జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు

దేవునితో ఆరంభించుట

నేను నా జీవితంలోనికి యేసును ఆహ్వానించినప్పుడు, ఆయన నాలో నిజముగా ఉన్నాడని నేను ఎలా తెలుసుకోగలను?

యేసును మీ జీవితంలోనికి మీరు ఆహ్వానించుట చాలా అద్భుతమైన విషయం! మీరు ఆ నిర్ణయం తీసుకొను ఆయనను మీలోని ఆహ్వానించినప్పుడు, ఇది తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యము, దేవుడు మీ ప్రార్థన వినినా? విన్నాడు. “మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము” అని 1 యోహాను 5:14 చెబుతుంది. మనం అడిగినయెడల మన జీవితములోనికి ప్రవేశిస్తానని యేసు వాగ్దానం చేశాడు.

ప్రకటన 3:20లో యేసు ఈ మాటను చెబుతున్నాడు, “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.” మీ హృదయ ద్వారమును మీరు దేవుని కొరకు తెరిచారా? తెరచినయెడల, ఏమి చేస్తానని ఆయన అన్నాడు? దేవుడు మిమ్మును తప్పు దారి పట్టిస్తాడా?

"తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను" అని యోహాను 6:37లో యేసు చెప్పాడు. మరియు “నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు” అని యోహాను 10:27-29లో యేసు చెప్పాడు.

మన పాపముల నిమిత్తం యేసు సిలువపై మరణించెను, మరియు తద్వారా ఆయనతో మనం అనుబంధం కలిగియుండవచ్చు. ఈ సమస్యను ఆయన పట్టించుకోనివాడు కాడు. ఆయనతో మనలను అనుబంధములోనికి నడిపించుటకు ఆయన గొప్ప కృషి చేశాడు. యేసు మన పాపములను తమపై వేసుకొని ఆయన నీతితో మనలను కప్పి, మనలను పరిపూర్ణంగా క్షమించి సంపూర్ణంగా మనలను అంగీకరించాడు. మనం ముందు మంచి జీవితాలను జీవించవలసిన పని లేదు, లేక మత ఆచారములను చేయవలసిన పని, లేక ఏళ్ళ తరబడి ఆయనను భిక్షమడగవలసిన పని కూడా లేదు. మనం ఆయనతో అనుబంధం కలిగియుండుటను ఆయనే సాధ్యపరచాడు. మరియు మనము చేసిన క్రియల మూలముగా గాక, ఆయన మన కొరకు చేసిన దాని ఆధారంగా మనం ఆయన యొద్దకు వచ్చాము. మనలను క్షమించుటకు మరియు మన జీవితాలలోనికి వచ్చుటకు, ఆయన మన పాపములను క్షమించెను. "ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు" అని 1 పేతురు 3:18 చెబుతుంది.

దేవునితో మీ అనుబంధంలో ఎదుగుటకు:

దేవుని గూర్చి మరింత తెలుసుకొనుటకు, ఆయన వాక్యముతో (బైబిల్) సమయము గడిపి, తన్ను తాను మీకు మరింతగా ప్రత్యక్షపరచుకొనమని మరియు ఆయనతో మీ అనుబంధమును కట్టమని అడగండి. యోహాను సువార్తతో (క్రొత్త నిబంధనలోని నాల్గవ పుస్తకం) దీనిని ఆరంభించుటకు గొప్ప పుస్తకము.

మరియు ఆయనతో స్వతంత్రంగా మాట్లాడండి. “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును” అని మనము ప్రోత్సహించబడితిమి (ఫిలిప్పీ. 4:6,7)

మాకు ఈమెయిలు చెయ్యండి. మీ క్యాంపస్ లో మీకు లభించే బైబిల్ అధ్యయనాలను గూర్చి మరియు క్యాంపస్ కార్యకలాపాలను గూర్చి మీకు తెలియజేయాలని ఆశించుచున్నాము.

TOP