జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

దేవుడు నీ ప్రా ర్ధనలకు జవాబు ఇస్తాడా?

ఎలా ప్రా ర్ధించాలి? దేవుడు మన ప్రా ర్ధన ఆలకించాలంటే ఎలా ఆలకిస్తాడు?

మెరిలిన్ అడంసన్

దేవుడుని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి ఎవరన్నా నీకు తెలుసా? నేను దేవుడుని తెలియని వ్యక్తిగా వున్నపుడు (నాస్తికుడు), నా కోసం పదే పదే ప్రార్ధన చేసే స్నేహితురాలుండేది. ప్రతివారము తాను దేవుని మీద ఏవిషయము నిమ్మితము ఆధారపడేదో నాకు చెప్పేది. అయితే ప్రతివారము దేవుడు ఏదో అద్భుతాన్ని చేస్తూ తన ప్రార్ధన ఆలకించేవాడు. ఒక నాస్తికునికి ప్రతి వారం ఇది గమనించటం ఎంత కష్టమో నీకు తెలుసా? కొంత సమయానికి "యాదృచికముగా" చాలా బలహీనమైన అభిప్రాయము తెచేది.

కాబట్టి దేవుడు ఎందుకు నా స్నేహితుల ప్రార్ధనలు ఆలకించేవాడు? పెద్దకారణం ఏమిటంటే ఆమె దేవునితో మంచిసంబంధము కలిగిఉండేది. అమె దేవుడిని వెంబడించేది. మరియు దేవుడు ఏమి చెబుతున్నాడో వినేది. దేవుడుకి తన జీవితాన్ని నడిపించేటువంటి హక్కు ఉందనుకునేది, మరియు దేవుడు అలా చేయుటకు ఆమె దేవుడుని ఆహ్వానించింది. ఎప్పుడైతే తన అవసరతల కోసం ప్రార్ధించేదో అది తన స్వాభావికమైన భాగము దేవునితో సంబంధం కలిగి ఉండుటం. అమె ఏసమస్యలైతే తాను అనుభవించేదో, తన అవసరతలతో మరియు ఆమె ఆందోళనలతో దేవునికి దగ్గరకు రావటం చాలా ప్రశంతంగా భావించేది. అంతటితో ఆగకుండా, ఆమె బైబిల్ లో ఏదైతే చదివిందో, “దేవుడు తాను పూర్తిగా ఆయన మీద ఆధారపడవలెనని కోరుకుంటున్నాడు”, అది పూర్తిగా నమ్మింది.

బైబిల్ గ్రంధములో చెప్పేటువంటి ఈ వాక్యభాగాన్ని అమె పాటించి చూపించింది, " ఆయననుబట్టి మనకు ధైర్యమేదనగా, ఆయన చితానుసారముగా మనమేది అడిగను ఆయన మన మనవి ఆలకించుననునదియే."1 " ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్ధనల వైపు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది."2

కాబట్టి, ఎందుకు దేవుడు ప్రతిఒకరి ప్రా ర్ధనలు ఆలకించడు?

ఎందుకనగా ఆయనతో సంబంధాన్ని కలిగిలేరు కాబట్టి అనుకుంట. దేవుడు ఉన్నాడు అని వారికి తెలిసిఉండవచ్చును, మరియు సమయానుకూలముగా వారు దేవుడుని ఆరాధించియుంటారు. కాని ఎవరి ప్రార్ధనైతే ఆలకించబడదో బహుశా వారు దేవునితో సంబంధము కలిగియుండలేదేమో.

ఇంకా వాళ్ళ పాపములకు పరిపూర్ణ క్షమాపణ దేవుని యొద్దనుండి పొందుకుని ఉండలేదు.

దేవుడు ప్రార్ధనలు ఆలకించటానికి దీనికి సంబంధం ఏమిటి అని మీరు అనచ్చు? ఒక ఉదాహరణ చూపిస్తాను.”మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ యెదుట విస్తరించియున్నవి. మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి."3

దేవుని యొద్దనుండి యెడబాటుని స్వాభావికంగా గ్రహించవచ్చు .ప్రజలు ఎప్పుడైనా దేవుని ఏమన్నా అడిగినప్పుడు సాధారణముగా ఏమి జరుగుతుంది? ప్రజలు ఈ విధముగా అంటారు, "దేవా! ఈ సమస్యలో నాకు సహాయం కావాలి." తరువాత కాసేపు ప్రార్ధన ఆపి మళ్ళీ ఇలా ప్రారంభిస్తారు.. " నేను కశ్చితమైన వ్యక్తిని కాదు అని నేను గ్రహించాను, కాబట్టి నిన్ను అడిగేటువంటి హక్కు నాకు ఏమి లేదు." వ్యక్తిగల పాపము మరియు వైఫల్యము యొక్క అవగాహన కలిగి ఉంటారు. దేవునికి కూడా ఈ విషయం తెలుసు, కేవలం వారికి మాత్రమే కాదన్న సంగతి వారికి కూడ తెలుసు."నేను ఎవరిని మోసంచేస్తున్నాను "? అనే ఆలోచన కలిగి ఉంటారు. దేవుని యొద్ద నుండి వారి పాపములకు క్షమాపణ ఎలా పొందుకోవాలన్న సంగతి మాత్రం వారికి తెలియదు. దేవునితో సంబంధంలోకి వచ్చిన్నట్లయితే దేవుడు వారి ప్రార్ధన ఆలకిస్తాడన్ని వారికి తెలియదు.దేవుడు నీ ప్రార్ధన ఆలకిస్తాడు అనటానికి పునాది ఇదె.

ఎలా ప్రా ర్ధన చేయ్యాలి: పునాది

మొట్టమొదటగా నీవ్వు దేవునితో సహవాసాన్ని ప్రారభించాలి. ఎందుకనగా, మైక్ అనేటువంటి వ్యక్తి ప్రిన్స్ టన్ విద్యాలయపు ప్రెసిడెంట్ గారిని కారులోను నిమ్మితమై సంతకము పెట్టమన్నాడనుకోండి. ఒకవేళ్ళ మైక్ ప్రిన్స్ టన్ విద్యాలయపు వ్యక్తిని వ్యక్తిగతంగా తెలుసుకోకుండా కారులోనుకి సంతకము పెట్టడం అసాధ్యము. కాని, ప్రెసిడెంట్ యొక్క కుమార్తె వాళ్ళ నాన్నని తన కారులోను కోసం సంతకము పెట్టమన్నట్లయితే అది అసల సమస్యే కాదు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ్ళ ఆ వ్యక్తి దేవుని యొక్క కుమారుడైతే, ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన వ్యక్తి అయితే, అతని ప్రార్ధనలు ఆలకించబడతాయి. యేసుప్రభువారు అన్నారు,"నేను గొఱ్ఱెల మంచి కాపరిని, నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు."4

దేవుని విషయములో నీవు నిజముగా దేవుని తెలుసుకునావా, ఆయనకి నీవు తెలుసా? ఆయనతో నీవు కలిగివున్నటువంటి సహవాసము నీ ప్రార్ధనలు ఆలకించబడతాయ్యన నమ్మకము ఉందా? లేక దేవుడు నీకు దూరముగా ఉన్నాడా, కేవలము నీ జీవితములో ఒక ఆలోచనగా మిగిలిపోయాడా? ఒకవేళ్ళ దేవుడు నీకు దూరముగా వున్నట్లయితే, లేక నీవు ఆయనను తెలుసుకోకుండ ఉన్నట్లయితే, ఆయనతో సహవాసాన్ని ప్రారభించడానికి నీకు సహాయపడే అంశం ఇది. దేవునితో భాగ్యస్వామ్యము కలిగి ఉండుట.

దేవుడు కశ్చితముగా నీ ప్రా ర్ధనల్ని ఆలకిస్తాడా?

ఆయనను తెలిసివున్న వారికి ఆయన మీద ఆధారపడిన వారికి, యేసుప్రభువారు ఇచ్చేటువంటి అవకాశం చాలా ఉదారముగా కనపడుతుంది. " నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును."5 ఆయనయందు నిలిచియుండటము మరియు ఆయన వాక్యమందు నిలచి ఉండటము అంటే ఆయన మీద ఆధారపడి, ఆయన చెప్పేది వింటూ వారి జీవితములను ఆయనకు తగినటుగా నిర్వహించడమే, అప్పుడు వారికి ఏమికావాలో అది అడగగలరు. ఆయనను అడగటానికి మరొక్క అర్హత ఏమిటంటే," మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము,తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొన్నును; అతనిబట్టి దేవుడు మరణముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు.అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు."6 దేవుడు మన ప్రార్ధనలన్ని ఆయన చితానుసారముగా ఆలకిస్తాడు( మరియు ఆయన ఙ్ఞానమును బట్టి, మన యెడల ఆయన ప్రేమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి మొదలగునవి).

ఆయన చిత్తము మనకు తెలుసు ఎందుకంటే మనకు అర్ధమైనట్టుగా తిరుగుతాము కాబట్టి. మనము చేసిన ప్రత్యేకమైన ప్రార్ధనకి ఒకటే సరైన జవాబు అనుకుంటాము. మరియు అదే దేవుని చిత్తమని తలుస్తాము. ఇలా అనుకోవటం ద్వారానే సమస్య కష్టతరముగా మారుతుంది. మనము మన సమస్య పరిమితిలో, ఙ్ఞానపు పరిమితిలో జీవిస్తుంటాము. మన దగ్గర ఆ సమస్యకు సంబంధించి మన దగ్గర కొంత సమాచారము మాత్రమే ఉంటుంది. మరియు ఆ సందర్భపు భవిష్యతు పనుల అంతర్ నిహితం. దేవుని ఆలోచనలకు పరిమితి లేదా. జీవితములో జరిగేటువంటి విషయాలు, పరిస్థితి లేక చరిత్ర ఇవన్నియు ఆయనకు తెలిసినటువంటివే. మరియు మనము ఊహించలేనటువంటి గొప్ప ఉద్దేశాలు ఆయన కలిగివున్నాడు. కాబట్టి, ఇది దేవుడు చిత్తమని మనము తీర్మానించుకున్నాము కాబట్టి దేవుడు ఊరికే ఏది చేసేయ్యడు.

దేవుడు నీ ప్రా ర్ధన ఆలకించాలంటే? దేవుడు అసల ఏమి చేయ్యాలనుకుంటున్నాడు?

దేవుడు ఉద్దేశములు మన పట్ల తెలుసుకోవాలంటే పేజీల కొలది మనము వ్రాయాల్సివస్తుంది. బైబిల్ గ్రంధము యొక్క పూర్తి వివరణ ఏమిటంటే దేవునితో మనము కలిగి వుండాల్సినటువంటి సంబంధాన్ని మనము అనుభవించాలని మరియు ఆయన మనకివాలనుకునటువంటి జీవితాన్ని తెలియచేయటమే ఇది తెలుసుకొనుటకు కొన్ని ఉదాహరణలు ఇవిగో.

"కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడు ఆయన నిమ్మితము కనిపెట్టుకొనువారందరు ధన్యులు."7 నీకు ఇది అర్ధమైనదా? కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి నీకు సహాయము చేయుటకు లేచిన్నట్టుగా" నీకు కనికరము చూపుటకు ఆయన లెగుస్తాడు."8 " దేవుడు యదార్ధవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారందరికి ఆయన కేడెము." "తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.”9

ఏదేమైన, నీ పట్ల దేవుడు కనపరచేటువంటి గొప్ప తీర్మానము ఇదే:" తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగల దేవుడు లేడు."10 ఇదిఏ యేసుప్రభు వారు మన కొరకు చేసినది. అయితే, " తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?."11

జవాబు వ్రానటువంటి ప్రా ర్ధనల సంగతి ఏమిటి?

నిజముగా ప్రజలు అనారోగ్యాన్ని అనుభవిస్తారు, చనిపొతారు, అర్ధికమైన సమస్యలు. మరియు అన్ని రకాలైనటువంటి అతి కష్టమైన పరిస్థితులగుండ వెలతారు. అయితే ఏమిటి? మన యొక్క భారములు ఆయన మీద మోపాలని ఆశపడుతున్నారు. సందర్భాలు బాధకి గురి చేసిన్నపటికి కూడా, "ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి."12 మన పరిస్థితులు మన ఆదీనములో లేనప్పటికి, అది నిజము కాదు. లోకమంతా మనకి వ్యతిరేకముగా తిరిగినప్పటికి కూడా దేవుడు మనల్ని ఐక్యతగా ఉంచగలడు. అందుకే ఒక వ్యక్తి తాను దేవున్ని ఎరిగి వున్నాడు. కాబట్టి, కృతఙ్ఞత భావం కలిగి ఉండగలడు." మీ సహనమును సకల జనులకు తెలియనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములలోను ప్రార్ధన విఙ్ఞాపములచేత కృతఙ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త ఙ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును."13 నీవు ఊహించనిదానికంటే దేవుడు మన సమస్యలకు పరిష్కారం ఇవ్వగలడు, సమస్యల్ని చక్కపరచగలడు. ఉదాహరణకు ఏ క్రైస్తవుడైన తన జీవితములో జరిగిన సందర్భాలను వివరించగలడు. కాని పరిస్థితులు ఒకవేళ్ళ చక్కపరచబడనప్పటికిని దేవుడు ఆ పరిస్థితులో మనకు సమాధానం ఇవ్వగలడు. యేసుప్రభువారు ఇలాగు అన్నారు." శాంతి మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి."14

ఇటువంటి పరిస్థితులలో నీవు దేవుని మీద నమ్మకం వుంచాలని దేవుడు కోరుకుంటాడు... మనం మన కళ్ళతో చూసి కాకుండా విశ్వాసంతో నడవాలని బైబిల్ చెబుతుంది. కాని ఇది గుడ్డివిశ్వాసము కాదు. ఈ విశ్వాసం దేవుని స్వభావం మీద ఆధారపడినది. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద వెళ్ళుతున కారు ఆ బ్రిడ్జ్ కి ఉన్న పూర్తి బలం మీద ఆధారపడుతుంది. డ్రైవర్ ఏమి అనుకుంటున్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో తనతో పాటు ప్రయానిస్తున్న వారితో ఏమి మాట్లాడుతునాడోన్న విషయం బ్రిడ్జ్ పట్టించుకోదు. డ్రైవర్ కూడ నమ్మె విషయం ఏమిటంటే ఆ బ్రిడ్జ్ కి ఉన్న గట్టితనం, పటిష్టత ఆ కారును ఆవతలకి వెళ్ళేలాగా చేస్తుంది.

ఇదే విధముగా, మనం దేవుని మీద ఉంచాలన్ని పిలుస్తున్నాడు. దేవుని యదార్ధత మీద, ఆయన స్వభావము మీద, ఆయన కనికరము మీద, ప్రేమ మీద, ఙ్ఞనము మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్పాడు,"చాలాకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుకు విడువక నీయెడల కృప చూపుచున్నాను.”15 "జనులార, యెల్లపుడు ఆయనయందు నమ్మకముంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము."16

ఇవన్ని గమనించిన తరువాత - మనము ఎలా ప్రా ర్ధనచేయాలి

దేవుడు ఆయన పిల్లల ప్రార్ధనలు ఆలకించాలని కోరుతున్నాడు(ఎవరైతే దేవుని వెంబడించాలని కోరుకుంటారో మరియు ఆయన వారి జీవితములోనికి ఆహ్వానిస్తారో). మనకున్న ఏ సమస్య అయిన మనము ప్రార్ధన ద్వారా ఆయన యొద్దకు తీసుకురమ్మని దేవుడు పిలుస్తున్నాడు, అలా తీసుకువెళ్ళితే ఆయన తన చితానుసారముగా ఆ పని చేస్తాడు. మనం కష్టాలు ఎదుర్కుంటున్నప్పుడు ఏ సమస్యనైనా ఆయనకు చెప్పి దేవుని దగ్గరనుండి వచ్చె శాంతిని పొందుకుంటే నీ కష్టాలు తీరిపోతాయి. మన ఆశకు, విశ్వాసానికి కారణము ఏమిటంటే దేవుని స్వాభావము మాత్రమే. ఎంత ఎక్కువగా ఆయనను మనం తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయనను మనం నమ్మగలం.

దేవుని గురించి మరింత తెలుసుకోవాలంటే దయచేసి చూడండి దేవుడు ఎవ్వరు? మరియు ఇతర విషయములు కూడ ఉన్నాయి. మనం ప్రార్ధన చేయటానికి కారణం దేవుని స్వభావమే. దేవుడు ఆలకించే మొట్టమొదటి ప్రార్ధన ఏమిటంటే ఆయనతో సంబంధాన్ని కలిగిఉండాలని నీవు చేసే ప్రార్ధన.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) 1 యోహాను 5:14 (2) 1 పేతురు 3: 12 (3) యెషయా 59:1,2 (4) యోహాను 10:14,27-28 (5) యోహాను 15:7 (6) 1 యోహాను 5:14,15 (7) యెషయా 30:18 (8) కీర్తనలు 18:30 (9) కీర్తనలు 147:11 (10) యోహాను 15:13 (11) రోమీయులకు 8:32 (12) 1 పేతురు 5:7 (13) ఫిలిప్పీయులకు 4:5-7 (14) యోహాను 14:27 (15) యిర్మియా 31:3 (16) కీర్తనలు 62:8

ఇతరులతో పంచుకోండ  

TOP