జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

రతి మరియు సాన్నిహిత్యం కొరకు అన్వేషణ

ఎలా ప్రేమించాలో మరియు ఎలా ప్రేమించబడాలో తెలుసుకోండి. మీ అనుబంధాలలో నిజమైన సాన్నిహిత్యమును అనుభవించండి...

Richard Purnell

దంపతులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఒక లక్షణ సంపుటితో (syndrome), ఒక క్రమతతో వస్తారని Collegiate Challenge మ్యాగజిన్ లో Dr. Henry Brandt చెప్పాడు. వారంటారు, “ఆరంభంలో రతి అద్భుతంగా ఉండేది. తరువాత నా గురించి నేను వింతగా భావించేవాడను/దానిని, మరియు తరువాత నా భాగస్వామిని గూర్చి వింతగా భావిస్తాను. మేము వాదించాము, పోట్లాడాము మరియు చివరికి విడిపోయాము. ఇప్పుడు మేము శత్రువులము.”

ఈ లక్షణ సంపుటిని నేను మార్నింగ్-ఆఫ్టర్ సిండ్రోమ్ అని పిలుస్తాను. మేము నిద్ర లేచి చూస్తే ఆ సాన్నిహిత్యం అసలు లేదు. లైంగిక సంబంధం మమ్మును సంతృప్తి పరచుటలేదు, మరియు మేము కోరినది జరిగిపోతుంది. చివరికి మిగిలేది స్వయం సంతృప్తి కొరకు అన్వేషించు ఇద్దరు స్వార్థపరులు మాత్రమే. నిజమైన ప్రేమ మరియు సాన్నిహిత్యం “తక్షణమే” పొందలేము, మరియు సామరస్యం కొరకు వెదకుచు మిమ్మును మీరు సమతుల్యం లేని స్థలంలో కనుగొంటారు.

సాన్నిహిత్యం శారీరిక సంబంధం కంటే గొప్పది

ప్రతి జీవితాలలో ఐదు ముఖ్యమైన భాగములు ఉంటాయి. శారీరక, భావాత్మక, మానసిక, సామాజిక, మరియు ఆత్మీయ విషయములు. సాన్నిహిత్యం కొరకు వెదకుచు నేడు, లేక నిన్న మనం పరిష్కారం కోరుకుంటాము. మన సమస్య ఏమిటంటే మనం “తక్షణ” తృప్తిని కోరతాము. ఒక అనుబంధంలో సాన్నిహిత్యం యొక్క అవసరత తీరకపోతే, మనం “తక్షణ” పరిష్కారం కొరకు చూస్తాము. మనం దేని వైపుకు చూస్తాం? శారీరిక, భావాత్మక, మానసిక, సామాజిక లేక ఆత్మీయ? శారీరిక విషయాల వైపు చూస్తాము. ఒక వ్యక్తితో ఇతర నాలుగు భాగములలో కంటే శారీరకంగా సాన్నిహిత్యం కలిగియుండుట చాలా సులభం. ఒక గంట, లేక గంటన్నరలో వ్యతిరేక లింగులతో మీరు శారీరక సాన్నిహిత్యం కలిగియుండగలరు -- అది కేవలం కోరికపై ఆధారపడియుంటుంది. కాని రతి అనేది పైపై కోరికకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని మీకు త్వరగా అర్థమవుతుంది. తీరని మరింత లోతైన అవసరత ఒకటి ఉన్నది.

మీరు ఎంతగా రతిలో పాల్గొంటే, అంత తక్కువ దానిని మీరు ఇష్టపడతారు కాబట్టి ఆ ఆహ్లాదం తీరిన తరువాత మీరేమి చేస్తారు? “మేము ప్రేమలో ఉన్నాము. కాదు, నిజముగా ప్రేమలో ఉన్నాము” అని దానిని మనం సమర్థిస్తాం. కాని దోషులగా సంతృప్తి లేనివారిగా మిగిలిపోతాము. అమెరికాలోని అనేక క్యాంపసులలో, సాన్నిహిత్యం కొరకు వెదకుచు, పరిస్థితి బాగుపడుతుందని ఆశిస్తూ, “ఈ సారి సంతృప్తి కలుగుతుంది. ఈ సారి నిలచే అనుబంధాన్ని నేను పొందుతాను,” అని ఒక అనుబంధం నుండి మరొక అనుబంధములోనికి ప్రయాణించు స్త్రీ పురుషులను నేను చూశాను.

మనం నిజంగా కోరుకొనేది రతి కాదు అని నా నమ్మకం. మనం నిజంగా కోరుకొనేది సాన్నిహిత్యం.

నేడు, సాన్నిహిత్యం అను మాటకు లైంగిక అర్థాలు ముడివేయబడ్డాయి. కాని అది దాని కంటే చాలా ఎక్కువ. దానిలో మన జీవితాల యొక్క వేర్వేరు కోణములు ఉన్నాయి -- అవును, శారీరక, సామాజిక, భావాత్మక, మానసిక మరియు ఆత్మీయ విషయాలు కూడా. సాన్నిహిత్యం యొక్క నిజమైన అర్థం సంపూర్ణ జీవితం పంచుకొనుట. ఒక వ్యక్తితో సంపూర్ణంగా జీవితమును పంచుకోవాలనే ఆశ ఏదో ఒక సమయంలో మనకు కలుగలేదా?

సాన్నిహిత్యం అంటే భయం – ప్రేమించబడుట అంటే భయపడుట?

Marshall Hodge అను రచయిత Your Fear of Love అను పుస్తకమును వ్రాసాడు. దానిలో ఆయన అంటాడు, "ప్రేమ, ఆప్యాయత మరియు సున్నితత్వం వంటి భావములు కలిగిన క్షణముల కొరకు మనం పరితపిస్తాము, కాని చాలా సార్లు, ముఖ్యమైన తరుణాలలో మనం వెనుకకు తిరుగుతాము. ఆప్యాయత అంటే మనకు భయం. ప్రేమ అంటే మనకు భయం.” ఇది పుస్తకంలో తరువాత Hodge అంటున్నాడు, “ఒక వ్యక్తికి మీరు ఎంత సన్నిహితమైతే, అంత గొప్ప వేదన కలిగే అవకాశం ఉంది.” చాలా సార్లు ఈ వేదన అంటే భయమే మనలను నిజమైన సాన్నిహిత్యం పొందుట నుండి దూరం చేస్తుంది.

-దక్షిణ ఇల్లినొయిస్ లోని ఒక యూనివర్సిటీలో నేను కొన్ని ఉపన్యాసాలు ఇచ్చాను. ఒక మీటింగ్ తరువాత, ఒక స్త్రీ నా యొద్దకు వచ్చి, “నా బాయ్ ఫ్రెండ్ సమస్యలను గూర్చి మీతో మాట్లాడాలనుకుంటున్నాను” అని అన్నది. మేము కూర్చున్నాము, ఆమె తన సమస్యలు చెప్పుట ఆరంభించింది. కొన్ని క్షణాల తరువాత, ఆమె ఈ మాట అన్నది: “నేను మరలా ఎన్నడు గాయపడకుండా ఉండుటకు తగిన చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాను.” నేనన్నాను, “మరొక మాటలో, మీరు మరలా ఎన్నడు ప్రేమించకుండా చర్యలు తీసుకుంటున్నారు.” నేను అపార్థం చేసుకున్నానని అనుకొని, మాటలు కొనసాగించింది. “కాదు, నేను అలా అనడం లేదు. నేను మరలా గాయపడాలని కోరుటలేదు. నా జీవితంలో నాకు బాధ వద్దు.” నేనన్నాను, “నిజమే, మీ జీవితంలో మీకు ప్రేమ వద్దు.” చూడండి, “బాధ లేని ప్రేమ” అనేది లేనేలేదు. మనం ఒకరికి ఎంత దగ్గరగా వస్తే, అంతగా బాధను ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇంతకు ముందు మీరు కూడా (మరియు జనాభాలో 100 శాతం ప్రజలు) అనుబంధంలో గాయపడ్డారని చెబుతారని నా అంచనా. మీరు ఆ గాయమును ఎలా ఎదుర్కొంటారు అనేది ప్రశ్న? ఆ బాధను కప్పిపుచ్చుట కొరకు, మనలో చాలా మంది ప్రజలకు “రెండు-చిహ్నాలు” ఇస్తాము. “చూడండి, నీవు నాకు దగ్గరవ్వాలని నేను కోరుతున్నాను. నేను ప్రేమించాలనుకుంటున్నాను మరియు నాకు ప్రేమ కావాలి . . . కాని ఒక్క నిమిషం, నేను ఇంతకు ముందు గాయపడ్డాను. వద్దు, ఈ విషయం గూర్చి నేను మాట్లాడదలచుట లేదు. ఈ మాటలను నేను వినదలచుట లేదు.” బయట వారు లోపలికి వచ్చి మనలను గాయపరచకుండా జాగ్రత్తపడుటకు మన హృదయం చుట్టూ మనం కొన్ని గోడలు కడతాము. కాని ప్రజలను బయట పెట్టె అదే గోడ, మనలను లోపల ఇరుక్కునేలా చేస్తుంది. పరిణామం ఏమిటి? ఒంటరితనం కలిగి నిజమైన సాన్నిహిత్యం మరియు ప్రేమ అసాధ్యమవుతుంది.

ప్రేమ అంటే ఏమిటి?

ప్రేమ భావనల కంటే గొప్పది, మంచి భావనల కంటే ఉత్తమమైనది. కాని మన సమాజం ప్రేమ, రతి మరియు సాన్నిహిత్యమును గూర్చి దేవుడు చెప్పిన విషయాలను తీసుకొని వాటిని సామాన్య భావనలు మరియు భావోద్వేగాలతో మార్చింది. దేవుడు ప్రేమను గూర్చి బైబిల్ లో, ముఖ్యంగా మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చాలా తేటగా వర్ణించాడు. ప్రేమను గూర్చి దేవుని నిర్వచనమును మీరు పూర్తిగా అర్థం చేసుకొనుటకు, నాల్గవ వచనము నుండి ఏడవ వచనము వరకు నేను ఈ విధంగా వివరిస్తాను (1 కొరింథీ. 13:4-7). మనం ప్రేమించాలని దేవుడు చెప్పిన విధంగా ఒక వ్యక్తి మిమ్మును ప్రేమించినప్పుడు అది మీ అవసరతలను ఎంతగా తీరుస్తుంది:

  • ఈ వ్యక్తి మీరంటే ఈర్ష్య లేకుండా సహనం, దయతో స్పందిస్తే?
  • ఈ వ్యక్తి ఉప్పొంగ కుండా డంబము లేకుండా ప్రవర్తిస్తే?
  • ఈ వ్యక్తి అమర్యాదగా నడువక త్వరగా కోపపడకుండా ఉంటె ఎలా ఉంటుంది?
  • ఈ వ్యక్తి మీ తప్పిదములను లెక్కపెట్టకుండా ఉంటె?
  • వారు మోసము చేయక, ఎల్లప్పుడూ మీతో సత్యమును చెప్పువారైతే ఎలా ఉంటుంది?
  • ఈ వ్యక్తి మిమ్మును కాపాడి, నమ్మి, మీ మేలు కోరి, మీతో కలుగు ఘర్షణలలో మీతో నిలబడితే ఎలా ఉంటుంది?

అనుబంధాలలో మనం అనుభవించాలని దేవుడు ఆశిస్తున్న ప్రేమను ఆయన ఈ విధంగా నిర్వచిస్తున్నాడు. ఇలాంటి ప్రేమ “ఇతర-వ్యక్తి”పై దృష్టి పెట్టు ప్రేమ అని మీరు గుర్తిస్తారు. ఇది స్వార్థం లేనిది మరియు ఇతరులకు ఇచ్చేది. మరియు ఇక్కడే సమస్య ఉంది. ఇలా ఎవరు చేయగలరు?

నిజమైన సాన్నిహిత్యం కొరకు, మనం ముందుగా ప్రేమను అనుభవించుట అవసరం.

అనుబంధాలలో ఇట్టి ప్రేమను అనుభవించుటకు ముందుగా మనం మన పట్ల దేవుని ప్రేమను అనుభవించాలి. ఇట్టి ప్రేమను మీరు ఎన్నడు అనుభవించకపోతే, ఈ ప్రేమను మీరు ఇతరులకు తరచుగా చూపించలేరు. మిమ్మును యెరిగిన, మీ గురించి సమస్తము తెలిసిన, మిమ్మును పరిపూర్ణంగా ప్రేమించు దేవుడు.

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను” (యిర్మీయా 31:3) అని పురాతన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మీ యెడల దేవుని ప్రేమ ఎన్నడు మారదు.

దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడంటే మన పాపముల నుండి మనం శుద్ధి చేయబడుట కొరకు యేసు క్రీస్తు సిలువవేయబడుటకు (ఊరి శిక్షకు పురాతన విధానం) అనుమతి ఇచ్చాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16) అని మనం బైబిల్ లో చదువుతాము. మనం దేవుని వైపుకు తిరిగి ఆయన క్షమాపణను అంగీకరించినప్పుడు, ఆయన ప్రేమను మనం అనుభవించగలుగుతాము.

"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును" (1 యోహాను 1:9) అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు మన పాపములను కేవలం క్షమించుట మాత్రమే కాదు గాని, వాటిని మరచిపోయి మనలను శుద్ధి చేయుచున్నాడు.

ఈ విధంగా ప్రేమించబడుట ఎలా ఉంటుంది?

ఏది ఏమైనా దేవుడు మనలను ప్రేమిస్తూ ఉంటాడు. చాలా సార్లు, ఒక దుర్ఘటన లేక ఆర్థిక నష్టం వంటివి జరిగినప్పుడు అనుబంధాలు తెగిపోతాయి. కాని దేవుని ప్రేమ మన శరీర రూపంపైన లేక మనం ఎవరు లేక ఏమిటి అను విషయములపై ఆధారపడియుండదు.

మీరు గమనించినట్లే, ప్రేమను గూర్చి సమాజము మనకు చెప్పు ఆలోచనలు ప్రేమను గూర్చి దేవుని ఆలోచనలకు పూర్తిగా భిన్నమైనది. ఇట్టి ప్రేమతో ఒక అనుబంధమును మీరు ఊహించగలరా? తన ప్రేమ మరియు క్షమాపణ మనకు చెందినది అని దేవుడు చెబుతున్నాడు. అది మన కొరకు ఆయన బహుమానం. కాని మనం ఆ వరమును తిరస్కరిస్తే, నిజమైన సంతృప్తి, నిజమైన సాన్నిహిత్యం, మరియు జీవితంలో నిజమైన ఉద్దేశము నుండి మనలను మనం దూరం చేసుకుంటాము.

-దేవుని ప్రేమ జవాబును ఇస్తుంది. మనం చేయవలసినది కేవలము విశ్వాసం మరియు సమర్పణతో ఆయనకు స్పందించుటమే. యేసును గూర్చి బైబిల్ చెబుతుంది: “తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను 1:12). మన స్థానములో మరణించుట కొరకు దేవుడు తన కుమారుడైన యేసును పంపాడు. కాని కథ అక్కడ ముగిసిపోదు. మూడు రోజులు తరువాత, యేసు మరణము నుండి తిరిగిలేచాడు. దేవునిగా, ఆయన నేడు కూడా సజీవుడు మరియు మన హృదయంలో తన ప్రేమను ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆయనను మీరు ఒక్క సారి అంగీకరిస్తే, ఆయన మీ జీవితాలలో మరియు మీ అనుబంధాలలో ఏమి చేయగలడో చూచి ఆశ్చర్యపోతారు.

"కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును" (యోహాను 3:36), అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. మనం జీవం కలిగియుండాలని, నేడు మాత్రమే గాక, నిత్యము జీవము కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు. మనం ఆయనను తిరస్కరించుటకు నిర్ణయించుకొంటే, మనం పాపము యొక్క పరిణామమైన మరణం మరియు నిత్య ఎడబాటును ఎన్నుకొంటాము.

అది యేసు క్రీస్తును ఆహ్వానించుట, మీ జీవితంలోనికి ఆయనను ఆహ్వానించుట మరియు ఆయనను నమ్ముట, మరియు అది మన జీవితాలకు సమతుల్యత కలిగిస్తుంది. దేవుని యందు విశ్వాసం దేవుని క్షమాపణను ఇస్తుంది. దాగుకొనవలసిన పని లేదు, మన దారిలో మనం వెళ్లవలసిన పని కూడా లేదు. ఆయనతో మనం సమాధానపడితిమి.

ఆయనపై మన విశ్వాసమును మరియు ఆధారమును ఉంచినప్పుడు, ఆయన మన జీవితాలలో నివసిస్తాడు మరియు ఆయనతో మనం సాన్నిహిత్యం కలిగియుంటాము. ఆయన క్షమాపణ మనలను లోతైన పాపము నుండి, లోతైన స్వార్థం నుండి, లోతైన సమస్య లేక సంఘర్షణ నుండి అది మనలను శుద్ధి చేస్తుంది.

బైబిల్ అంతటిలో, లైంగిక సంబంధం పట్ల దేవుని వైఖరి చాలా స్పష్టంగా ఉంది. రతి అనునది కేవలం వివాహం అమరియు వివాహంలో మాత్రమే అనుమతించబడినది. ఆయన మనలను బాధాకరముగా చేయాలని కాదు, ఆయన మన హృదయాలను కాపాడాలని కోరుతున్నాడు. మన కొరకు ఆయన ఒక భద్రతను నిర్మించాలని ఆశించుచున్నాడు, తద్వారా మనం వివాహ బంధంలోనికి ప్రవేశించినప్పుడు, దానిలోని సాన్నిహిత్యం దేవుని ప్రేమ మరియు వివేకంపై ఆధారపడియుంటుంది.

భద్రత భావము మరియు ప్రేమను అనుభవించుట నుండి సాన్నిహిత్యం పుడుతుంది.

మనలను మనం యేసు క్రీస్తుకు అర్పించుకున్నప్పుడు, ప్రతి రోజు ఆయన మనకు నూతన శక్తిని నూతన ప్రేమను ఇస్తాడు. ఇక్కడే మనం వెదకు సాన్నిహిత్యం సంతృప్తిపొందుతుంది. ఎన్నడు వీడిపోని, సంవత్సరాలు మారినా మరియు సమయాలు మారినా ఎన్నడు మారని ప్రేమను దేవుడు మనకు ఇస్తున్నాడు. ఆయన ప్రేమ ఇద్దరు వ్యక్తులను కలుపుతుంది, మరియు ఆయన ఆ బంధములో కేంద్రముగా ఉంటాడు. ఒక అనుబంధంలో మీరు ఎదుగుచుండగా, కేవలం ఆత్మీయంగా మాత్రమే గాక, సామాజికంగా, మానసికంగా మరియు భావాత్మకంగా మీరు నిజాయితీ గల, శ్రద్ధ గల, సన్నిహిత సంబంధం కలిగియుంటారు. మరియు ఆ అనుబంధం వివాహముగా మారినప్పుడు, లైంగిక అనుబంధం ముందుగా స్థాపించబడిన అనుబంధమును బలపరుస్తుంది మాత్రమే.

మన అనుబంధాలలో, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని తెలుసుకొనుట ఇతరులను నిజాయితీగా ప్రేమించుటలో మనకు సహాయపడుతుంది. భావాత్మకంగా మన అవసరతలు తక్కువ. ఇతర అనుబంధాలలో కనిపించు ఈర్ష్య, అసూయ మరియు ద్వేషం మన ముందు ఉన్న వికల్పం కాదు. మనం వాటికి లొంగిపోవలసిన పని లేదు. బదులుగా, మనం ఆటలను ప్రక్కన పెట్టి, నిజాయితీగా ఉండి, తప్పిదములను క్షమించవచ్చు కూడా. క్లుప్తంగా, దేవుని ప్రేమను మనం అనుభవిస్తుండగా, ఇతరులతో వేరే విధంగా బంధం కలిగియుండుటకు అది మనలను పురికొల్పుతుంది.

మీరు దేవుని తెలుసుకొని, మీ జీవితమును మరియు అనుబంధాలను ఆయన నడిపించుటకు అనుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా?

విశ్వాసము కలిగిన ప్రార్థన ద్వారా మీరు క్రీస్తును ఇప్పుడే అంగీకరించవచ్చు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవునికి మీ హృదయం తెలుసు కాబట్టి మీ మాటల కంటే ఎక్కువ మీ హృదయ వైకరిని ఆయన చూస్తాడు. ఈ క్రింది ప్రార్థనను మీరు చేయవచ్చు: “ప్రభువైన యేసు, మీరు నాకు కావాలి. నా పాపముల కొరకు సిలువపై మరణించినందుకు వందనాలు. నా జీవిత తలుపును తెరచి మిమ్మును మా ప్రభువు మరియు రక్షకునిగా అంగీకరిస్తాను. నా పాపములను క్షమించి నాకు నిత్యజీవమును ఇచ్చినందుకు వందనాలు. నా జీవితమును శాసించి మీరు కోరుకోనుచున్నట్లుగా నన్ను మార్చండి.”

ఈ ప్రార్థన మీ హృదయ వాంఛను వ్యక్తపరుస్తుందా? వ్యక్తపరుస్తున్నట్లైతే, ఈ క్షణమే ఈ ప్రార్థన చెయ్యండి. క్రీస్తుపై విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన వాగ్దానం చేసిన విధంగా మీ జీవితంలోనికి వస్తాడు. ఇది ఆయనతో మీ అనుబంధమును ఆరంభిస్తుంది మరియు ఆయనను ఎక్కువగా తెలుసుకొనచుండగా అది మరి ఎక్కువగా బలపడుతుంది. ఆయన కేంద్రముగా, మీ జీవితం ఒక నూతన కోణములో నడుస్తుంది-ఆత్మీయ కోణం-మరియు మీ అనుబంధాలకు మరింత సామరస్యమును మరియు పూర్ణతను తెస్తుంది.

మీ కొరకు దేవుని ప్రేమను తెలుసుకొని అనుభవిస్తూ, ఆ దేవుని ప్రేమతో మీరు ఇతరులను కూడా ప్రేమించగలరు, మరియు అది మరింత లోతైన నిజమైన సాన్నిహిత్యంలోనికి నడిపిస్తుంది.

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

Richard Purnell 450 కంటే ఎక్కువ యూనివర్సిటీలు మరియు కాలేజీ క్యాంపసులలో విద్యార్థులలో మాట్లాడారు. ఆయన 12 పుస్తకాలను వ్రాసాడు, దానిలో ఒకటి Becoming a Friend and Lover and Free to Love Again: Coming to Terms with Sexual Regret.

ఇతరులతో పంచుకోండ  

TOP