జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

యేసు మరియు ఇస్లాం

ఇక్కడ మహమ్మదీయులు మరియు ఇతరులు యేసును గూర్చి అడుగు ఆరు ప్రశ్నలు ఉన్నవి.

యేసుని గూర్చి తెలుసుకోవాలనుకున్న వారికి ఇది చాలా గౌరవనీయమైన ప్రదర్శన. సవాళ్ళు లేవు. ఏ రీతిగాను ఏ మతమును గూర్చిన విమర్శలు ఉండవు.

ఈ వ్యాసంలో సమాధానాలు ఇవ్వబడిన ఆరు ప్రశ్నలు ఇవే:

  1. బైబిల్ దాని వాస్తవిక స్థితి నుండి మార్చబడినదా?
  2. ఒక మతము మరొక మతము యొక్క స్థానమును తీసుకుంటుందని దేవుడు చెప్పాడా: యూదా మతము, తరువాత క్రైస్తవ్యము, తరువాత ఇస్లాం?
  3. దేవునికి కుమారుడున్నాడని చెప్పుట దైవదూషణ కాదా?
  4. యేసు సిలువపై మరణించాడా?
  5. యేసు సిలువ మీద మరణించియుంటే, దేవుడు 3 రోజుల పాటు మరణించియున్నాడా?
  6. యేసును ఒక ప్రవక్తగా ఎందుకు చూడకూడదు?

1. యేసు మరియు ఇస్లాం: బైబిల్ దేవుని వాక్యమా? లేదా మార్చబడినదా, లేదా మలినమైనదా?

పరిచయ వాక్కులుగా, ఇక్కడ బైబిల్ లో ఉన్న కొన్ని వాక్యములు ఇవ్వబడినవి: “ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”1

దేవుని వాక్యము అంతమయ్యేది కాదు. దానిలో వ్రాయబడినవన్నీ సంపూర్ణంగా నెరవేర్చబడతాయి. “ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు”2 అని వాక్యము నొక్కిచెబుతుంది.

అంతేగాక, “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”3 లేఖనమంతా దేవుని చేత ప్రేరేపించబడినది.

మరియు, “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”4

మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, “దేవుడు తన వాక్యమును సంరక్షించుకొనగలడా? ఆయన వాక్యము గతించిపోదు, మరియు నెరవేర్చబడకమానదు అను కథనములను దేవుడు నెరవేర్చగలడా?”

దేవుడు సమర్థుడా? అవును. ఇది అందరి కొరకు దేవుని వాక్యము. ఆయన వాక్యము మార్పుచెందకుండా కాపాడుటకు ఆయన అసమర్థుడు అని చెప్పుట ద్వారా ఆయన మీద నింద మోపుతున్నామా?

ఏది మార్పు చెందలేదు. అది కేవలం ఒక పుకారు మాత్రమే.

బైబిల్ మార్చబడినదని ఖురాన్ చెప్పుటలేదు. దీనికి వ్యతిరేకమును చెబుతుంది. అది తోరాను బైబిల్ ను గౌరవిస్తుంది. అది తోరాను, “జాబుర్”ను (పాత నిబంధన మరియు కీర్తనలు) మరియు “ఇంజీల్”ను (క్రొత్త నిబంధన) చాలా సార్లు ప్రస్తావిస్తుంది.

యేసు క్రీస్తుకు 600 సంవత్సరాల తరువాత 6వ శతాబ్దంలో ఇస్లాం ఆరంభమైనప్పుడు, బైబిల్ సత్యమని అంగీకరించబడెను.

అయితే మీరు అడగవచ్చు, 6వ శతాబ్దం తరువాత బైబిల్ మారిందా అని? లేదు. మీరు చెయ్యవలసినదంతా నేటి బైబిల్ ను చాలా కాలం క్రితం వ్రాసిన బైబిల్ తో పోల్చడమే.

మనం క్రీ.శ. 300 నాటికే, అనగా ఖురాన్ వచ్చుటకు వందల సంవత్సరాల క్రితమే, సంపూర్ణంగా ఉన్న బైబిల్ ను కనుగొనగలము. లండన్ సంగ్రహశాలలో ఒకటి, వాటికన్లో ఒకటి మరియు అనేక చోట్ల వీటిని మనం కనుగొనవచ్చు. నేటి బైబిల్ ను క్రీ.శ. 300 నాటి బైబిల్ తో మీరు పోల్చినయెడల, నేడు మన యొద్ద ఉన్న బైబిల్ మరియు ఆ రోజు ఉన్న బైబిల్ ఒకటే.

నేడు క్రొత్త నిబంధన యొక్క 25,000 చేతి వ్రాత ప్రతులు ఉన్నాయని మీకు తెలుసా? చరిత్రకారులు ఈ ప్రతులను పోల్చగా, నేడు మన యొద్ద ఉన్న క్రొత్త నిబంధన కనీసం 99.5% ఖచ్చితమైనదని వారు నిర్థారించారు.

(మిగిలిన 5% వ్యత్యాసం కేవలం అక్షర దోషమేగాని అర్థంలో మార్పులేదు.)

అంతేగాక, ఈ మధ్యకాలంలో మృత సముద్రపు చుట్టాల యొక్క పురావస్తు ఆధారాలు మీకు బహుశా తెలిసియుండవచ్చు. ఇవి మృత సముద్రానికి నైరుతీ దిశగా ఉన్న ఖుమ్రాన్ గుహలలో లభ్యమైయ్యాయి.

పరిశోధకులు వారికి లభ్యమైన వాటిని నేడు ఉన్న బైబిల్ తో పోల్చిచూసారు, మరియు అవి దాదాపు 100% పోలికగా ఉన్నాయి.

క్రొత్త నిబంధన లేక బైబిల్ దాని వాస్తవిక రచనల నుండి మార్చబడినదని ఎవరు మీతో చెప్పనియ్యకుడి. అది చారిత్రకంగా సరైన మాట కాదు.

బైబిల్ మార్చబడలేదు.

సరే, అయితే నాలుగు సువార్తల సంగతేమిటి? అవి భిన్నమైన లేఖనములు కాదా, మరియు ఒకదానితో మరొకదానికి బేధము లేదా?

అవును, క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తలు ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను. వాస్తవానికి, బైబిల్ అబద్ధము కాదని చూపుటకు ఇవి ఉపయోగపడతాయి. యేసు ఏమి చెప్పెను, ఏమి చేసెను అనుటకు యేసు జీవితము యొక్క నాలుగు వివరణలు ఉన్నాయి.

విధి చివరన జరిగిన ఒక కార్ దుర్ఘటనను ఒకరు లేక ఇద్దరు, లేక నలుగురు చూచారని ఊహించుకోండి. మరియు వారు చూచిన కార్ దుర్ఘటనను న్యాయస్థానంలో సమర్పించుట కొరకు వ్రాయమని నలుగురుకి అడిగారు. అందరు ఒకే విధమైన వివరణ, ఒకే సాక్ష్యం, మాటకు-మాట ఉన్నది ఉన్నట్లు చెబుతారని మీరనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ప్రతి ఒక్కరు అతడు లేక ఆమె చూచినది అతడు లేక ఆమె యొక్క దృష్టికోణములో వ్రాస్తారు. యేసుకు ప్రత్యక్షసాక్షులుగా ఈ నలుగురు యేసు యొక్క వివరణను వ్రాసినప్పుడు అలానే జరిగింది.

కొన్ని శతాబ్దాలుగా న్యాయ వ్యవస్థలో సాక్షుల ప్రమేయం ఉంది. మరియు కొన్ని మరీ ముఖ్యమైన విషయాలలో, ఒక వ్యక్తి మాట వేరొకరి మాటకు వ్యతిరేకంగా ఉండకూడదు. అనేక సార్లు ఒక సాక్షి కంటె ఎక్కువ సాక్షులు ఉండాలి. ఇక్కడ క్రొత్త నిబంధనలో పాత నిబంధనలోని ఒక వాక్యము వ్రాయడం జరిగింది. “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను.”5

యేసును గూర్చి ఈ నాలుగు సాక్ష్యములు, సువార్తలు వ్రాసినవారు, మాత్రమే గాక అనేక సాక్ష్యములు ఉన్నాయి. యాకోబు, పులు, యూదా, పేతురు, మరియు క్రొత్త నిబంధన వ్రాసిన మిగిలిన రచయితలు. యోహాను చెప్పాడు, “మా కన్నులు వేటిని చూచెనో, మా చేతులు దేనిని తాకెనో, వాటిని గూర్చి మేము వ్రాయుచున్నాము.”6 వారు యేసు యొక్క ప్రత్యక్ష సాక్షులు. కాబట్టి వేటిని చూచారా వాటినే వ్రాశారు.

బైబిల్ వ్రాయబడిన అన్ని భాషలు మరియు అన్ని అనువాదముల విషయం ఏమిటి?

బైబిల్ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో వ్రాయబడినది. ఏ బైబిల్ అయిన, అది ఏ సంవత్సరములో ముద్రింపబడినా, అది హెబ్రీ మరియు గ్రీకు అను మూల భాషల అనువాదము మాత్రమే. (ఉదాహరణకు బైబిల్ ఆంగ్లము నుండి ఆంగ్లములోనికి ఎప్పుడు తర్జుమా చేయబడలేదు. వారు ఎల్లప్పుడు మూల భాష నుండి ఆరంభించారు).

కొన్ని బైబిల్లు తర్జుమాలు గాక, వివరణలుగా ఉన్నాయి. మరియు వాటిని అర్థ వివరణలుగా గుర్తించారు. అయితే, తర్జుమాలు అనగా – మూల హెబ్రీ మరియు గ్రీకు లేఖనములను అనువదించుట.

బైబిల్ యొక్క హెబి మరియు గ్రీకు వ్రాతలు కొన్ని వెల భాషలలోనికి అనువదించబడినాయి. ఎందుకు? ఎందుకంటే లోకములో ఉన్న ప్రతి వ్యక్తి సువార్తను తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు.

మరియు బైబిల్ అనువదించుటకు కష్టమైనది కాదు. బైబిల్ లో పద్యభాగములు ఉన్నాయి (సామెతలు, పరమగీతము, కీర్తనలు). కాని బైబిల్ యొక్క ముఖ్య భాగము చాలా సులువైన భాషలో మన అనుదిన జీవితాలకు సంబంధించినదిగా ఉంది. దీనిని అనువదించుట కష్టము కాదు. బైబిల్ సూటైన, సులువైన వివరణ అను విషయం దానిని నమ్ముటకు మరొక కారణముగా ఉంది.

ఈ వాస్తవిక కథను చూడండి.

“నా కుమారుడు ఒక రోజు నాకు కాల్ చేశాడు. అతడు వేరొక దేశములో ఉన్నాడు, ఒక పెద్ద రహదారి మధ్యలో, ఒక కారు దుర్ఘటనలో. అతని కారును వేరొక కారు ఢీకొనగా, అది 180 డిగ్రీలు తిరిగి, రహదారి మధ్యలో తప్పు దిశలో పడింది.

“నాన్న, నేను బాగానే ఉన్నాను. కాని ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి?” అని అతడు అన్నాడు.

అతడు ఇబ్బందిలో ఉన్నాడు. అతనికి సహాయం కావాలి. సరే, అతనికి ఒక పద్యభాగ సందేశమును పంపుటకు ఇది మంచి సమయం అంటారా? నేను వల్లించిన ఒక పద్యం? కాదు.

‘జాన్, నీవు ఇలా చెయ్యాలి. నీవు లోతైన ఇబ్బందిలో ఉన్నావు కాబట్టి, దీనిలో నుండి ఇలా బయటపడాలి.” అని సూటిగా చెప్పవలసిన సమయం ఇది. మరియు బైబిల్ యొక్క ముఖ్యభాగం ఇదే. మానవత్వము ఇబ్బందిలో ఉండి, నరకమునకు ప్రయాణిస్తుంది. ఎందుకంటే అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరియు మనకు ఒక సులువైన రక్షణ సందేశం కావాలి. మనం ఎలా క్షమించబడగలమో, ఇప్పుడు మొదలై నిత్యత్వము వరకు నిలుచు దేవునితో వ్యక్తిగత అనుబంధంలోనికి ఎలా రాగలమో బైబిల్ చెబుతుంది. అది మన జీవితములను మార్చు సందేశం.

2. యేసు మరియు ఇస్లాం: ఒక మతం మరొక మతము యొక్క స్థానమును తీసుకుంటుందని దేవుడు చెప్పాడా?

మనం యూదా మతముతో ఆరంభించి, క్రైస్తవ్యములోనికి మార్చబడి, తరువాత ఇస్లాం లోనికి మారుట దేవుని ఉద్దేశమా?

కాదు. దేవుడు స్థిరుడుగా ఉన్నాడు. ఒక మతమును స్థాపించుటలో అతడు ఎన్నడు ఆశక్తిని చూపలేదు.

అబ్రాహాముతో ఆరంభమై, ఆయనతో అనుబంధములో ఉండుటకు దేవుడు తన్ను తాను మనకు స్పష్టముగా బయలుపరచుకున్నాడు. మనలను సృష్టించుటలో దేవుని యొక్క అంతిమ ఉద్దేశం అనుబంధం, మతం కాదు.

ఆరంభములో ఆదాము హవ్వలను చూడండి. వారు దేవునితో సూటైన అనుబంధం కలిగియుండెను, మరియు వారి అవసరతలన్నీ తీర్చబడెను.

సాతాను ఆదాము హవ్వలకు సర్పము రూపములో ప్రత్యక్షమై వారిని శోధించింది. దురదృష్టవశాత్తు దేవుడు వారికి చెప్పిన దానిని నిరాకరించుటకు మరియు సాతాను మాటలు నమ్ముటకు వారు నిర్ణయించుకున్నారు. అందువలన, ఆదాము హవ్వలు దేవునితో అనుబంధం నుండి తొలగిపోయారు.

అయితే వెంటనే దేవుడు సాతానుతో ఏమి చెప్పాడో మీకు తెలుసా? స్త్రీ యొక్క సంతతి సాతానుకు శత్రువుగా ఉంటాడని దేవుడు చెప్పాడు. స్త్రీ సంతానము యొక్క మడిమెను కొట్టుట ద్వారా కొంత తాత్కాలిక విజయం సాతానుకు ఉంటుందని దేవుడు చెప్పాడు. అయితే సాతాను తలను చితకద్రొక్కుట ద్వారా ఆ బిడ్డ ఆఖరి దెబ్బ కొడతాడని చెప్పాడు.

ఇది చూడండి:

“అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్నుతిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.”7

స్త్రీ సంతానము యొక్క మడిమెను కొట్టుట ద్వారా సాతాను తాత్కాలిక విజయమును పొందుతాడు.

చరిత్ర అంతటిలో, స్త్రీ పురుషుల కలయిక ద్వారా గాక, స్త్రీ ద్వారా మాత్రమే జన్మించిన పురుషుడు ఎవరు? మరియ కుమారుడైన యేసు, అవునా?

స్త్రీ యొక్క ఈ సంతతి యొక్క మడిమెను సాతాను కొడతాడు. కాని ఆ సంతతి సాతాను యొక్క తలను చితకద్రొక్కుతాడు. మరియు సర్పమును చంపుటకు ఏకైక మార్గము దాని తలను చితకద్రొక్కుట.

దీని అర్థం ఏమిటి? దీనికి ఇదే ఒక వివరణ.

సిలువపై యేసు యొక్క చేతులు మరియు కళ్ళు మేకులతో కొట్టబడినప్పుడు, సాతాను యేసును కొట్టాడు. అయితే యేసు సాతానును చావు దెబ్బ కొట్టాడు. సిలువలో, యేసు సాతానును జయించాడు. సర్వమానవాళి పాపముల కొరకు యేసు వెల చెల్లించి, అందరికి క్షమాపణ ఇచ్చి దేవునితో అనుబంధములోనికి వచ్చుటకు మార్గము సిద్ధపరచాడు.

ప్రవక్తయైన యెషయా ఈ సంతానమును గూర్చి వ్రాసాడు:

“మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించినవాడుగాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.”8

యెషయా ప్రవక్త ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? అది చాలా స్పష్టంగా ఉంది. అతడు యేసును గూర్చి మాట్లాడుతున్నాడు. మరియు ఇది ఎప్పుడు వ్రాయబడినది? యేసు క్రీస్తుకు 600 సంవత్సరాల క్రితం.

యెషయాలో మనం చదువునట్లు ఆరంభము నుండి, కొన్ని వెల సంవత్సరాలలో, యేసు వచ్చి మరణిస్తాడని దేవుడు ఎల్లప్పుడు చెప్పెను. ఆఖరు క్షణంలో దేవుడు మనస్సు మార్చుకుంటే మీరు దేవుని గూర్చి ఏమనుకుంటారు? యేసును గూర్చి కొన్ని వెల సంవత్సరాలుగా చేస్తున్న వాగ్దానములను కాదని దేవుడు మనస్సు మార్చుకొని మన కొరకు మరణించుటకు యేసును పంపని యెడల ఏమి జరిగేది? దేవుడు తన మనస్సును మార్చుకోడు.

3. యేసు మరియు ఇస్లాం: దేవునికి కుమారుడున్నాడని చెప్పుట దైవదూషణ కాదా?

దేవుడు ఆత్మైయున్నాడు. మరియు యేసు ఆత్మీయంగానే దేవుని కుమారుడు, శారీరకంగా కాదు.

“నీవు కేదారు పుత్రుడవు” అని ఎవరైనా చెబితే, అతడు లెబానోనుకు చెందినవాడని అర్థము. లేక ఐగుప్తు నుండి అయితే, “నీవు నైలు కుమారుడవు.” అలాగే యేసును దేవుని కుమారుడని చెప్పుట అంటే యేసు దేవుని యొద్ద నుండి అని అర్థము. అది ఒక బిరుదు లాంటిది. దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు, దేవదూత అన్నది గదా, “పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” అది ఒక బిరుదు. దేవుడు ఒక స్త్రీతో లైంగిక సంబంధము కలిగియున్నాడని క్రైస్తవులు నమ్మరు.

యెషయా అన్నాడు, “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.9

అతడు మరియ ద్వారా మానవుడైన దేవుడు. అతడు కన్య మరియ గర్భములో జన్మించిన దేవుడు మరియు కుమారుడు.

యేసు కన్య మరియ గర్భమునుండి జన్మించుటకు దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడని మీరనుకుంటున్నారు?

స్త్రీ ద్వారా జన్మించుట, మరియు స్త్రీ పురుషుల ద్వారా జన్మించక పోవుట అనగా, ఆయన ఆదాము హవ్వల పాపపు స్వభావమును తీసుకొనలేదు. ఆదాము హవ్వలు పాపములో పడినప్పుడు, ఆ పాపపు స్వభావమును ఒక తరము నుండి మరొక తరమునకు, వారి పిల్లల ద్వారా మన వరకు అందించారు.

మనమంతా పాపులుగా జన్మించాము. మనమంతా దేవుని చిత్తానుసారంగా గాక మన ఆలోచన ప్రకారం పనులు చేయువారిగా జన్మించాము. మనమంతా పాపము చేస్తాము. అందుకనే, “పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను,” అని ప్రవక్తయైన దావీదు విలపించెను. మనమంతా పాపముతో జన్మించితిమి. మనమంతా పాపుల వలె జీవించుచున్నాము మరియు మనకు విమోచకుడు కావాలి.

కాని యేసు మనలను విమోచించుటకు, ఆయనకు వేరే స్వభావం అవసరమైయ్యింది. ఆయన దేవుని ఆత్మయైన పరిశుద్ధాత్మ నుండి, ఎలాంటి పాపము లేనివాడిగా ఉండవలసియుండెను. “ఆయనలో ఏ కపటము కనబడలేదు,” అని యెషయా చెప్పాడు. ఆయనలో ఏ పాపము లేదు.

లేఖనములో, తనను తాను మోషేకు బయలుపరచుటకు దేవుడు మండుచున్న పొద రూపమును తీసుకొనెను. అబ్రాహాముతో మాట్లాడుటకు పరలోక స్వరము యొక్క రూపమును తీసుకున్నాడు. తన్ను తాను మనకు బయలుపరచుకొనుటకు దేవుడు నరుని రూపం దాల్చలేదని ఎవరు చెప్పగలరు?

4. యేసు మరియు ఇస్లాం: యేసు సిలువపై మరణించాడా?

దేవుడు అబ్రాహామును ఎలా పరీక్షించెను? తన కుమారుని బలిపీఠము మీద పెట్టమని ఆయన అబ్రాహామును అడిగెను. వారు పర్వతము మీదికి వెళ్లుచుండగా కుమారుడు అడిగాడు కదా, “అర్పణ ఏది?” “దేవుడే చూచుకుంటాడు. బలికి అర్పణను ఆయనే ఇస్తాడని” అబ్రాహాము చెప్పాడు. మరియు దేవుడు నిజముగా గొర్రె పిల్లను ఇచ్చాడు, మరియు అబ్రాహాము దానిని బలి అర్పించాడు.

దేవుడు మనకిచ్చు స్థిరమైన సందేశమును చూడండి.

దేవుడు రక్షిస్తాడు, ఒక గొర్రె పిల్ల ద్వారా ఆయన అబ్రాహాము కుమారుని కాపడతాడు.

తరువాత నిర్గమకాండములో, మరొకసారి గొర్రె పిల్ల యొక్క ప్రాముఖ్యతను చూస్తాము. నిర్గమకాండములో, తాను ఐగుప్తీయులను కొట్టబోతున్నాడని దేవుడు ఐగుప్తులో తన ప్రజలను హెచ్చరించాడు. దేవుని నమ్ము వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును తమ గుమ్మము కమ్మిలపై పూసిన యెడల, వారిని మరణము నుండి కాపాడుతూ, మరణ దూత వారిని దాటిపోవునట్లు దేవుడు చేస్తాడు. ఒక గొర్రె పిల్ల ద్వారా ఒక విశ్వాసుల దేశము రక్షించబడెను.

తరువాత లేవీయకాండములో కూడ ఒక గొర్రె పిల్లను మనం చూస్తాం. ప్రతి సంవత్సరం యాజకుడు ఒక గొర్రె పిల్లను తీసుకొని దానిని పట్టణము వెలుపలకు తీసుకొనివెళ్లి దేవుని నమ్మిన ప్రజల యొక్క పాపము కొరకు దానిని వధించవలసియుంది. ప్రతి సంవత్సరం, ఒక ప్రజల గుంపు ఒక గొర్రె పిల్ల ద్వారా రక్షించబడెను.

తరువాత యేసును గూర్చి ఈ విధంగా చెబుతూ బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలను సంబోధించుట మనం వింటాము: “ఇదిగో లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల.”10 లోకమంతటిని రక్షించు, ఆయనను నమ్మినవారందరి కొరకైన ఒకే గొర్రె పిల్ల.

అబ్రాహాము దేవుని స్వరం వినకపోతే లేక దేవుడు తనతో మాట్లాడుతున్నాడని నమ్మియుండకపోతే ఏమి జరిగియుండేది? అవును, అతని కుమారుడు చంపబడెవాడు!

ప్రజలు దేవుని మాటను నమ్మక గుమ్మము కమ్మిలకు గొర్రెపిల్ల రక్తము పూయకుండా ఉంటె ఏమి జరిగేది?

కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న. కొన్ని 2000 సంవత్సరాల క్రితం దేవుని గొర్రెపిల్లయైన యేసు సిలువలో వ్రేలాడి, నీ కొరకు తన ప్రాణమునిచ్చాడు. “దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులుగా ఉండగా క్రీస్తు మన నిమిత్తము చనిపోయెను,”11 అని స్పష్టముగా చెప్పబడెను.

“కాదు, వారు ఆయనను సిలువ వేయలేదు. ఆయన మరణించలేదు,” అని నేవు అంటే ఏమి జరుగుతుంది. దేవుని గొర్రెపిల్ల నీ పాపములకు, సర్వలోకములోని ప్రజలందరి పాపములకు వెల చెల్లించుటకు అర్పించబడెను. ఆయన చంపబడలేదు, దేవుని గొర్రెపిల్ల నా పాపము కొరకు, నా క్షమాపణ కొరకు మరణించలేదు అని నీవు చెప్పినయెడల ఏమిటి?

5. యేసు మరియు ఇస్లాం: యేసు సిలువ మీద మరణించియుంటే, మరియు మూడు రోజుల పాటు పాతిపెట్టియుంటే, దేవుడు మూడు రోజుల పాటు మరణించియున్నాడా?

గొప్ప ప్రశ్న. ఒక ఉదాహరణ సహాయపడుతుంది.

మన దగ్గర ఒక పూలకుండీ ఉందనుకోండి. దానిలో పువ్వులు లేవు, దానిలో నీరు లేదు. దానిలో కేవలం గాలి మాత్రమే ఉంది. కుండీ బయట ఉన్న గాలికి మరియు కుండీ లోపల ఉన్న గాలికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? కుండీలో ఉన్న గాలికి ఆకారం ఉంది, అవునా? వాస్తవానికి ఒకే గాలి, కాని కుండీ లోపల ఉన్న గాలికి ఆకారం ఉంది.

ఇప్పుడు ఆ కుండీని తీసుకొని గోడకు కొడితే లోపల ఉన్న గాలికి ఏమి జరుగుతుంది? అది మరణిస్తుందా? లేదు, గాలి చావలేదు. కుండీ వెయ్య ముక్కలు అవ్వొచ్చు, కాని గాలికి మాత్రం ఏమి జరగదు, ఆకారమును కోల్పోవుట తప్ప.

యేసు సిలువలో మరణించినప్పుడు, ఆయన శరీరం మరణించింది, కాని యేసు ఆత్మ, దేవుని ఆత్మ ఎన్నడు మరణించదు. యేసులో దేవుడు మానవ రూపం ధరించాడు. ఆయన మానవ రూపం ధరించాడు గాని, యేసు ఎన్నడు మానవుడు మాత్రమే కాడు.

సిలువలో, యేసు మన పాపములకు వెల చెల్లించి, ఆయనకు మనకు మధ్య నిలిచియున్న ఆటంకమును తొలగించాడు. ఆయన మరణము వలన, దేవునితో మనం సమాధానం కలిగియుండవచ్చు. మనం శిక్షకు పాత్రులమైనప్పటికీ, మన కొరకు శ్రమపడిన దేవుని గొర్రెపిల్లయైన యేసులో దేవుని యొక్క తీర్పు పూర్తయింది. మరియు దానిలో దేవుని ప్రేమ పూర్తిగా వ్యక్తపరచబడినది మరియు యేసు మన కొరకు తన ప్రాణమును స్వయెచ్చతో ధారపోశాడు.

“అది సరి కాదు,” అని మీరు అనవచ్చు. మరియు మీరు సరిగానే చెబుతున్నారు. యేసు మన కొరకు మరణించుటకు మనం యోగ్యులము కాము. కాని మన కొరకు ఇది దేవుని పరిష్కారం. దానిని ఎలా చెయ్యాలో దేవునికి మనం చెప్పగలమా?

మన పాపముల కొరకు మనం మరణించవలసిన అవసరం లేకుండా, మన మరణము యొక్క వెలను యేసు చెల్లించాడు. ఆయన ప్రేమను తెలుసుకొనుటకు, మరియు నిత్య జీవమును పొందుటకు ఆయనతో మనం అనుబంధం కలిగియుండాలని ఆయన కోరుచున్నాడు.

మరొక కథ. ఒక నిజమైన కథ, యేసు మన కొరకు ఏమి చేశాడో అర్థం చేసుకొనుటలో మనకు సహాయపడుటకు.

లంచములు తీసుకోని ఒక నీతిగల న్యాయాధిపతి ఉండేవాడు. అతడు నీతిగలవాడు. యదార్థవంతుడు. ఒక స్త్రీ పట్టుబడి ఆయన ముందుకు తేబడినది. అయితే యావజీవశిక్ష లేక ఆమె దగ్గర లేనంత గొప్ప మొత్తంలో ధనము చెల్లించుట అనేది ఆమెకు పడవలసిన శిక్ష.

“నీవు దోషివా కాదా?” అని న్యాయాధిపతి అడిగాడు.

ఆమె అన్నది కదా, “యువర్ హానర్, నేను శిక్షను భరించలేను. నేను డబ్బు కట్టలేను. నన్ను కరుణించండి.”

న్యాయాధిపతి అన్నాడు గదా, “‘నీవు దోషివా కాదా? నీవు ఒప్పుకుంటున్నావా?’ అని అడుగుతున్నాను”

చివరికి ఆ యవ్వనురాలు అన్నది, “యువర్ హానర్, అవును, నేను దోషినే.”

“అయితే నువ్వు వెల చెల్లించు. యావజీవ శిక్ష అయినా లేక డబ్బు అయిన” అని అయన అన్నాడు. మరియు ఆ కేసును మూసివేశాడు.

ఆమె అరవడం ఏడవడం ఆరంభించింది, మరియు వారు ఆమెను కోర్టు రూములో నుండి జైలులోనికి ఈడ్చుకువెళ్లారు. ఆ న్యాయాధిపతి తన వస్త్రములను తీసివేసి, కోర్టు నుండి బయటకు వెళ్లాడు. తరువాత అతడు కోశాధికారి దగ్గరకు వెళ్లాడు. అక్కడ తన దగ్గర ఉన్న మొత్తము అంతా చెల్లించి ఆ అమ్మాయి కొరకు క్రయధనమును చెల్లించాడు. ఎందుకు? ఎందుకంటే అతడు ఆ అమ్మాయిని అమితంగా ప్రేమించాడు. ఆమె అతని కుమార్తె. మరియు తన దగ్గర ఉన్నదంతా వెచ్చించి, తన కుమార్తెను విమోచించాడు.

న్యాయాధిపతి వస్త్రములు తీసిన వెంటనే, ఇతర మనుషుల వలె అయిపోతాడు. మరియు ఖచ్చితంగా అదే యేసు చేశాడు. ఆయన పరలోకమును విడచి, మహిమ వస్త్రమును తీసివేసి, మనుష్య రూపమును ధరించాడు. మన పాపములు మనలను శిక్షించకుండా మరియు దేవుని నుండి నిత్యత్వములో ఆయన మనలను వేరుపరచకుండా మన కొరకు ఆయన మరణించాడు.

యేసు వచ్చి లోక పాపముల కొరకు మరణిస్తాడని ప్రవక్తలందరు చెప్పిరి. నిత్య జీవమును పొందుటకు యేసు మాత్రమే మానవులకు నిరీక్షణ.

ఆరంభములో, ఆదాము హవ్వల కాలంలో, స్త్రీ యొక్క సంతతి సాతాను యొక్క తలను చితక ద్రొక్కునని, మానవ జాతి విమోచించబడునని దేవుడు సాతానుతో చెప్పెను. యేసు మరణం మరియు పునరుత్ధానం సాతాను యొక్క శక్తిని అధిగమించెను. యేసు పాపమును, మరణమును, మరియు దేవుని యొద్ద నుండి మన ఎడబాటును జయించెను...సాతానును చావుదెబ్బ కొట్టుట ద్వారా.

6. యేసు మరియు ఇస్లాం: యేసును ఒక ప్రవక్తగా ఎందుకు చూడకూడదు?

ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. నిజమైన దేవుని గూర్చి మనకు తెలిసినవి ఇవే:

దేవుడు నిత్యత్వం గలవాడు – ఆయన ఎల్లప్పుడు ఉనికి కలిగియున్నాడు. ఇప్పుడు ఉన్నాడు మరియు ఎల్లప్పుడు ఉంటాడు.
దేవుడు పరిశుద్ధుడు – ఏ తప్పు లేకుండా, పరిపూర్ణుడు.
దేవుడు సత్యము – ఆయన వాక్యము ఎల్లప్పుడు నిలుస్తుంది, మార్పులేనిది, నమ్మదగినది.
దేవుడు ఉన్నవాడు – అన్ని చోట్ల, అన్ని వేళల.
దేవుడు శక్తివంతుడు – ఆయన శక్తికి పరిమితులు లేవు.
దేవుడు సర్వజ్ఞాని – అన్ని విషయములను గూర్చి అన్ని వేళల ఆయనకు పూర్తి జ్ఞానము కలదు.
దేవుడు సృష్టికర్త – ఆయన సృష్టించనిది ఏదియు లేదు.

ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. మరియు పైనున్నవన్ని ఆయనకు వర్తిస్తాయి. ఇది నిజమైన దేవుడని లేఖనములు మనకు చెబుతాయి కాబట్టి, ఇది మనకు తెలుసు. ఆయనను గూర్చి ఈ విషయములను బయలుపరచుటకు, మానవజాతికి తన్ను తాను ప్రత్యక్షపరచుటకు ఆయన ఎన్నుకున్నాడు.

యేసుకు కూడ ఖచ్చితంగా ఇవే గుణములు ఉన్నాయని లేఖనము చెబుతుంది. అలానే దేవుని ఆత్మకు కూడ. ఉదాహరణకు, నిత్యత్వమును తీసుకుందాం.

“ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు”12 అని యేసును గూర్చి లేఖనము చెబుతుంది.

మరియు, “ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.”13

కాని, ఒకే దేవుడు ఉన్నట్లైతే, యేసు దేవుడు ఎలా కాగలడు?

భూమి మీద, మనం ముక్కోణ లోకంలో జీవిస్తున్నాము. ప్రతి వ్యక్తికి ఎత్తు, వెడల్పు, లోతు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఒక దానిని ఒకే విధంగా చూడవచ్చు. వారికి ఒకే ఆసక్తి, ఒకే వృత్తి ఉండవచ్చు. కాని ఒక వ్యక్తి సంపూర్ణంగా ఇతర వ్యక్తి వలె ఉండలేడు. వారు వేర్వేరు వ్యక్తిత్వాలు.

అయితే, దేవుడు ఈ ముక్కోణ లోకము యొక్క పరిమితులు లేకుండా జీవిస్తున్నాడు. ఆయన ఆత్మ. మరియు అయన మనకంటే లెక్కలేనంత క్లిష్టమైనవాడు. అందుకనే కుమారుడైన యేసు తండ్రి కంటె వేరు. అదే సమయంలో ఒకటి కూడ.

కుమారుడైన దేవుడు, తండ్రియైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్ స్పష్టముగా మాట్లాడుతుంది. అయితే ఒకే దేవుడు ఉన్నాడని కూడ అది స్పష్టముగా చెబుతుంది. మనం గణితం ఉపయోగించవలసియుంటే, అది 1+1+1=3 కాదు. అది 1×1×1=1. దేవుడు ఒక్కడే.

“కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును”14 అని యెషయా చెప్పినప్పుడు, ఇమ్మానుయేలు అను మాటకు అర్థం “దేవుడు మనకు తోడు.”

ఆయనను యెరుగుట దేవుని యెరుగుట అని యేసు చెప్పాడు. ఆయనను చూచుట దేవుని చూచుటతో సమానం. ఆయనను నమ్ముట దేవుని నమ్ముటతో సమానం.

యేసు జీవితమును గూర్చి మరియు అయన ఈ కథనములను ఎలా నిరూపించెనో తెలుసుకొనుటకు, “గుడ్డి నమ్మకాన్ని మించినది” అనే వ్యాసమును చదవండి.

అయితే, దేవుని గూర్చి మీరు తెలుసుకొనవలసిన మరొక విషయం ఉంది. ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు మరియు మీ శ్రద్ధ ఆయనది.

యేసు చెబుతున్నాడు, “తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.”15

యేసు మనలను ఆహ్వానించుచున్నాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”16

దేవుని కొరకు సరిపోయేది చేయుటకు మన సంఘర్షణల మధ్యలో...యేసు మనకు ఒక నూతన స్వాతంత్ర్యమును అందించుచున్నాడు. ఆయన ప్రేమను మనం అనుభవిస్తాము, మరియు ఆయనను సంతోషపరచుటకు మన యొద్ద నూతన ప్రోత్సాహం ఉంది. భయము వలన కాదు, కాని ఆయనను ఎరుగుటలో ఉన్న ఆనందము ద్వారా.

యేసు అనుచరులలో ఒకడైన పౌలు తన అనుభవాన్ని ఈ విధంగా వ్యక్తపరిచాడు:

“మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.”17

యేసు మీకు ఏమి అందించుచున్నాడో మీరు తెలుసుకోవాలని అనుకుంటే, “గుడ్డి నమ్మకాన్ని మించినది” అను వ్యాసమును చూడండి.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) మత్తయి 5:18 (2) మత్తయి 24:35 (3) 2 తిమోతి 3:16 (4) యెషయా 40:8 (5) 2 కొరింథీ. 13:1 (6) 1 యోహాను 1:1 (7) ఆది. 3:14,15 (8) యెషయా 53:1-6 (9) యెషయా 9:6 (10) యోహాను 1:29 (11) రోమా. 5:8 (12) యోహాను 1:2,3 (13) కొలొస్సి. 1:15,16 (14) యెషయా 7:14 (15) యోహాను 15:9-11 (16) మత్తయి 11:28-30 (17) రోమా. 8:38,39

ఇతరులతో పంచుకోండ  

TOP