జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

పరలోకము ఎలా ఉంటుంది? నిజముగా పరలోకము ఉందా?

Q: "నిజముగా పరలోకము ఉందా, పరలోకము ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది”?

మన జవాబు: అవును పరలోకము నిజముగానే ఉంది.

అనేకమంది చెప్పే ఈ పరలోకము నిజముగా నిత్యమైన పట్టణానికి సాదృశ్యముగా బైబిల్ చెప్పేటువంటి "నూతన యెరూషలేము"1 అని పిలవచ్చు. అది రమ్యమైనటువంటిది. ఉదాహరణగా, పరలోకము ఇలా ఉంటుందని చెప్పొచ్చు.

ఒక నది, స్పటికమువలె స్పష్టమైనది, పట్టణపు మధ్యలో ఉన్న దేవుని సింహాసనము మరియు గొఱ్ఱెపిల్ల (ప్రభువైన యేసు) వద్ద నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండువైపులా జీవపు వృక్షాలు వున్నాయి, ప్రతి నెల పన్నెండు రకాల ఫలాలన్ని ఫలిస్తుంటాయి. ఆ పట్టణపు వీధులు స్పష్టమైన బంగారంతో నిండి ఉంటాయి, అద్దం లాంటి దారి. పట్టణపు ద్వారము మరియు పట్టణపు గోడ అమ్మూల్యమైనటువంటి బంగారము వెల గలిగిన రాళ్ళతో, పచ్చ, గోమేధిక,పుష్పరాగము మొదలగునవి. పట్టణానికి సూర్యుడును, చంద్రుడును అవసరము లేదు, సంఘమును మందిరము యొక్క అవసరము కూడ లేదు. దేవుని సన్నిధి ఆ ప్రాంతమునకు వెలుగుగా ఉండును.2

కాని, పరలోకము యొక్క అందము ఈ రీతిగా ఉంటుంది.

“అప్పుడు - ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు - ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు - ఈ మాటలు నమ్మకమును నిజమునైయునవి; నేనే అల్ఫాయు ఓమెగము, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొనువానికి జీవజలములు బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.”3

పరలోకము దేవునిది. ఆయన దానిని సృజించాడు. " ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుతత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.”4

యేసుప్రభువారు మొదటిగా భూమి మీదకి రక్షకుడిగా వచ్చిన్నపట్టికిను, ఆయన ఒకరోజు న్యాయాధిపతిగా ఉంటారు. "ప్రజలందరు శరీర సంబధితమైన పుణరుద్ధానాని అనుభవిస్తారు, అందరును యేసుప్రభు వారి న్యాయాసింహాసనము ఎదురుగా నిలబడతారు.”5

ఒక వ్యక్తి పరలోకమునకు ఎలా చెరతాడో అన్న విషయాన్ని యేసుప్రభు వారు మాటలతో చూడటం మనకి ఉపయోగకరం

అనేక మంది అనుకుంటారు నలుగురు మెచ్చుకునేటట్లు జీవించిన్నట్లయితే, అతి గోరమైన పాపాలు అయిన నరహత్య మొదలగు వాటికి దూరముగా ఉంటే చాలు.

కాని యేసుప్రభు వారు పరలోకానికి ఎలా వెళ్తారో ఈ రీతిగా చెప్పారు. "మీ యొక్క నీతి శాస్త్రులు యొక్క నీతి కంటె మరియు పరిసయుల యొక్క నీతికంటే అధికముగా లేని యెడల నీవు పరలోకరాజ్యములో అడుగు పెట్టలేవు." శాస్త్రులు పరిసయులు సంఘములో గౌరవించదగినటువంటి మత పెద్దలు. వారు మంచి వారు పవిత్రమైన వారు!

యెషయా ప్రవక్త చెప్పిన మాట తిరిగి యేసుప్రభువారు ఈ రీతిగా చెప్పారు. పరలోకానికి వెళ్ళటానికి ఎవరు అర్హులు కాదు. ఎవరి నీతి క్రియలు అంత గొప్పవి కాదు. ఆయన నీతిక్రియల ద్వార మనం పరలోకం చేరుకోలేము. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మనము చేరుకోలేని పరలోకానికి నిత్యజీవమిచ్చి చేర్చాలని.

అది ఈ రీతిగా జరుగుతుంది. యేసుప్రభు వారి యందు నమ్మకము ఉంచని ప్రతి వారికి పరలోకరాజ్యము అనుగ్రహింపబడింది."ఎవరైతె యేసుప్రభు వారి యందు విశ్వాసము ఉంచుతారో వారు నశింపక నిత్యజీవము పొందుకుంటారు. దేవుడు తన కుమారుడను లోకమునకు తీర్పుతీర్చటానికి పంపలేదు కాని, ఈ లోకాన్ని ఆయన ద్వార రక్షించడానికి పంపారు.”6

మనము ఎప్పుడైతే యేసుప్రభు వారితో సంబంధాన్ని ప్రారంభిస్తున్నావో, ఆ సంబంధము నిత్యత్వము దాక కొనసాగె సంబంధము. జీవ గ్రంధములో మన పేర్లు వ్రాయబడివున్నవి. యేసుప్రభు వారు ఇలా అన్నారు.నా మాటవిని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వారు తీర్పు లోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.7

పరలోక సంబంధ విషయములో, యేసుప్రభుని అంగీకరించక నిత్యజీవాన్ని పొందుకుంటామా లేదా అనేది పూర్తిగా మన నిర్ణయం.

యేసుప్రభు వారు ఇలాగు చెప్పారు," కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును".8

వాక్యము మనకి ఈ రీతిగా చెప్పుచున్నది. ప్రతి గోత్రము నుండి, ప్రతి భాష నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి రాజ్యము నుండి గుంపులుగా ప్రజలు పరలోకములో ఉంటారు. వీరందరు నిత్యజీవాన్ని యేసుప్రభు వారి మీద విశ్వాసము ఉంచడం ద్వార పొందుకున్నారు.

యేసుప్రభు వారి మీద విశ్వాసము ఉంచటం అంటే ఏమిటి, కేవలం యేసుప్రభు వారి గురించిన విషయాలు నమ్మడం కాదు. బారక్ ఒబామ 2013 లో అమెరిక దేశాన్నికి ప్రెసిడెంట్ అన్ని నమ్మటంలోను ఆయన వ్యక్తిగతంగ తెలుసుకోవటంలోను చాలా ఆంతర్యము ఉంది.అదే విధముగా యేసు ప్రభు వారు దేవుడుని నీవు నమ్మవచ్చు. కాని ఆయనని నీ జీవితములో చేర్చుకోకుండా ఉన్నావెమో.

ఈ రీతిగా నీవు యేసుప్రభు వారి మీద నమ్మకము ఉంచితే నీవు నిత్యజీవాన్ని పొందుకోగలవు. మరిన్ని విషయాలకు చూడండి.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) ప్రకటన: 21:2 (2) ప్రకటన: 21 మరియు 22 (3) ప్రకటన: 21:3-5 (4) కొలస్సయులకు : 1:16 (5) ప్రకటన: 20:11-13 (6) యోహాను : 3:16,17 (7) యోహాను : 5:24 (8) యోహాను : 6:40

ఇతరులతో పంచుకోండ  

TOP