అన్నాడు.

యేసు యొక్క జీవితము – ఆయన రోగులను స్వస్థపరిచినవాడు.

యేసు ఎడతెగక రోగములమీదను రుగ్మతలమీదను తన శక్తిని కనుపరచాడు. ఆయన కుంటి వారిని నడువ చేసాడు, మూగవారిని మాట్లాడ చేసాడు, గ్రుడ్డివారికి చూపు నిచ్చాడు. ఆయన స్వస్థపరచిన కొన్ని సంఘటనలలో ఏమాత్రము బాగుచేయబడని పుట్టుకతో వచ్చిన సమస్యలు కూడా బాగుచేయబడినవి. ఉదాహరణకు, పుట్టుకతో గ్రుడ్డివాడై స్వస్థపరచబడినవాడు.

అతడు ఆలయము బయట భిక్షాటన చేసుకొనేవాడని అందరికి తెలుసు. అయినా దేవుడు ఆయనను స్వస్థపరచాడు. కొంతమంది అధికారులు వానిని ఏమి జరిగింది అని అడిగినప్పుడు, ఒక విషయం నాకు తెలుసు. నేను గుడ్డివాడనైయుంటిని ఇప్పుడు చూచుచున్నాను, అనెను. అక్కడ ఉన్న మతాధికారులు యేసు స్వస్థపరచువాడని, దేవుని కుమారుడని గుర్తించకపోవడం అనేది గుడ్డివాణి కన్నులేవరైన తెరచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు”16. ఆశ్చర్యకలిగించినది. “పుట్టుక గుడ్డివానిని బాగుచేసేనని ఎప్పుడును వినలేదు” అని చెప్పెను. అతనికి ఆ రుజువు చాలా స్పష్టముగా ఉన్నది.

యేసు యొక్క జీవితం – ప్రకృతి మీద ఆయన ఆధిపత్యం.

యేసు ప్రకృతి మీదనే ఆయన యొక్క దైవసంబంధమైన శక్తిని ప్రదర్శించాడు. కేవలం ఒక మాటతో ఆ గలిలయను సముద్రమీద ఎగసి పడుతున్న కెరటాలను, తుఫానును ఆయన నిమ్మళింపచేసినాడు. పడవలో ఉన్నవాడు అవాకై “యీయన ఎవరు? గాలియు, అలలును ఆయనకు విధేయత చూపుచున్నవి?”17 అనెను. ఒక వివాహ విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చెను. ఐదు రొట్టెలు రెండు చేపలను 5000 మందికి పంచి ఇచ్చెను. ఒక విధవరాలి ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినప్పుడు అతనిని బ్రతికించి తిరిగి తల్లికి అప్పగించెను.

లాజరను యేసు యొక్క స్నేహితుడు చనిపోయి అప్పటికే నాలుగు దినములుగా సమాధిలో ఉంచబడెను. అయినప్పటికీ యేసు బిగ్గరగా “లాజరు బయటకు రా” అని ఆయనను ఆశ్చర్యకరంగా మరణం నుండి బ్రతికించాడు. అనేకులు దానికి సాక్షులుగా ఉన్నారు. ఇది ఎంత ముఖ్యమైనదంటే ఆయన శత్రువులు ఈ ఆద్భుతాన్ని కాదనలేకపోయారు. కాని విశ్వాసముంచటానికి బదులుగా ఆయనను చంపటానికి నిశ్చయించుకొన్నారు. “మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండిన యెడల అందరూ ఆయనయందు విశ్వాసముంచెదరు”18 అని వారు అనెను.

ఆయన ఆరోపించుకొన్నట్లు, యేసు క్రీస్తు దేవుడా?

యేసు క్రీస్తు దైవత్వము యొక్క ఉన్నతమైన/ నిదర్శనం ఎదనగా ఆయన యొక్క సొంత మరణం నుండి పునరుత్థానమే. యేసు క్రీస్స్తూ యొక్క జీవితమంతటిలో ఆయన ఎలాగు చంపబడతాడో మరియు మరణం నుండి తిరిగి ఎలా లేపబడతాడో ఐదు సార్లు ముందుగానే ప్రవచించి తెలియజేసినాడు.

ఖచ్చితంగా ఇది గొప్ప పరీక్షే. ఈ ఆరోపణ సులువుగా పరీక్షింపవచ్చు. జరగనీ జరగకపోని ఇది అయితే దృఢ పరుస్తుంది లేదా ధ్వంసం చేస్తుంది. ఈ విషయం నీకు మరియు నాకు ముఖ్యమైనది. యేసుక్రీస్తు మరణం నుండి తిరిగిలేచుట అనేది ఆయన చేసిన ఈ క్రింది వాక్యములను పరీక్షిస్తుంది లేదా ఆయనను నవ్వుల పాలుచేస్తుంది.

“నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాదు.”19 “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగియుండును.”20 ఆయన యందు విశ్వాసముంచు వానికి “నేను నిత్యజీవమిచ్చుచున్నాను.”21

తన సొంత మాటలలోనే ఆయన ఈ ఋజువు ఇస్తున్నాడు. “మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన మూడు దినములకు ఆయన లేచును.”22

దీని అర్ధం ఏమైయున్నది

యేసు క్రీస్తు తిరిగి లేచినట్లయితే, దేవుడు ఉన్నాడని, దేవుడు ఎలా ఉంటాడని మరియు ఆయనను వ్యక్తిగత అనుభవంలో ఎలా తెలుసుకోవాలని దీని ద్వారా ఖచ్చితంగ మనకు తెలుస్తుంది. ఈ విశ్వానికి ఒక అర్ధం మరియు ఉద్దేశ్యం యున్నది. ఈ జీవితంలోనే జీవము గల దేవుని తెలుసుకొనుటకు సాధ్యమౌతుంది.

“మాటలు చాలా చవక. దావాలు ఎవరైనా చేయవచ్చు. అయితే నజరేయుడైన యేసు యొద్దకు వచ్చేసరికి...తన దావాలను రుజువు చేసే గుణం ఆయనలో ఉంది.”

మరోవైపు, యేసుక్రీస్తు మరణంనుండి తిరిగి లేవనట్లయితే, క్రైస్తావ్యానికి ప్రమాణపూర్వకమైన వాస్తవం లేదా విలువ ఉండదు. హతసాక్షులుగా సింహాల దగ్గరకు పాటలు పాడుచూ వెళ్ళినవారు గాని, ప్రస్తుత మిషనరీలు ఈ సువార్త కోసం ప్రాణాలు ఇచ్చినవారు వెఱ్ఱివారిగా ఉండెదరు. గొప్ప అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు. “క్రీస్తు మృతులలోనుండి లేపబడియుండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే.”23 పౌలు తన వాదన అంతటిలో క్రీస్తు యొక్క శరీర పునరుత్థానము మీద ఆధారపడినాడు.

యేసు దేవుడని ఆయన రుజువుపరిచాడా?

యేసు యొక్క పునరుత్థానమును గూర్చి కొన్ని నిదర్శనాలు చూద్దాం!

యేసు ప్రభువు చేసిన అద్భుతాలను గమనించినట్లయితే ఆయన సిలువను సుళువుగా తప్పించుకొనేవాడు, కాని ఆయన అలా చేయుటకు ఎంచుకోలేదు.

“ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకు నాకు అధికారము కలదు.”24

యేసు ప్రభువు బంధింపబడు సమయంలో యేసు స్నేహితుడైన పేతురు ఆయన కోసం ప్రతిఘటించటానికి ప్రయత్నించెను. కాని యేసు పేతురుతో ఇలా చెప్పెను. “నీ కట్టి వరలో తిరిగి పెట్టుము, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండ్రు సేనా వ్యూహములకంటే, ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?”25 ఆయనకు పరలోకములోను భూమి మీదను అంట శక్తి ఉన్నది. అయితే యేసు సిలువ మీద మరణించుటకు ఇష్టపూర్వకముగా వెళ్ళెను.

యేసు యొక్క సిలువ మరణం మరియు సమాధి.

యేసు యొక్క మరణం సిలువమీద బాహాటముగా జరిగింది, ఇది ఒక సాధారణంగా జరిగే చిత్రహింస మరియు మరణం. ఈ పద్ధతిని కొన్ని శతాబ్దాలుగా రోమా ప్రభుత్వం ఆచరిస్తుంది. యేసు మీద మోపిన అభియోగం, దేవదూషణ (తాను దేవునిగా ఆరోపించుకొనుట) ఆయన సిలువ మన పాపముల కొరకు మూల్యం చెల్లించుటకు జరిగెనని ఆయన చెప్పెను.

యేసు ప్రభువును అనేకమైన చిన్న ఎముకల ముక్కలు లేదా లోహపు ముక్కలున్న త్రాళ్ళతో చేయబడిన చండ్రకాలాతో కొట్టారు. ఆయన తలను ముళ్ళతో చేయబడిన కిరీటంతో వత్తారు. యెరూషలేము బయట ఉన్న శిక్షాస్థలమైన కొండపైకి ఎక్కుటకు బలవంతము చేసారు. ఆయనను ఒక కొయ్య సిలువపై పెట్టి ఆయన చేతుల మణికట్టులోను కాళ్ళలోను సీలలు గుచ్చారు. ఆయన వ్రేలాడి తీయబడి చివరకు చనిపోయెను. ఆయన చనిపోయాడా లేదా అని నిర్ధారించుటకు ప్రక్కలో బళ్ళెముతో పొడిచారు.

యేసు యొక్క మృతదేహాన్ని శిష్యులు దించి, నారబట్టలతోచుట్టి జిగురుగా ఉన్న సుగంధ ద్రవ్యాలతో లేపనం చేశారు. ఆయన మృతదేహాన్ని కొండ రాతిలో తొలిపించిన సమాధిలో ఉంచారు. ఎవరును వెళ్ళకుండా ద్వారము దగ్గర పెద్దరాతిని అడ్డుపెట్టారు.

యేసు ప్రభువు మూడు రోజుల్లో తిరిగి లేస్తానని చెప్పినాడని అందరికి తెలుసు. కాబట్టి సమాధి దగ్గర మంచి రోమా సైనిక యోధులను కాపలాగా ఉంచారు. వారు ఆ సమాధి రోమా ప్రభుత్వానికి చెందినది అని బయట వారికీ తెలియ చేయుటకు రోమా ప్రభుత్వ ముద్ర వేశారు.

మూడు దినముల తరువాత సమాధి ఖాళీగా ఉంది

ఇంత బందోబస్తు చేసినప్పటికీ మూడు రోజుల తరువాత ఆ పెద్ద బండరాయి, ఇదివరకు సమాధికి అడ్డుగా ఉన్న రాయి, ఇప్పుడు పల్లపు ప్రదేశములో సమాధికి దూరాన పదియున్నది. దేహం అక్కడ లేదు. కేవలం ఆ సమాధిలో నారబట్టలు మాత్రమే ఉన్నవి. దేహం అందులో లేదు.

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే విమర్శకులు మరియు యేసు అనుచరులు సమాధి ఖాళీగా ఉన్నదని మరియు దేహం అందులోనుంచి అదృష్యమైనదని వారు అంగీకరిస్తారు.

మొదట్లో ఎక్కువగా ప్రచారమైన వివరణ ఏమనగా కావలివారు నిద్రించుచుండగా ఆయన శిష్యులు వచ్చి ఆ దేహాన్ని దొంగతనం చేశారు. ఈ వాదన అంట అర్ధవంతంగా లేదు. ఇక్కడ రోమా సైనికయోధులు కావలిగా ఉన్నారు. కావలిగా ఉన్నప్పుడు నిద్రపోవడం అనేది మరణ శిక్షకు దారితీస్తుంది.

ఇంకా ప్రతి శిష్యుడు (వ్యక్తిగతంగా మరియు వేరువేరుగా) ఆయన తిరిగి లేచాడని ప్రకటించినందుకు చిత్రహింస పొందారు. హతసాక్షులుగా చనిపోయారు. స్త్రీ పురుషులు వారు నమ్మినిది, సత్యమున్నప్పుడు వారు చనిపోవుటకు వెనకాడరు. కాని, అది అబద్ధం అని వారికి తెలిస్తే వారు దానికోసం చనిపోరు. ఒక వ్యక్తి మరణమంచం మీద ఎప్పుడు సత్యమే చెపుతాడు.

బహుశ అధికారులు దేహాన్ని తీశారు (అనుకుందాం). అసలు వారేగా ప్రజలు ఆయన యందు విశ్వాసముంచకుండా చేసేందుకు సిలువ వేశారు. కాబట్టి ఇది కూడా బలహీనమైన వాదన. వారి యొద్ద యేసు క్రీస్తు యొక్క దేహమున్నట్లయితే వారు ఆ దేహాన్ని యెరూషలేము వీధుల్లో ఊరేగించేవారు. ఒకవేళ చేసినట్లయితే క్రైస్తవ్యాన్ని ఉయ్యాలలోనే నొక్కి చంపేసేవారే. వారు అలా చేయలేదంటేనె వారు ఆయన దేహాన్ని తీయలేదనుటకు ఒక ఋజువుగా ఉన్నది.

మరొక సిద్ధాంతం ఏమనగా, స్త్రీలు విచారముగాను, దుఃఖముతో ఉన్నందువలన, ఉదయకాలపు చీకటి వలన వారు వేరొక సమాధి దగ్గరకు వెళ్ళారు. వారి యొక్క మనోదుఃఖమును బట్టి, సమాధి ఖాళీగా ఉన్నందువల్ల యేసుక్రీస్తు తిరిగి లేచాడని అనుకున్నారు. ఇక్కడ మరలా జవాబు ఏమిటంటే వారు వేరొక సమాధి దగ్గరకు వెళ్లిఉంటే, ప్రధానయాజకులు మరియు ఇతర మత శత్రువులు సరైన సమాధి దగ్గరకు వెళ్లి దేహాన్ని ఎందుకు చూపించలేదు?

“స్త్రీలు పురుషులు తాము సత్యమనుకొన్న దాని కొరకు మరణిస్తారు, అది అబద్ధం అయినప్పటికీ. కాని, వారు అబద్ధమని తెలుసుకొనిన దాని కొరకు మరణించరు.”

ఇంకొక సంభావ్యత ఏమిటంటే, దీనినే కొందరు “సూన్ సిద్ధాంతం” అంటారు. ఈ సిద్ధాంతం దృష్టిలో యేసుక్రీస్తు వాస్తవంగా చనిపోలేదు. ఆయన చనిపోయారని చెప్పారు మాత్రమే. కాని ఆయన అలసిపోయి, బాధతో రక్తము పోయినందున స్పృహతప్పిపోయాడు. అయితే సమాదిలోని చల్లదనానికి ఆయన శక్తి పుంజుకున్నాడు. (ఇది నమ్మాలంటే వైద్యపరంగా మరణించాడన్న దానిని ధ్రువీకరించదానికి బళ్ళెముతో పొడిచారన్నది మరచిపోవాలి).

కాని, క్రీస్తు సజీవంగా సమాధి చేయబడి స్పృహతప్పినాదని ఒక క్షణం అనుకుందాం. చమ్మగా ఉన్న సమాధిలో ఆహారం, నీరు లేకుండా ఏమాత్రం సంరక్షణ లేకుండా మూడు రోజులు ఉండటం అనేది నమ్మడానికి సాధ్యమా? ఆయన ఆ ప్రేత వస్త్రములను చిమ్పుకొని బయటకు రావడానికి మరియు, సమాధి ద్వారము దగ్గర ఉన్న పెద్ద రాతి బందని త్రోసి, రోమా కావలివారిని జయించి, సీలలతో గ్రుచ్చబడిన కాళ్ళతో మైళ్ళ దూరం నడవటానికి శక్తి ఉంటుందా? ఈ వాదన కూడా అర్ధవంతంగా లేదు.

ఏదిఏమైనా, యేసు యొక్క అనుచరులు ఈ ఖాళీ సమాధి ఆధారంగా ఆయన దేవత్వమును ఒప్పుకోలేదు.

కేవలం ఖాళీ సమాధి కాదు

ఆయన మరణం నుండి తిరిగి లేచాడని, ఆయన జీవించుచున్నదని, ఆయన దేవుడని ఒప్పించబడేలా... చేసిండి ఖాళీ సమాధి కాదు గాని వారిని ఒప్పించినదేడనగా ఆయన వారికి వ్యక్తిగాను, శరీరములోను, వారితో కూడా భుజించిన విధానం మరియు మాట్లాడిన విధానం వారిని ఒప్పించినది.

సువర్తీకులలో ఒకడైన లూకా యేసుని గూర్చి ఇలా అన్నాడు. “ఆయన శ్రమపడిన తరువాత నలుబది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను (రుజువులను) చూపి వారికి తన్ను తానూ సజీవునిగా కనుపరచుకొనెను.”26

యేసు దేవుడా?

సమాధి తరువాత కూడా యేసు సజీవుడిగా చూపించుకొన్నట్లు నలుగురు సువార్తీకులు కూడా ఆయా సంఘటనలను తెలియజేయుచున్నారు. ఒకసారి యేసు శిష్యులకు కనబడినప్పుడు తోమా అను శిష్యుడు అక్కడ లేదు. తరువాత మిగిలిన శిష్యులు ఈ విషయం తోమాకు చెప్పగా తోమా నమ్మలేదు. ఆయన సూటిగా ఇలా అన్నాడు, “నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.”

వారం రోజుల తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. యేసు తోమాతో ఇలా అనెను, “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.” అందుకు తోమా “నా ప్రభువా, నా దేవా” అనెను.

యేసు “నీవు నన్ను చూచి నమ్మిటివి, చూడక నమ్మినవారు ధన్యులని”27 అతనితో చెప్పెను.

నీ అవకాశం.

యేసు క్రీస్తు ఇదంతా ఎందుకు చేసాడు? ఎందుకంటే, మనము ఆయన యందు విశ్వాసముంచి ఈ జీవితంలో దేవుని తెలుసుకొనుటకు చేశాడు.

యేసుక్రీస్తు ఆయనతో సంబంధం కలిగియుండుట ద్వారా ఇంకా అర్ధవంతమైన జీవితమునకు అవకాశం ఇచ్చుచున్నాడు. “వారు జీవము కలిగియుండుటకు అది సమృద్ధిగా ఉండుటకు నేను వచ్చియున్నానని యేసు చెప్పెను.”28

నీవు ఇప్పుడే ఆయనతో అన్యోన్యమైన సంబంధాన్ని ప్రారంభించవచ్చు. నీవు ఈ భూమి మీద మరణించిన తరువాత నిత్యజీవంలో దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకొనుటకు ప్రారంభించవచ్చు. దేవుని వాగ్దానం ఇలా ఉన్నది.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”29

యేసు సిలువలో మన పాపములను ఆయన మీద వేసుకొనెను. మన పాపము మనకు ఆయనకు మధ్య ఇక ఎన్నడు అడ్డుగా ఉండకుండలాగున మన పాపముల నిమిత్తము శిక్షపొందుటకు ఎంచుకున్నాడు.

ఆయన నీ పాపము కొరకు సంపూర్తిగా మూల్యం చెల్లించినాడు గనుక ఆయన పరిపూర్ణ క్షమాపణయు ఆయనతో సంబంధం కలిగియుండుటకు అవకాశం ఇస్తున్నాడు.

నీవు ఈలాగు సంబంధాన్ని ప్రారంభించవచ్చు.

యేసు క్రీస్తు చెప్పుచున్నాడు, “ఇదిగో నేను (హృదయమనెడి) తలుపునొద్ద నిలుచుంది తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చెదను.”30

నీవు ఇప్పుడే యేసు క్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు. నీవు చెప్పు మాటలు ముఖ్యముగాదు గాని ఆయన నీకోసం చేసిన దానిని మరియు ఆయన నీకు ఇస్తున్న దానిని దృష్టిలో ఉంచుకొని ఎలా స్పందిస్తావు అన్నది ముఖ్యం. నీవు ఆయనతో ఇలా అనవచ్చు. “యేసయ్యా నేను నీయందు విశ్వాసముంచుచున్నాను. నా పాపములు క్షమించి ఇప్పుడే నా జీవితములోనికి రండి. నేను నిన్ను గూర్చి తెలుసుకొని వేమ్బదించాలనుకొంటున్నాను. నా జీవితం లోకి ఇప్పుడే వచ్చినందుకు నీతో ఒక సంబంధం ఇచ్చినందుకు వందనములు.”

నీ జీవితంలోకి యేసును నీవు ఆహ్వానించినట్లయితే, నీవు ఇంకా ఆయనను తెలుసుకొనుటలో ఎదుగుటకు, సహాయం చేయుటకు ఇష్టపడుతున్నాము. మేము ఏవిధముగా సహాయము చేయగలమన్న విషయములో క్రింద ఉన్న లింక్ ను ఉపయోగించగలరు.

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

Adapted from Know Why You Believe by Paul E. Little, published by Victor Books, copyright (c) 1988, SP Publications, Inc., Wheaton, IL 60187. Used by permission.

(1) మత్తయి 7:29 (2) మత్తయి 16:15-16 (3) యోహాను 5:18 (4) యోహాను 10:33 (5) మార్కు 14:61-64 (6) యోహాను 8:19; 14:7 (7) 12:45; 14:9 (8) 12:44; 14:1 (9) మార్కు 9:37 (10) యోహాను 15:23 (11) యోహాను 5:23 (12) యోహాను 10:38 (13) యోహాను 8:46 (14) 1 పేతురు 2:22 (15) మత్తయి 27:54 (16) యోహాను 9:25, 32 (17) మార్కు 4:41 (18) యోహాను 11:48 (19) యోహాను 14:6 (20) యోహాను 8:12 (21) యోహాను 10:28 (22) మార్కు 9:31 (23) 1 కొరింథీ. 15:14 (24) యోహాను 10:18 (25) మత్తయి 26:52,53 (26) అపొ. 1:3 (27) యోహాను 20:24-29 (28) యోహాను 10:10 (29) యోహాను 3:16 (30) ప్రకటన 3:20

ఇతరులతో పంచుకోండ  

TOP