జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

నిజ జీవితం

నిజ జీవితం: జీవితంలో పరిపూర్ణత, అంగీకారం, మరియు ఉద్దేశమును ఎక్కడ పొందారో ముగ్గురు వ్యక్తులు పంచుకుంటారు.

దీని కంటే ఏదో ఒకటి ఎక్కువ ఉండాలని మీరు ఎన్నడైనా భావించారా? కేవలం ఉనికిలో ఉండుటకు మించి ఏదో ఒకటి? నిజ జీవితమును గూర్చి మరియు దానిలో దేవుని పాత్రను గూర్చి ఈ క్రింది సూటైన కథనాలు కొన్ని అభిప్రాయాలను ఇస్తాయి.

నిజ జీవితము: పరిపూర్ణత [John G. ద్వారా]

ఒక పర్వతమును ఎక్కాలనే జీవిత ఆశయం కలిగిన ఒక వ్యక్తిని గూర్చి మీరు వినే ఉంటారు. ఆయన పైకి ఎక్కిన తరువాత, గొప్ప నిరాశను ఎదుర్కున్నాడు. ఆయన వెళ్లుటకు వేరే ఏ స్థానము లేదు, మరియు జీవితములో ఇంకా ఏదో లోటు ఉంది. ఇది ఒక ఫుట్బాల్ ఆటగాడు సూపర్ బౌల్ ను గెలిచిన తరువాత కూడా నిరుత్సాహపడుట వంటిది.

విశ్వవిద్యాలయంలో నీ అనుభవం ఇలాంటిదే. నేను సీనియర్ సంవత్సరములోనికి వచ్చే సరికి నాకు పరిపూర్ణత ఇస్తుందని ప్రజలు చెప్పిన ప్రతిదానిని నేను సంపాదించాను. నేను ఒక కూటమిలో మరియు ఇతర క్యాంపస్ సంస్థలలో ఉన్నాను, పార్టీలలో గొప్పగా ఆహ్లాదమును పొందాను, మంచి మార్కులు సంపాదించాను, మరియు ఆకర్షణీయమైన స్త్రీలతో సమయం గడిపాను.

కాలేజీ సమయంలో నేను పొందాలని కోరిన ప్రతిది నేను పొందుకున్నాను. అయినను, నాకు పరిపూర్ణత లేదు. ఏదో లోటు ఉండేది.

అవును, నా జీవితమును గూర్చి నేను ఇలా భావిస్తున్నానని ఎవరికీ తెలియదు. నేను దానిని బయటకు చూపించేవాడిని కాదు. చాలా మంది వారి జీవితాలు నా జీవితముల వలె ఉండాలని కోరుకొనే వారేమో. కాని నేను లోపల ఎంత అసంపూర్ణంగా ఉన్నానో వారికి తెలియదు.

ఆ విద్యాలయంలో నా ఆఖరి సంవత్సరం తరువాత వేసవికాలంలో, ఒకరు బైబిల్ లోని ఒక వాక్యమును చదువుట నేను విన్నాను. నేను ఇది వరకు కూడా బైబిల్ లోని కొన్ని భాగములను విన్నాను, మరియు కొంత వరకు స్వయంగా చదివాను కూడా, కాని ఏదో ఒక కారణం వలన ఈ సారి నాకు కొంత తేడాగా అనిపించింది. “ఇదిగో, ఈ మాటలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి.” ఇంతకు ముందు ఎన్నడు లేనివిధంగా, బైబిల్ ఎంత సత్యమైనదో మరియు ఎంత ఉపయోగకరమైనదో నేను గ్రహించాను.

దేవుడు నన్ను పిలుస్తున్నట్లు నాకు అనిపించింది...కాని నేను ఆయనను నాలోని ఆహ్వానించుటకు నేను ఇష్టపడలేదు. నా జీవితం ఎలా మారుతుందో మరియు నేను వింతవాడినని నా స్నేహితులు భావిస్తారని నేను ఆలోచన చేశాను. నేను భయపడ్డాను. కాని నేను దానిని గూర్చి ఎంతగా ఆలోచిస్తే అంతగా, అన్నిటి కంటే అందరి కంటే ఎక్కువగా ఆయనను ఎన్నుకొనుట (సందేహం లేదు, దేవుని సహాయంతో) మంచి నిర్ణయమని నేను గ్రహించాను.

తరువాత జరిగిన విషయం వివరించుటకు కష్టమైనది. నేను దానిని ఈ విధంగా వివరించగలను: దేవుడు మాత్రమే నిజమైన పరిపూర్ణతకు మూలం అని నేను కనుగొన్నాను. నా అనుభవం విశేషమైనది కాదు. ఆయనను వెదకు ప్రతివారికి ఆయన నిస్వార్థంగా అందించేది ఇదే. ఆయన అన్నాడు (మరియు నేటికి అంటున్నాడు), “జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.”1

అవును, జీవితములో సుఖ దుఖాలు, నిరుత్సాహాలు, మరియు సంఘర్షణలు ఉన్నాయి. కాని జీవితమునకు నిజమైన అర్థమును ఇచ్చువాడు దేవుడు మాత్రమే-ఆయన నిజమైనవాడని సజీవుడని, నా ఉనికికి ఆయన కారణమని, మరియు ఆయనను నిజముగా కనుగొనుట మాత్రమే జీవిత ధ్యేయమని తెలుసుకొనుట.

నిజ జీవితం: అంగీకారం [Robert C. ద్వారా]

-నేను ఎదుగుతున్న రోజులలో, టీవీలో The Wizard of Oz చూసేవాడిని. మీకు కూడా ఈ కథ గుర్తుండి ఉంటుంది. డొరొతి మరియు తన స్నేహితులు సహాయం కొరకు Wizard of Oz యొద్దకు వెళ్తారు, కాని వారు తమను తాము నిరూపించుకొనుటకు అసాధ్యమైన ఒక కార్యమును చేయమని కోపం మరియు భయంతో కూడిన ఒక శబ్దం వినిపించింది: దుష్ట దయ్యం యొక్క చీపురును పొందుట.

అద్భుతమైన Wizard of Ozకి ఇది అసాధ్యమైన విషయం.

నేను ఎదుగుతున్న రోజులలో దేవుడు కూడా నాకు Wizard of Oz వలె అనిపించేవాడు. ఆయన స్వార్థపరుడని కోపపరుడని నా గురించి ఆయనకు ఏమి తెలియదని నేను అనుకొనేవాడిని. సంఘములో ఆయనను ఒక పసివానిగా నేను చూసిన కొన్ని చిత్రాలు అయన మనకు అందుబాటులో లేనివాడని, దూరంగా ఉన్నాడని నేను అనుకొనేవాడిని. సిలువపై ఆయన మరణమును గూర్చిన చిత్రం నాకు గొప్ప త్యాగమును జ్ఞాపకం చేసేది కాని అది ఆయన అయిష్టంగా చేశాడని’ అనుకొనేవాడిని. నేను ఎంత మంచిగా ప్రవర్తించాను, మరియు ఆయన స్థాయికి తగినట్లు నేను ఎలా జీవించాను అన్న విషయములు మాత్రమే ఆయన పట్టించుకుంటాడని నేను భావించేవాడిని. ఆయన నన్ను అంగీకరించాలంటే, నేను నా యోగ్యతను నిరూపించుకోవాలని భావించేవాడిని. మీరు ఊహించునట్లు, దేవుడు నా జీవితంలో గొప్ప వ్యక్తి కాదు. ఆయనను వర్ణించుటకు అద్భుతకారుడు అనే పదం నేను ఉపయోగించేవాడిని కాదు.

తరువాత, కాలేజిలోని మొదట సంవత్సరంలో ఇదంతా మారింది. తెర మరిగైయింది. నా జీవితంలో మొదటి సారి, దేవుడు నిజముగా ఎలాంటివాడో ఒకరు నాకు బైబిల్ లో – నేను ఎల్లప్పుడూ అసత్య విషయములు మాత్రమే ఉన్నాయని తలంచిన పుస్తకం—చూపించారు. ఆయన ముక్కోపి లేక స్వార్థపరుడు కాదు – దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆయన ప్రేమ స్వరూపి మరియు దయగలవాడు. నేను ఒక పరిపూర్ణ జీవితమును జీవించుటకు మరియు ఆయన స్థాయిని అందుకొనుటకు అసమర్థుడని ఆయనకు తెలుసు. కాబట్టి, ఆయన గొప్ప ప్రేమలో, ఆయన ఒక పూర్ణమైన మానవుడై నా కొరకు ఆ స్థాయిని అందుకున్నాడు.

యేసు క్రీస్తు నా ఆదర్శం కాదని ఆయన నాకు ప్రత్యామ్నాయం అని నేను నేర్చుకున్నాను. నేను ఆయన శ్రమను అనుకరించవలసిన పని లేదు, కాని దానిలోని లాభాలను తీసుకోవాలి. సిలువపై ఆయన మరణం ద్వారా – ఆయన ఇష్టపూర్వకంగా చేశాడని నేను కనుగొన్నాను—నా పాపము మరియు వైఫల్యాలు తీర్పుతీర్చబడినవి. సిలువపై యేసు తన గొప్ప ప్రేమను నా కొరకు చూపించాడు. ఆయన నన్ను ఎంత మంచిగా ఎరిగియున్నాడో అక్కడ ఆయన నాకు చూపించాడు. అక్కడ ఆయన నన్ను అంగీకరించాడు. బైబిల్ చెబుతున్నట్లు, “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.”2

నిజమైన అంగీకారం తెర వెనుక ఉన్న ఒక నూతన వ్యక్తిలో ఉందని నేను కనుగొన్నాను. దానిని వెనుకకు లాగి మీరు స్వయంగా దానిని కనుగొనమని, మరియు ఆయన ఇచ్చుచున్న అంగీకారం మరియు పశ్చాత్తాపమును పొందుకొనమని సవాల్ చేస్తున్నాను.

నిజ జీవితం: ఉద్దేశం [Marilyn A. ద్వారా]

-జీవితం అర్థవంతంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ ఆలోచన చేశాను. ప్రతి దినం యొక్క ప్రతి క్షణం అవసరం లేదు. అంటే, బట్టలు ఇస్త్రీ చేయుట ఎంత అర్థవంతమైనది? అదే విధంగా జీవితం ఎల్లప్పుడూ గంభీరంగా కూడా ఉండదు. మంచి సమయం మాత్రమే మనకు కావాలి!

కాని జీవితం కేవలం ఆహ్లాదమును వెదకుట మాత్రమే కాదు, ఎందుకంటే ఆహ్లాదం ఎక్కువ సమయం వరకు ఉండదు. రచయిత Ravi Zacharias దీనిని గూర్చి మంచిగా చెప్పాడు: “జీవితానికి ఇక అర్థం లేకపోతే...జీవితం ఎలాంటి ఆదర్శం లేకుండా ఉంటుంది, ఎలాంటి పూర్ణ వస్తువు లేక వివరణ లేకుండా ఉంటుంది.”

నేను చాలా సంవత్సరాల పాటు Dostoyevsky, Sartre, Nietzsche, Socrates మరియు అనేకమంది ఇతరుల యొక్క తత్వాలను చదివాను – నా జీవితంలో ఒక ప్రోత్సహకరమైన ఉద్దేశం కొరకు. ప్రతి వారం నేను ఒక నూతన తత్వమును “ప్రయోగించేవాడిని.” కాని ఈ తత్వాలు నిజ జీవిత వాస్తవాలకు అన్వయించినప్పుడు నిరుత్సాహాన్ని కలిగిస్తాయని నేను కనుగొన్నాను. నా అన్వేషణ కొనసాగింది.

టైం మాగ్జిన్ యొక్క అంతర్జాతీయ వార్తా ప్రతినిధి, Dr. David Aikman, ఈ విషయమును గూర్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన కొన్ని పోస్ట్-గ్రాడుయెట్ డిగ్రీలు చేశాడు, రష్యన్ మరియు చైనీస్ చరిత్ర మరియు కమ్యూనిస్ట్ విషయాలలో పండితుడు, 30 కంటే ఎక్కువ దేశాలలో పని చేశాడు, ఆరు భాషలలో నిష్ణాతుడు, మరియు జీవిత సమస్యలను గూర్చి గంభీరంగా ఆలోచన చేయువాడు. ఆయన అన్నాడు, “మనల ప్రతి వారికి ఒక ఉద్దేశము ఉంది, ఇక్కడ ఉండుటకు ఒక కారణం, దానిని మీకు ఎవరు చెప్పరు, కాని దానిని మీరు దేవుని నుండి కనుగొనవచ్చు.” Dr. Aikman యేసు క్రీస్తుతో అనుబంధమును ఆరంభించుటను ప్రతిపాదించాడు.

Dr. Aikman ఈ కథనమును ఇచ్చాడు, “యేసు యొక్క మాటలను నేను విన్నప్పుడు [బైబిల్ లో], ఆయన నా హృదయముతో మాట్లాడుతున్నాడని నాకు అనిపించింది, మరియు ఆయన అంటున్నాడు, ‘నేను జీవ మార్గమైయున్నాను. మీరు నన్ను వెంబడించి నేను చెప్పినది చేస్తే, మీ జీవితం మారిపోతుంది.’” యేసు క్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించమని కోరుట ద్వారా ఆయనతో ఒక అనుబంధమును ఆరంభించుటను గూర్చి ఆయన మాట్లాడాడు. Dr. Aikman చివరికి ఇలా అంటూ ముగించాడు, “నేను మీతో వాగ్దానం చేస్తున్నాను...యేసు క్రీస్తు వైపు ఆ మొదటి అడుగును తీసుకొను ప్రతివారు ఒక ఆసక్తికరమైన జీవితమును కలుగియుంటారు.”

Dr. Aikman వలెనే, నేను కూడా ఒక నాస్తికునిగా ఉండేవాడిని. ఆయన వలెనే, తనను గూర్చి యేసు యొక్క కథనాలు విశేషమైనవని నేను కనుగొన్నాను. యేసు ప్రజలను జీవితమును గూర్చిన తన తత్త్వము వైపునకు త్రిప్పలేదుగాని, తన వైపు చూడమని చెప్పాడు. ఆయన మన పాపములను క్షమించగలడని, కష్ట పరిస్థితులలో అంతరంగ శాంతిని ఇస్తాడని, మనలను స్వతంత్ర జీవితములోనికి నడిపిస్తాడనియేసు చెప్పాడు.

నిజంగా దేవుడు ఉంటే, ఆయనను తెలుసుకోవాలని నేను నిర్థారించుకున్నాను. కాని నేను అప్పటికీ సందేహంలో ఉన్నాను. నాకు తెలిసిన క్రైస్తవులతో నేను తర్కించాను మరియు వారిని సవాల్ చేశాను. యేసు దేవుడనుటకు నేను రుజువును కోరాను. దేవుని ఉనికి మరియు యేసు దైవత్వమునకు రుజువులను నేను నిజాయితీగా ఒక రోజు గమనించాను, మరియు తర్కమైన, చారిత్రక వాస్తవాలను కనుగొని నేను ఆశ్చర్యపడ్డాను. నేను ఒక నిర్ణయం తీసుకోవాలని నేను తెలుసుకున్నాను. ఆయనను నా జీవితంలోనికి ఆహ్వానించి ఆయన నా జీవితములో కార్యము చేయుటకు నేను అవకాశం ఇస్తానా, లేక నా జీవితములో ఈ భాగమును ముగించి “దేవుని” యొక్క ఉనికిని నిరాకరించి ఆయనను పూర్తిగా మరచిపోతానా?

యేసును నమ్ముటకు కావలసిన తత్వ కారణాలను విశ్లేషించిన తరువాత, యేసును నా జీవితములోనికి రమ్మని ఆహ్వానించాను. జీవిత అర్థమును గూర్చి నా అన్వేషణ ఆ రోజున పూర్తిగా ముగించబడింది.

దేవునితో అనుబంధం నేను కలిగియుండగలను అను విషయం నన్ను ఆశ్చర్యపరచింది. నేను ఆయనతో మాట్లాడాను మరియు, పరిస్థితులను మార్చుట ద్వారా, ఆయన నా మాటలను విన్నాడని ఆయన నాకు సూచించాడు. నేను ఆయనను ప్రశ్నలు అడిగాను మరియు అయన నన్ను బైబిల్ లో ఉపయోగకరమైన జవాబులలోనికి నడిపించాడు.

ఈ విషయములు ఒక చీకటి, తుఫాను రోజున సంభవించలేదు. అది దేవునితో నిజమైన రెండు దినముల అనుబంధము మరియు దానిని నేను స్థిరముగా అనుభవించాను మరియు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. నేను పరిశుద్ధుని అయినందుకు కాదు, కాని ఆయనను తెలుసుకొని ఆయన్ను నిజముగా వెంబడించాలని ఆశించు ప్రతి వాని జీవితాలలోనికి యేసు ప్రవేశిస్తాడు కాబట్టి.

దేవుని వెంబడించుటలో ఒక లోతైన ఆనందం ఉంది. వేరే ఏ విషయము కంటే లేక వేరే వారి కంటే ఎక్కువగా, యేసు క్రీస్తును తెలుసుకొనుట నా జీవితమునకు ఒక ఉద్దేశమును కలిగించింది.

నిజ జీవితం: యేసు క్రీస్తు

-నిజ జీవితము పరిపూర్ణత, అంగీకారం మరియు ఉద్దేశంతో నిండియుంటుంది. దానిని మనం యేసు క్రీస్తుతో అనుబంధంలో కనుగొంటాము. మానవ చరిత్రలో ఎవరు కూడా యేసు చేసిన దావాలు చేయలేదు మరియు వాటిని గొప్ప రుజువులతో సమర్థించలేదు. ఆయన దేవుడని, పాపములను క్షమించు శక్తిగలవాడని, మరియు తండ్రియైన దేవుని తెలుసుకొనుటకు ఆయన ఏకైక మార్గమని చెప్పాడు. యేసు ఆ దావాలను మరణము నుండి తిరిగిలేచుట ద్వారా నిర్థారించాడు. ఆయన నిజముగా ఇప్పటి వరకు నివసించినవారందరిలో విశేషమైనవాడు...ఒక గొప్ప బోధకుని కంటే ఎక్కువ.

యేసు మానవుడైన దేవుడని బైబిల్ చెబుతుంది – “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను.”3 ఆయన "ఆయన [దేవుని] తత్త్వము యొక్క మూర్తిమంతము."4 క్లుప్తంగా, దేవుడు ఎలా ఉంటాడో యేసు క్రీస్తు ఖచ్చితంగా బయలుపరచాడు. కాబట్టి ఆయనతో అనుబంధం ఎలా ఆరంభించాలి?

మంచి వ్యక్తి అగుటకు ప్రయత్నించుట ద్వారా మనం దేవునితో అనుబంధమును ఆరంభించలేము. దేవుని అంగీకారమును పొందుటకు అతిగా కష్టపడుతు మనం జీవించాలని దేవుడు కోరుటలేదు. ఒక వ్యక్తి అంగీకారమును గెలచుట కొరకు అతిగా కష్టపడవలసిన అనుబంధంలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? అది అంత సులువైన విషయం కాదు.

దేవుడు మనలను ఎంత నిజముగా ప్రేమిస్తున్నాడంటే ఆయనకు దగ్గరగా వెళ్లుటకు మార్గమును ఆయనే స్వయంగా అందించాడు...కాని ఒక సమస్య ఉంది. ఇప్పుడు, దేవునికి మనకు అనుబంధమునకు మధ్య పాపం ఉంది (కోపం, గాయపరచు మాటలు, మన అసహనం, మన స్వార్థం, లోభం మొదలగు వాటి ద్వారా కనిపించు మన స్వార్థ బుద్ధి.). మీ ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావటం లేదని మేరు ఆలోచన చేస్తే దానికి కారణం ఇది. మన పాపం పరిశుద్ధుడైన దేవుని నుండి మనలను వేరుచేసింది.

కాబట్టి ఆయనతో సాన్నిహిత అనుబంధం కలిగియుండుటకు దేవుడు ఏమి చేశాడు? యేసు క్రీస్తు (“శరీరదారియైన దేవుడు”) ఇష్టపూర్వకంగా సిలువపై మరణిస్తూ మన పాపమంతటిని తన భుజములపై వేసుకున్నాడు. మనం పూర్తిగా క్షమించబడుటకు, ఆయనకు సంపూర్ణంగా అంగీకారయోగ్యంగా ఉండుటకు ఆయన ఇలా చేశాడు.

మన సమస్య నేరము కొరకు పట్టబడిన ఒక కాలేజీ విద్యార్థితో ఉదాహరించవచ్చు. న్యాయధిపతి ఆమెను 30 దినముల జైలు శిక్ష లేక $1,000 జరిమాన కట్టమని శిక్ష విధించాడు. కాని ఆ విద్యార్థి సమయమును ఇవ్వలేదు లేక డబ్బు కూడా కట్టలేదు. దీనిని తెలుసుకున్న న్యాయధిపతి, తన వస్త్రములను తీసివేసి, ఆ బెంచ్ ముందుకు వెళ్లి, తన సొంత చెక్ బుక్ తో జరిమానాను కట్టాడు. ఎందుకు? అందుకంటే ఒక న్యాయధిపతిగా అతడు తప్పును కప్పిపుచ్చలేడు. కాని, అతడు ఆ విద్యార్థి యొక్క తండ్రి కాబట్టి, ఆమెకు బదులుగా పరిహారం చెల్లించుటకు ఆయన ఇష్టపడ్డాడు.

ఖచ్చితముగా మనందరి కొరకు యేసు సిలువలో ఇదే చేశాడు. మన నిమిత్తం ఆయన కొట్టబడి, హేళన చేయబడి, కొరడాలతో కొట్టబడి, సిలువ వేయబడి గొప్ప బలిని అర్పించాడు. ఆయన చేసిన త్యాగమునకు ప్రతిగా ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించమని ఆయన కోరుతున్నాడు.

నిజ జీవితం: దేవుని తెలుసుకొనుట

మనం ఆయనను తెలుసుకోవాలని ఆయన ప్రేమ, ఆనందం, మరియు శాంతిని అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. ఆయనను మన జీవితములోనికి ఆహ్వానించినప్పుడు, ఆయన క్షమాపణను మనం పొందుతాము మరియు నిత్యముండు ఒక అనుబంధమును ఆయనతో ఆరంభిస్తాము. యేసు చెప్పాడు, "ఇదిగో నేను తలుపునొద్ద (హృదయము యొక్క) నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు (ఆమె యొద్దకు) వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును (ఆమె) భోజనము చేయుదుము."5

ఇప్పుడు ఇది మీ జీవితం యొక్క ఆశ అయితే, ఈ క్రింది ప్రార్థనను మీరు చేయవచ్చు (కాని మీ హృదయ వికరి కంటే పదములు అంత ముఖ్యము కాదు):

ప్రియమైన దేవా, నేను నీకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకొనిచున్నాను. సిలువలో నా పాపమంతా నీపై వేసుకున్నందుకు వందనాలు. నీ క్షమాపణను పొందాలని ఆశపడుచున్నాను. నీతో అనుబంధములోనికి ప్రవేశించాలని ఆశపడుచున్నాను. నా ప్రభువు మరియు రక్షకునిగా నా జీవితములోనికి రమ్మని అడుగుచున్నాను. నీ ద్వారానే కలుగు నిజ జీవితమును నాకు ఇమ్ము.

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) యోహాను 6:35 (2) 2 కొరింథీ 5:21 (3) యోహాను 1:14 (4) హెబ్రీ. 1:3 (5) ప్రకటన 3:20

బైబిల్ లో నుండి ...

"దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను." (1 యోహాను 5:12)

"తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను." (యోహాను 1:12)

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను 3:16)

"మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు." (ఎఫెసీ. 2:8-9)

"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను." (2 కొరింథీ. 5:17)

"అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము." (యోహాను 17:3)

ఇతరులతో పంచుకోండ  

TOP