జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

మారిపోయిన జీవితానికి ఆధారం

నా జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను అని ఎప్పుడైన అనుకున్నా నా? శాశ్వతంగా నీ జీవితాన్ని మార్చివేసే విధానం.

జోష్ మెక్ డొవెల్

నేను సంతోషముగా ఉండాలనుకుంటునాను. ప్రపంచం మొత్తంలో సంతోషముగా ఉండేవారిలో నేను ఒకడిగా ఉండాలనుకుంటున్నాను. నా జీవితము యొక్క అర్ధాన్ని తెలుసుకోవాలనుకుంటునాను. నేను చాలా ప్రశ్నలకు జవాబు వెతుకుతునాను.

  • నేను ఎవరు?
  • నేను ఈ లోకంలో ఇక్కడే ఎందుకు వున్నాను?
  • నా జీవితం ఎటు వెళ్ళుతుంది?

నేను స్వేచ్చగా ఉండాలనుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్నవారందరిలో నేను పూర్తి స్వేచ్చ కలిగిన వ్యక్తిగా ఉండాలని ఉంది. నా విషయంలో స్వేచ్చ అంటే నాకు నచ్చినది మాత్రమే చేయటం కాదు. అలా అయితే ఎవరన్న చేయగలరు. కాని, నాకు స్వేచ్చ అంటే నీవు ఏదైతే చెయ్యాలో అది చేసేటువంటి అధికారం కలిగి ఉండటం. చాలా మందికి వారు ఏమి చేయ్యాలో తెలుసుకాని ఆపని చేసే అధికారం ఉండదు. కాబట్టి నేను సమాధానాలను వెదకడం మొదలుపెట్టాను.

మంచి మార్పుని ఎక్కడ పొందగలం?

ఈ లోకంలో ప్రతిఒకరు ఏదో ఒక మతాన్ని వెంబడిస్తూనే ఉంటారు, నేను కూడా అదే చేసాను, చర్చికి వెళ్ళేవాడిని. నేను మంచి చర్చ్ కు వెళ్ళలేదేమో అనిపించేది ఎందుకంటే నేను ఏమి మారలేదు. నేను చర్చికి ఉదయం వెళ్ళేవాడిని, మధ్యానం, సాయంత్రం కూడ వెళ్ళేవాడిని. కాని నాకు ఏమి ఉపయోగంలేదు. నేను ఏదైన పాటించె వ్యక్తిని, ఏదైనా మార్పు తీసుకురాకపొతే నేను అసల పాటించను, వదిలేస్తాను కాబట్టి మతాన్ని వదిలేశాను.

జీవితం మారాలంటే పరువు సంపాదిస్తే సరిపోతుందనిపించింది. ఒక్క నాయకుడిగా ఉండి ఒక లక్ష్యం కలిగి జీవిస్తూ ఆ లక్ష్యం కోసమే పని చేస్తూ ఉంటే సరిపోతుందని అనుకుందాం. నేను చదివే విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ లీడర్స్ మంచి అధికారం, పలుకుబడి కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి, పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లాస్ లకు అధికారిగా పోటిచేసి ఎన్నుకోబడ్డాను. నాకు చాలా పరువు వచ్చినట్టుగా భావించాను, నేను అందరికీ తెలిసిపోయాను, పెద్ద నిర్ణయాలు తీసుకునేవాడిని, విశ్వవిద్యాలయం డబ్బు కర్చుపెట్టి నాకు నచ్చిన వారిని తీసుకువచ్చి మాట్లాడించేవాడిని. బాగానే ఉంది, కాని నేను ప్రయత్నించినవని ఎలాగైతే మార్చలేదో ఇది కూడా నన్ను మార్చలేదు. సోమవారం ఉదయం లేచి తలనొప్పితో పడుకునేవాడిన్ని. సోమవారం నుండి శుక్రవారం వరకూ భరించేవాడిని. వారంలో మూడు రాత్రులు మాత్రమే సంతోషముగా ఉండేవాడిని, శుక్రవారం రాత్రి, శనివారం, ఆదివారం మళ్ళీ భయంకరమైన జీవితం ప్రారంభమయ్యేది.

జీవితం మార్పుకోసం వెదకటం, మంచి మార్పు.

కాలేజీలలోను, విస్వవిద్యాలయాలలోనూ ఉన్న వారిలో, కొంతమంది, యదార్ధంగా, జీవితము యొక్క అర్ధాన్ని, సత్యాన్ని, జీవితపు ఉద్దేశాన్ని నాకంటే ఆశక్తిగా వెతుకుతున్నారు.

నా జీవితపు ప్రయాణములో నేను ఒక చిన్నగ్రూప్ ని కలుసుకున్నాను. అందులో ఎనిమిది మంది విద్యార్ధులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉండటం గమనించాను. వాళ్ళు దేనిన్నైతే నమ్మాలో చాలా గట్టి విశ్వాసంతో నమ్మి ఉన్నారని గ్రహించాను. వాళ్ళు వెంబడిస్తున్న మార్గంలో ఎక్కడకి వెళ్ళుతున్నారో బాగా తెలిసినవారుగా కనబడ్డారు.

నేను గమనించిన విద్యార్ధులు కేవలం ప్రేమ గురించి మాట్లాడటమే కాదు - వారు అందులో పాలుపొందుతున్నారు. విశ్వవిద్యాలయపు జీవిత పరిస్థితులను చాలా సులభంగా అధికమిస్తున్నారు, మిగతా విద్యార్ధులంతా ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతుంటే మీరేమో చాలా ప్రశాంతంగా వాళ్ళ పరిస్తితులను గెలుస్తునారు. వాళ్ళ హృదయంలో లోతైన ఆనందాని కలిగి వున్న వారలాగా కనబడ్డారు. వాళ్ళు చాలా ప్రత్యేకమైన రీతిగా సంతోషముగా ఉన్నారు. నాకనిపించినది ఏమిటంటే వీరిదగ్గర ఉన్నది నా దగ్గర లేదు.

అందరి విద్యార్ధులలాగా నా దగ్గర లేనిది ఎవరి దగ్గరైన ఉంటే నాకు అది కావాలనిపిస్తుంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకునాను, వీరితో స్నేహంచేయాలనుకునాను. నేను ఆ నిర్ణయం తీసుకున రెండు వారాలకు మేమందరం విద్యార్ధుల యూనియన్ లో కూర్చుని ఉన్నాం: ఆ విద్యార్ధులు మరియు ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసిన మా సంభాషణ మళ్ళికొనసాగింది.

జీవితము యొక్క మార్పు గురించి అడగటం - మంచి మార్పు

వాళ్ళు నన్ను చాలా టెన్షన్ పెడుతున్నారు, కాబట్టి ఆఖరికి ఆతురత తట్టుకోలేక చాలా అందముగా ఉన్న ఒక విద్యార్ధిని వైపు చూసి (నేననుకునేవాడిని, క్రైస్తవులు చాలా చండాలంగా ఉంటారని) నా కుర్చీకి వెనకకు వాలాను,(ఎందుకంటే నేను బాగా ఆతురతగా వున్నానని వారు గ్రహించకూడదనుకునాను) మీ జీవితాలను మార్చనది ఏమిటి? అని అడిగాను. మన కాలేజీలో ఉన్న వారందరికంటే మీ జీవితాలు ఎందుకింత ప్రత్యేకముగా ఉన్నాయి? అని అడిగాను.

అక్కడ ఉన్న యవ్వనస్తురాలు చాలా నమ్మకంకలిగినది. ఆమె, నేనడిగిన ప్రశ్నకు నా కళ్ళలోకి సూటిగా చూసి నేను ఊహించలేని నా సమస్యలకు పరిష్కారం గురించి రెండు పదాలు చెప్పింది: " యేసుప్రభువు."

వెంటనే నేను," బాబోయ్, నాకు ఆ చెత్తను ఇవ్వదు,నేను మతాలను బట్టి విసిగిపోయాను,చర్చ్ అంటే విసుగొచ్చెసింది,బైబిల్ అంటే చిరాకు వచ్చింది. నాకు ఆ చెత్తంతా ఇవ్వద్దు ", అని అన్నాను.

ఆమె వెంటనే సూటిగా ఇలా చెప్పటం మొదలు పెట్టింది," నేను మతం అనలేదు, నేను యేసుక్రీస్తు అన్నాను." నాకు ఇంతవరకూ తెలియని ఒక విషయం స్పష్టం చేసింది. క్రైస్తవ్యం మతం కాదు. మతం అంటే మానవుడు తన మంచి పనల ద్వారా దేవుడిని చేరటం: క్రైస్తవ్యంలో దేవుడు మానవుల యొద్దకు యేసుక్రీస్తు ద్వార వచ్చి దేవునితో సంబంధం కలిగియుండేలా చేయటం.

ప్రపంచంలో ఉన్న వారందరికంటే కాలేజీల్లో వున్న వారికే క్రైస్తవ్యం పట్ల ఎక్కువ చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి. కొంతకాలం క్రిందట నేను ఒక అధ్యాపకుని సహకారిని కలిశాను, ఆయన ఒక డిగ్రీపట్టా పొందే సెమినార్లో ఇలా అన్నాడు,"ఎవరైతే చర్చికి వెళ్ళతారో వారు క్రైస్తవులుగా మారిపోతారు అని." అందుకు నేను ఇలా అన్నాను," కారులషడ్ లోకి నడిచిన ప్రతి ఒకడు కారులాగా మారిపోడు కాదా?" క్రీస్తునందు నిజముగా విశ్వాసముంచినవాడె క్రైస్తవుడు అని నాకు చెప్పబడింది.

నేను క్రైస్తవ్యాన్ని గమనిస్తూ ఉండగ నా నూతన స్నేహితుడు యేసుప్రభువు జీవితాన్ని ఙ్ఞానంతో పరిశోధించమని సవాలు చేశాడు. నేను చేసిన పరిశోధనలో తెలుసుకున్నదేమిటంటే, బుద్ధుడు, మొహమద్ మరియు ఎప్పుడు కూడా నేను దేవుని అని అనలేదు, కాని యేసుప్రభువారు తానే దేవుడని అన్నారు. యేసుప్రభువారి దైవత్వమును కరుణించి పరిశీలన చెయ్యమని నా స్నేహితులు చెప్పారు. నా స్నేహితులు ధృడముగా నమ్మిందేమిటంటే యేసుక్రీస్తు, నరుడిగా వచ్చిన దేవుడని, మానవులు పాపముల నిమ్మిత్తము శిలువమీద మరణించారని, ఆయన పాతిపెట్టబడ్డారని, మూడుదినముల తర్వాత తిరిగి లేచాడని,కాబట్టి ఆయన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలడు.

ఇది అబద్దం అనుకునేవాడిని, నిజానికి, క్రైస్తవులందరు పిచ్చివాళ్ళనుకున్నను. నేను కొంతమందిని కలిశాను కూడా. క్లాసులో క్రైస్తవుడు లెగిచి ఏదైనా ప్రశ్న అడిగితే వాడిని ఎగతాలి చేసి కించపరచేవాడిని, అధ్యాపకులను ముఖము మీద కొట్టాలనిపించేది. క్రైస్తవుడకి ఆలోచనశక్తి తక్కువ అనుకునేవాడిని

కాని మీరు మళ్ళీ మళ్ళీ నాకు సవాలు విసిరేవారు. ఆఖరికి, నేను వారి సవాలును ఒప్పుకున్నాను.గర్వంతో వాళ్ళను గెలుద్దాం, వారికి అధారాలు లేవు కదా అనుకున్నాను.పరిశోధించి చూడటానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనుకున్నాను.

అనేక నెలల అధ్యాయనం, పరిశోధన తర్వాత నా మనస్సు చెప్పిన విషయం ఏమిటంటే యేసుప్రభు వారు నిజముగా దేవుడు. ఇది చాలా సమస్యను తెచ్చింది. నా మనసేమో ఆయన నిజమైన దేవుడు అని చెబుతుంది కాని నా ఆలోచనలు వేరే వైపు లాగేస్తున్నాయి.

నాకు అర్ధమైన విషయం ఏమిటంటే క్రైస్తవుడిగా మారటం అంటే నీ గర్వాన్ని పొగరును అణచివేయటం. యేసుక్రీస్తు నాకు సూటిగా సవాలు చేసిందేమిటంటే," ఆయనను నమ్మమని."ఆయన చెప్పిన మాటలను ఇలా చెప్పవచ్చు," సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక." యేసయ్య నిజముగా నీటిమీద నడిచారా, ఆయన నిజముగా నీళ్ళను ద్రాక్షరసముగా మార్చారా అనేటువంటి దాన్ని నేను పట్టించుకోలేదు. నాకున్న మంచి సమయ్యాన్ని నేను ఇంకా పాడు

చేసుకోవాలనుకోలేదు. ఆఖరికి నా మనస్సు నాతో చెబుతుంది ఏమిటంటే క్రైస్తవ్యం నిజం. నా ఆలోచనలు పరుగెడుతున్నాయి అని.

నా జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను

ఉత్సాహముగా ఉండేటువంటి ఆ క్రైస్తవుల మధ్యలో ఉండేటప్పుడు గొడవ పడుతూ ఉండేవాడిని. మీరు ఎప్పుడైన సంతోషముగా ఉన్నవారి మధ్యలో బాధగా వున్నట్లయితే ఆ భాద యొక్క విలువ నీకు బాగా అర్ధమవుతుంది.విద్యార్ధుల యూనియన్ అయిన వాళ్ళందరు చాలా సంతోషముగా ఉండేవాళ్ళు. కాని, నేను ఏమో చాలా బాధగా ఉంటూ వారి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండేవాడిని. కొనిసార్లు రాత్రిపది గంటలకు నిద్రించటానికి వెళ్ళినప్పటికి ఉదయం నాలుగు గంటల వరకు నిద్రపట్టేది కాదు. నేను పిచ్చివాడిని కాక మునుపే ఈ విషయానికి పరిష్కారం వెతకాలి అనుకున్నాను. ఆఖరిగా నా మనస్సు నా ఆలోచనలు కలిసాయి డెసెంబర్ -19- 1959 రాత్రి 8.30 నిమిషాలకు నేను విశ్వవిద్యాలయములో రెండవ సంవత్సరం చదువుతున్నాను నేను క్రైస్తవుడను అయ్యాను. ఆ రాత్రి నేను యేసుప్రభు వారితో సంబంధాన్ని స్థాపించటం కోసం నాలుగు విషయాల గురించి ప్రార్ధించాను. మొదటిగా " ప్రభువైన యేసు నా కోసం శిలువ మీద మరణించినందుకు నీకు కృతఙ్ఞతలు అన్నాను." "రెండవదిగా నీకు ఇష్టములేన్నటువంటి నా పాపాల్ని నీ సన్నిధిలో ఒప్పుకుని, నన్ను క్షమించి పూర్తిగా కడగమన్నాను." " మూడవదిగా నా హృదయపు ద్వారాన్ని తెరచి మరియు నా జీవితములో నీవు రక్షకుడవు, ప్రభుడవు అని నీ మీద నమ్మకము ఉంచుచున్నాను. నన్ను పూర్తిగా మార్చి వేసి నా జీవితాన్ని నీ ఆధీనములో ఉంచుకో. నన్ను నీవు ఎలాగైతే సృష్టించావో అటువంటి వ్యక్తిగా మార్చమని అన్నాను. ఆఖరిగా నేను చేసిన ప్రార్ధన ఏమిటంటే విశ్వాసము ద్వారా నా జీవితములోకి వచ్చినందుకు నీకు కృతఙ్ఞతలు." ఇది అఙ్ఞానముతో తీసుకున్నటువంటి నిర్ణయము కాదు. కాని, విశ్వాసముతో చరిత్ర యొక్క ఆధారముతో మరియు నీ వాక్యము యొక్క రుజువులతో తీసుకున్న నిర్ణయం.

మత సంబంధమైనటువంటి గొప్ప గొప్ప ఆత్మీయ అనుభవాల్ని అనేకమంది చెబుతూ ఉండగా మీరు వినే ఉంటారు. అయితే, నా ప్రార్ధన అయిపోయాక ఇటువంటివి ఏమి జరగలేదు. నిజానికి నేను ఈ నిర్ణయం తీసుకున్న తరువాత నేను ఇంకా వున్నాను. నాకు ఏదో గందరగోలముగా అనిపించింది. అమో, లేదు, దేంట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయ్యావు? నిజానికి నాకు లోతైన ప్రదేశములో చివరకి వెళ్ళినట్టనిపించింది.(కొంతమంది కూడా నా గురించి ఇలానే ఆలోచిస్తునారేమో).

దేవుడు మరియు జీవితము యొక్క మార్పు, నిజమైన మార్పు

కాని, ఆరు నెలలలో ఒక సంవత్సరంనరకి నాకు అర్ధమైనది ఏమిటంటే నేను లోతులోనికి వెళ్ళలేదు, నా జీవితము మారిపోయింది. మిడ్ వెస్టరన్ విశ్వవిద్యాలయములోనికి చరిత్రకు సంబంధించిన విభాగములో నేను వాదించాను కూడా. నేను అన్నాను నా జీవితము మారిపోయింది అని. నేను మాట్లాడుతూ ఉండగా ఆయన ఆపి "మెక్ డోవెల్, ఈ 20వ శతాబ్దములో దేవుడు నిజముగా నిన్ను మార్చాడని అంటున్నావా? ఏ విషయములో నిన్ను మార్చాడు? " 45 నిమిషాల తరువాత ఇంకా చాలు ఆపు అన్నాడు. ఆ రోజు వాళ్ళతో చెప్పిన కొన్ని సంగతులు మీతో కూడా చెప్పాలనుకుంటునాను.

దేవుడు నా జీవితాన్ని మార్చివేసినటువంటి విషయాలలో ఒక విషయం ఏమిటంటే విశ్రాంతి లేని నా జీవితాన్నికి విశ్రాంతి కలిపించాడు. నేను ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో నింపబడుతూ ఉండేవాన్ని, కాలేజి క్యాంపస్ లో నడుస్తున్నప్పుడు నా మనస్సు నిండా తుఫానులాంటి ఆలోచనలతో మనస్సులో పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉండేది. చదువుకోటానికి కూర్చున్నప్పుడు కూడా చదువుకోలేకపోయేవాడిని. కాని యేసుప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నాకు విశ్రాంతి కలిగింది నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. నేను సమస్యలు లేవని చెప్పటం లేదు. నేను యేసుప్రభు వారితో కలిగియున్నటువంటి ఈ సంబంధము సమస్యని తీసి వేయలేదు కాని, సమస్యలో నిలబడేటువంటి శక్తిని ఇచ్చింది. ఈ లోకములో మరి ఏ విషయమునకైనను ఈ సంబంధాన్ని విడిచిపెట్టలేను.

నా జీవితములో కలిగినటువంటి మార్పు ఏమిటంటే, నాకున్న చెడ్డకోపము పోయింది. ఎవరన్న నా వైపు కోపముగా చూస్తే నేను తట్టుకోలేకపోయేవాడని. నా మొదటి సంవత్సరములో నా కోపముతో ఒక వ్యక్తిని చంపేదాకా వెళ్ళాను. నాకున్న ఆలోచనలలో నాకున్న కోపాన్ని మార్చుకోలేకపోయాను.కాని, వుప్పుడు నాకు పూర్తిగా నా కోపం పోయింది. 14 సంవత్సరాల్లో కేవలం ఒకసారే కోపడ్డాను.(కాని అప్పుడు వచ్చిన కోపము మళ్ళీ ఆరు సంవత్సరముల వరకు అలా జరగకుండా జాగ్రత్త పడ్డాను).

ద్వేషములో నుండి మంచి మార్పు

నా జీవితములో నేను ద్వేషము అనే విషయములో నేను మార్పు పొందాను. నేను ఏమి గర్వపడటలేదు కాని, మనలో అనేకమందికి వాళ్ళ జీవితములలో ఈ విషయములలో మార్పు కావలసివుంది. ఆ మార్పుకి కారణం: యేసు ప్రభువారితో సంబంధం కలిగి ఉండటం. నా జీవితములో చాలా ద్వేషము ఉండేది ఇది ఎవరు బయటకు చూపించేది కాదు. కాని, లోలోపల ఇది పెరుగుతూనే ఉండేది. నేను ప్రజల మీద వేరు వేరు సందర్భాలలో, పరిస్థితులలో ద్వేషం పెట్టుకునే వాడిని.

ప్రపంచములో నేను ద్వేషించిన వారందరిలోకి నేను ఎక్కువగా ద్వేషించిన వ్యక్తి నా తండ్రి. నేను ఆయన ధైర్యాన్ని ద్వేషిస్తూ ఉండేవాన్ని. నా దృష్టిలో ఆయన ఒక త్రాగుబోతు. మా ప్రాంతంలో అందరికి మా నాన్న త్రగుబోతు అని తెలుసు. నా స్నేహితులు అనేకసార్లు నా తండ్రి వీధులలో తిరుగుతునాడని జోకులు వేస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయము నన్ను బాధపెడుతుందని వారు ఎప్పుడు ఆలోచించలేదు. మిగతా వాళ్ళతో కలిసి బయటకి నవ్వుతూ ఉండేవాని కాని నిజానికి లోపల ఏడుస్తూ ఉండేవాన్ని. మా ఇంటి వెనకాల వున్నటువంటి పసువుల పాకలో నా తల్లిని పడేసి మా న్నాన కొడుతూ ఉండటం చుసేవాడిని. ఆమె ఆ పసువుల మధ్యలో పడిపోయి లెగవలేక బాధపడుతూ ఉండటం అనేక సార్లు గమనించాను.నా చుట్టూ స్నేహితులు వున్నప్పుడు, మా న్ననని బయటకు తీసుకువెళ్ళి పసువుల పాకలో కట్టేసి ఎగతాళి చేస్తూ ఉండేవాని. నేను ద్వేషించినంతగ ఎవ్వరు వాళ్ళ తండ్రులను ద్వేషించి ఉండరేమో.

యేసుప్రభు వారిని నా రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయన నా జీవితములోనికి వచ్చి ఆయన బలమైన ప్రేమతో నా జీవితాన్ని తలకిందులుగా మార్చేశాడు. ఇప్పుడు నేను మా నాన్న గారి కళ్ళలోకి చూసి నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలను.

నేను ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి మార్చుకున తరువాత నాకు ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్ జరిగింది. నా మెడ బెనికిన కారణాన నన్ను ఇంటికి తీసుకువెళ్ళటం జరిగింది. నా తండ్రి నా గదిలోకి వచ్చి అన్న మాట నా జీవితములో ఎప్పటికి మర్చిపోలేను. ఆయన అన్నారు," కుమారుడ నాలాంటి తండ్రిని నీవు ఎలా ప్రేమించగలుగుతున్నావు?, నేనన్నాను ఆరు నెలలకు ముందు నేను నిన్ను అవమానించాను." తరువాత యేసుప్రభు వారితో నా అనుభవం గురించి వివరించాను."యేసుప్రభు వారిని నా జీవితములోనికి ఆహ్వానించాను నాన్న గారు. ఏమి జరిగిందో పూర్తిగా వివరించలేనేమో గాని ఆయనతో నాకున్న సంబంధమే నన్ను ప్రేమించేలాగా, నిన్ను మాత్రమే కాక అనేకమందిని నా జీవితములోనికి అంగీకరించేలాగా చేసింది.”

45 నిమిషాల తరువాత నా జీవితములో ఎప్పుడు జరగనటువంటి ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మా కుటుంబంలో వున్న వ్యక్తి, ఎవరి కళ్ళలోకి అయితే నేను చూసి మాట్లాడలేనో, ఆయన నాతో ఇలా అన్నాడు: కుమారుడా నీ జీవితములో వచ్చిన మార్పు నా జీవితములో కూడ రావటానికి నేను దేవునికి అవకాశం ఇస్తునాను." వెంటనే ఆయన మోకరించి నా తండ్రి నాతో పాటు ప్రార్ధన చేసి యేసుప్రభుని తన పాపాలు క్షమించమని అడిగాడు.

సాధారణంగా కొన్ని రోజులకు, వారాలకు, నెలలకు లేక సంవత్సరానికి గాని కొంత మంది మారరు. కాని, నా తండ్రి యొక్క జీవితం నా కళ్ళముందే మారిపోయింది. ఎవరో లైట్ వెసినట్టుగా ఉంది. నా జీవితంలో అంతకముందు కాని తరువాత కాని అటువంటి మార్పును చూడలేదు. మళ్ళి మా నాన్న తాగలేదు. కేవలం ఒకసారి మాత్రమే ఆయన బ్రాందీ సీసా తీసుకుని ఆయన నోటి దగ్గర దాక తీసుకువచ్చి కిందపెట్టేసాడు. యేసయ్యతో సంబంధం జీవితాలను మార్చివేస్తుంది.

జీవితం మారిపోవటం: మంచి మార్పు

నువ్వు క్రైస్తవుడని చూసి నవ్వచ్చు, ఎగతాళిచేయవచ్చు కాని సత్యమేమిటంటే జీవితాలు మారతాయి. నీవు యేసయ్యని వెంబడిస్తున్నట్లయితే నీ జీవితాన్ని గమనించు, నీ స్వభావాన్ని గమనించు ఎందుకంటే యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు కాబట్టి.

నేను చేసిన ప్రార్ధన నీకు సహాయపడుతుందనుకుందనుకుంటాను." ప్రభువైన యేసు, నాకు నువ్వు కావాలి. నా కోసం శిలువపై చనిపోయినందుకు కృతఙ్ఞతలు. నన్ను క్షమించి నా పాపములను కడుగు. ఈ క్షణంలో నీవు నా రక్షకునిగా ప్రభుగా నమ్ముచునాను. నువ్వు నన్ను ఎలా అయితే సృష్టించావో అలా నన్ను మార్చు. ఆమెన్

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP