జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

నా జీవితము యొక్క ఉద్దేశము ఏమిటి?

నీ ఉద్దేశము నీవు తెలుసుకుంటే నీ జీవితము మరింత అర్ధవంతంగా మారుతుంది.

సుత్తిని గమనించండి. అది మేకులను కొట్టటానికి తయ్యారు చేయబడింది. దాని సృష్టించిన ఉద్దేశం ఇదే. గమనించండి, ఒకవేళ్ళ సుత్తిని ఉపయోగించకుండ ఉంచిన్నట్లయితే అది కేవలము బాక్సులో పెట్టబడి ఉన్నట్లయితే , సుత్తి ఇవి ఏమి పట్టించుకోదు. కాని, ఒక వేళ అ సుత్తికి ప్రాణము ఆలొచన వుంటే రోజులు గడుస్తూ ఉన్నప్పటికిని అది కేవలం పన్నిముట్ల బాక్సులో పెట్టబడి ఉంటే, దానిని ఎందుకు ఇన్ని రోజులు ఉపయోగించబడకుండా ఆ పన్నిముట్ల పెట్టేలో పెట్టబడి ఉన్నదో అర్ధం కాక నవ్వుకుంటుంది. ఏదో పోగొట్టుసునట్టుగా భావిస్తుంది కాని అది ఏమిటో అర్ధం కాదు.

కాని సుత్తిని పెట్టెలో నుండి బయటకు తీసి, నిప్పు వెలిగించటానికి, కొమ్మల్ని నరకటానికి దాని ఉపయోగించిన్నట్లయితే, సుత్తి అప్పుడు కొంచం సంతోషిస్తుంది. సుత్తిని చేతితో పట్టుకోవడం దాని ఉపయోగించడం దానితో కొమ్మలు నరకడం - ఇవ్వన్ని సుత్తికి బాగా ఇష్టం. రోజు ముగిసే సరికి అది ఇంక అసంతృప్తితోనె ఉంటుంది. కొమ్మల్ని నరకటం సుత్తికి ఆనందాన్ని తెచ్చిపెట్టిన, సుత్తికి అది సరిపోదు, ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లు అనుకుంటుంది.

రొజులు గడిచె కొలది సుత్తి కొన్ని సార్లు మాత్రమే ఉపయోగించబడుతుంది. అది పై కప్పును సరిచేసింది, గట్టిగా ఉన్నట్టువంటి రాళ్ళను బదలకొట్టింది, సరిగా లేనట్టువంటి టెబుల్ యొక్క కాళ్ళను క్రమంలో పెట్టింది. కాని అది ఇంకా అసంతృప్తితోనే ఉంది. అది ఇంకా బాగా పని చెయ్యాలి అన్న ఆకాంక్షతో ఉన్నది . తాను ఎంతగా ఉపయోగపడితే అంతగా పన్నిచెయ్యాలన్న ఆకాంక్ష, సాధ్యపడితే చుట్టు ప్రక్కల ఉన్నవాటిన్ననింటిని బదలకొట్టడానికి, వస్తువులను ఇరగ కొట్టడానికి, మరికొన్ని వాటిని చెదరగొట్టడాని, మరికొన్ని వస్తువుల వంకర్లు తీయటానికి ఎదురుచూస్తుంది. సుత్తికి అర్ధమైనది ఏమిటంటే తనను తృప్తిపరిచే పన్నుల్ని తాను చేయ్యలేకపొయింది. సుత్తి యొక్క నిరాశ ఏమిటంటే తాను ఎందుకని తన అసంతృప్తికి కారణం కనుగొనలేకపొతుంది.

అకస్మాతుగా ఒకరోజు ఎవరో ఒకరు సుత్తిని మేకులు కొట్టడానికి ఉపయోగించారు. సుత్తి యొక్క హృదయము వెలుగుతో నిండిపొయింది. తాను ఏ పనికైతే తయ్యారుచేయబడిందో సుత్తికి ఇప్పుడు అర్ధమైంది. మనము దేవుడుని తెలుసుకోనంత వరకు, మన జీవితంలో ఎన్నో మంచి అనుభవాల్ని అనుభవించినా, మనము మన ఉద్దేశాన్ని చేయనట్టే, మనము కేవలం గొప్ప పనులు చేయటానికి ఉపయోగించబడ్దాము అంతే, ఏ పని చేస్తే మనకి పూర్తిగా సంతోషం, సంతృప్తిని కలుగచేస్తుందో అది మనము చేయలేదు. అగస్టీన్ సంక్షిప్తపరచి చెప్పింది ఏమిటంటే, " నీవు (దేవుడు) మమ్ములను నీ కొరకై సృజించికొనియున్నావు, మా హృదయములు నీ సన్నిధిలో విశ్రాంతి పొందుకునేంత వరకు దానికి విరామం లేదు.”

దేవునితో వ్యక్తిగత సంబంధము మాత్రమే, మన ఆత్మ యొక్క తృష్ణను సంతృప్తి పరుస్తుంది. యేసు ప్రభు వారు ఈ రీతిగా అన్నారు." జీవాహారము నేనే. ఎప్పుడైన ఈ ఆహారము భుజించితే ఎల్లప్పుడు జీవించును, వాడు ఇంకెన్నడు ఆకలికొన్నడు మరియు నా యందు విశ్వాసము ఉంచువాడు ఎన్నడు దప్పిగొనడు." మనము దేవుడుని తెలుసుకునేంతవరకు ఆకలితో దాహంతోను ఉంటాం. మనము వివిధరకాలు అయినటువంటి వాటిని తినచ్చు త్రాగచ్చు కాని అవి నిజముగా మన ఆకలిని దాహాన్ని తీర్చలేవు. అవి అలానే మిగిలిపోతాయి.

-మనము కూడ సుత్తిలాంటి వాళ్ళమే. మన జీవితములో ఉన్న వెలితిని, అసంతృప్తిని మనము తీసివేసుకోవచ్చు అనే ఆలొచనలోనికి రాలేకపోతున్నాము. భయంకరమైనట్టువంటి నాజి ప్రజలు కారాగారములో కుడా “కారీటెన్ బూం” తనను త్రుప్తిపరచగలిగిన్నటువంటి దేవుడిని తెలుసుకుంది. "మన ఆనందానికి పునాది ఏమిటంటే మనము క్రీస్తుతో కూడ దేవునిలో దాచబడి వున్నాము అనేటువంటి సత్యము. దేవుని ప్రేమ మీద మనము విశ్వాసము ఉంచవచ్చు.... ఆయనే మన బండ కఠినమైన అందకారము కంటే బలమైనటువంటి దేవుడు."

సాదారణంగా మనం దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే, మనము దేవుడు లేకుండా మన జీవితాన్ని సంతృప్తిపరచుకోవాలని ప్రయత్నిస్తున్నాము అని అర్ధము, కాని మనము ఎప్పుడు అలా చేయలెము. మనము తింటూనే ఉంటాము త్రాగుతునే ఉంటాము, మన ఆలోచన ఏమిటంటే ఎంత ఎక్కువ తింటే అంతగా తృప్తిచెందుతాం అనుకుంటాము, కాని అది ఎప్పటికి సాధ్యపడదు.

మనుష్యుల అతి గొప్ప ఆశ ఏమిటంటే దేవుణ్ణి తెలుసుకోవటం, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండటం. దానికి కారణమేమిటంటే మనము దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటాన్నికి సృజించబడాము కాబట్టి. మీరు ఎప్పుడైనా మీ ఉద్దేశాన్ని నిరవేర్చగలిగారా? సుత్తి మేకును కొట్టటమే అది తయ్యారు చేయబడిన ఉద్దేశము, మరి మీ ఉద్దేశాన్ని నెరవేర్చారా?.

మరిన్ని వివరములు ఈ విషయముపై తెలుసుకోవాలంటే చూడండి "నిజ జీవితము."

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP