జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

దేవుని వ్యక్తిగతంగా తెలుసుకొనుట

దేవుని కనుగొనుడి – దేవుని తెలుసుకొనుటకు ఏమి చెయ్యాలి? ఇప్పుడే మీరు దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం ఎలా కలిగియుండగలరో ఇది మీకు వివరిస్తుంది.

దేవునితో ఒక అనుబంధం ఆరంభించుటకు ఏమి చెయ్యాలి? మెరుపు వచ్చు వరకు ఆగాలా? నిస్వార్థ మత కార్యములు చెయ్యాలా? దేవుడు మిమ్మును అంగీకరించులాగ మంచి వ్యక్తిగా మారాలా? వీటిలో ఏది కాదు. ఆయనను మనం ఎలా తెలుసుకోగలమో బైబిల్ లో దేవుడు స్పష్టము చేసెను. దేవునితో మీరు వ్యక్తిగత సంబంధం ఎలా కలిగియుండగలరో ఇది మీకు వివరిస్తుంది...నియమము ఒకటి: దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు మరియు మీ జీవితం కొరకు ఒక అద్భుత ప్రణాళిక ఇచ్చుచున్నాడు.

దేవుడు మిమ్మును సృష్టించాడు. అంతేకాదు, అయన మిమ్మును ఎంత ప్రేమించుచున్నాడంటే మీరు ఆయనను తెలుసుకొని ఆయనతో నిత్యత్వమును గడపాలని ఆయన కోరుచున్నాడు. యేసు చెప్పెను, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”1

మనలో ప్రతి ఒక్కరు యేసును వ్యక్తిగతంగా తెలుసుకొని అర్థం చేసుకోవాలని యేసు వచ్చెను. యేసు మాత్రమే మీ జీవితమునకు అర్థమును మరియు ఉద్దేశమును ఇవ్వగలడు.

దేవుని తెలుసుకొనుట నుండి మనలను ఏమి ఆపుతుంది?...నియమము రెండు: మనమంతా పాపము చేస్తాము మరియు మన పాపం మనలను దేవుని నుండి వేరుచేసింది.

పాపము వలన ఆ ఎడబాటును మరియు దేవుని నుండి దూరమును మనం అనుభవిస్తాం. బైబిల్ మనకు ఇలా చెబుతుంది “మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తన కిష్టమైన త్రోవకు తొలగెను.”2

మన అంతరంగములో, దేవునికి మరియు అయన మార్గములకు మనం తిరుగుబాటు చేస్తుండవచ్చు లేక అనుసరించకుండా ఉండవచ్చు, కాని అదంతా బైబిల్ పాపము అని పిలుచే దానికి రుజువుగా ఉంది.

మన జీవితాలలో పాపము యొక్క పరిణామం మరణం – దేవుని నుండి ఆత్మీయ ఎడబాటు.3 మన సొంత కృషి ద్వారా దేవునికి దగ్గరగా రావాలని మనం ప్రయత్నించినప్పటికీ, మనం ఖచ్చితంగా విఫలమవుతాం.

మనకు దేవుని మధ్య ఉన్న గొప్ప ఖాళీని ఈ చిత్రం చూపిస్తుంది. ఇక్కడ ఉన్న బాణం గురుతులు మనం దేవుని చేరాలని చేసే కృషిని చూపిస్తాయి. మన జీవితములో మంచి పనులు చేయుటకు మనం ప్రయత్నించవచ్చు, లేక మంచి జీవితం ద్వారా లేక ఒక నైతిక తత్త్వము ద్వారా దేవుని అంగీకారం కొరకు ప్రయత్నిస్తుంటాం. కాని మన సత్ క్రియలు మన పాపములను కప్పలేవు.

ఈ ఖాళీని మనం ఎలా పూరించగలము?...
నియమము మూడు: మన పాపముల కొరకు యేసు క్రీస్తు మాత్రమే దేవుని యొక్క ఉపాయం. ఆయన ద్వారా మన జీవితాలలో దేవుని ప్రేమను మరియు ప్రణాళికను అర్థం చేసుకొనవచ్చు.

మన పాపమునకు పరిహారం మనమే చెల్లించవలెను. అయితే సమస్య ఏమిటంటే ఆ పరిహారం మరణం. దేవుని నుండి దూరమై మనం చనిపోకుండా, మన కొరకు ఆయన ప్రేమ వలన, యేసు క్రీస్తు మన స్థానంలో మరణించెను.

యేసు “అదృశ్యదేవుని స్వరూపియై యున్నాడని సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెనని”4 అని బైబిల్ చెబుతుంది. యేసు ఒక దైవదూషణ కొరకు సిలువ వేయబడెను – తన్ను తాను దేవునితో సరిపోల్చుకున్నందుకు – అయన సమానుడే.

సిలువపై, మన పాపములను సంపూర్ణంగా యేసు తనపై వేసుకొని, దానికి పూర్తిగా వెల చెల్లించాడు. “మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చనిపోయెను.”5 “... మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే మనలను రక్షించెను.”6 సిలువపై యేసు యొక్క మరణం వలన, మన పాపం మనలను మరెన్నడు దేవుని నుండి వేరుచేయవలసిన పని లేదు.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”7

యేసు కేవలం మన పాపం కొరకు మరణించనేలేదు, ఆయన మరణము నుండు తిరిగిలేచెను.8 ఆయన అలా చేసినప్పుడు, ఆయన మనకు నిత్య జీవమును వాగ్దానం చేయగలడని ఖచ్చితంగా నిర్థారించాడు. అందుకనే యేసు అన్నాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాలేడు.”9

దేవుని చేరుటకు బలవంతంగా ప్రయత్నించుట కంటె, ఈ క్షణమే ఆయనతో అనుబంధం ఎలా ఆరంభించగలమో ఆయన చెబుతున్నాడు. యేసు చెప్పెను, “నా యొద్దకు రండి.” “ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచు.... వాని కడుపులో నుండి జీవజల నదులు పారును.”10 యేసుకు మన పట్ల ఉన్న ప్రేమ ఆయనను సిలువ ఎత్తుకొనునట్లు చేసింది. మరియు అయన యొద్దకు రమ్మని ఆయన ఇప్పుడు మనను ఆహ్వానిస్తున్నాడు, తద్వారా ఆయనతో మనం ఒక వ్యక్తిగత సంబంధం ఆరంభించాలని.

మన కొరకు యేసు ఏమి చేశాడో మరియు ఆయన మనకు ఏమి ఇస్తున్నాడో తెలుసుకొనుట మాత్రమే సరిపోదు. దేవునితో అనుబంధం కలిగియుండుటకు మనం ఆయనను మన జీవితములోనికి ఆహ్వానించాలి.నియమము నాలుగు: మనం యేసు క్రీస్తు ను ప్రభువు మరియు రక్షకుడని వ్యక్తిగతంగా అంగీకరించాలి

బైబిల్ చెబుతుంది, “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.”11

మనం విశ్వాసముతో యేసును అంగీకరిస్తాం. బైబిల్ చెబుతుంది, “మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు, ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు.”12

యేసును అంగీకరించుట అంటే యేసు దేవుని కుమారుడని నమ్ముట, మరియు ఆయనను మన జీవితములకు మార్గదర్శకం చూపి నడిపించమని ఆహ్వానించుట.13 యేసు చెప్పెను, “మీకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.”14

మరియు ఇది యేసు యొక్క ఆహ్వానం. ఆయన అన్నాడు, “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చెదను.”15

దేవుని ఆహ్వానమునకు నీవు ఎలా స్పందిస్తావు.

ఈ రెండు వృత్తములను పరిశీలించండి:


స్వయం-నియంత్రిత జీవితం

సిహాసనంపై స్వయంగా (self)

యేసు జీవితమునకు వెలుపల

నిర్ణయాలు మరియు క్రియలు సమపుర్ణంగా స్వయం ప్రేరితమైనవి, కొన్ని సార్లు చిరాకుకు నడిపిస్తాయిక్రీస్తు నియంత్రిత జీవితం

యేసే జీవితములో సింహాసనంపై ఉన్నాడు

స్వయం యేసు మాట వింటుంది

ఒక వ్యక్తి తన జీవితంలో యేసు యొక్క ప్రభావమును మరియు దిశను చూస్తాడు


వీటిలో ఏ వృత్తము మీ జీవితమును వివరిస్తుంది?

మీ జీవితములో ఏ వృత్తమునకు మీరు ప్రాతినిథ్యం ఇవ్వగోరుచున్నారు?

యేసుతో అనుబంధమును ఆరంభించండి...మీరు ఈ క్షణమే యేసును పొందుకొనవచ్చు. యేసు ఇలా చెబుతున్నాడు జ్ఞాపకం ఉంచుకోండి, “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చెదను.”16 ఆయన ఆహ్వానమునకు మీరు స్పందించాలని అనుకుంటున్నారా? ఇలా చెయ్యవచ్చు.

దేవునికి మిమ్మును మీరు సమర్పించుకొనుటలో మీరు ఉపయోగించు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. నీ హృదయ తలంపులు ఆయనకు తెలుసు. ఎలా ప్రార్థన చెయ్యాలో మీకు తెలియకపోతే, ఈ మాటలు మీకు సహాయం చేస్తాయి:

“యేసు, మిమ్మును తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నా జీవితంలోనికి రావాలని ఆశించుచున్నాను. నా పాపము కొరకు సిలువలో మరణించినందుకు వందనములు. నీవు నన్ను సృష్టించిన రీతిగా నేను మారుటకు న్జీవు మాత్రమే నాకు శక్తిని ఇవ్వగలవు. నన్ను క్షమించి దేవునితో నాకు నిత్య జీవమును ఇచ్చినందుకు వందనములు. నీ చిత్తప్రకారం దానిని నడిపించు. ఆమేన్.”

బైబిల్ అధ్యయనం, ప్రార్థన, మరియు ఇతర క్రైస్తవులతో సంభాషణల ద్వారా మీరు దేవుని తెలుసుకొనుట ద్వారా మీ జీవిత కాలమంతా మార్పు మరియు అభివృద్ధి కలుగుతుంది.

 నేను యేసును నా జీవితములోనికి ఆహ్వానించాను (కొంత ఉపయోగకరమైన సమాచారం ఇక్కడ ఉంది)…
 యేసును నా జీవితములోనికి ఆహ్వానించాలని ఉంది గాని, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది దానికి ముందు జవాబు కావాలి…

(1) యోహాను 3:16 (2) యెషయా 53:6 (3) రోమా. 6:23 (4) కొలొస్సి. 1:15,16 (5) 1 పేతురు 3:18 (6) తీతు. 3:5 (7) యోహాను 3:16 (8) 1 కొరింథీ. 15:3-6 (9) యోహాను 14:6 (10) యోహాను 7:37,38 (11) యోహాను 1:12 (12) ఎఫెసీ. 2:8,9 (13) యోహాను 3:1-8 (14) యోహాను 10:10 (15) ప్రకటన 3:20 (16) ప్రకటన 3:20

ఇతరులతో పంచుకోండ  

TOP