జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

దేవునితో సంబంధము కలుపుకొనుట

ప్రపంచములోని ప్రధాన మతములు మరియు దేవుని గూర్చి వారి నమ్మకాలు. హైందవ మతము, బౌద్ధ మతము, ఇస్లాం, క్రైస్తవ్యము, మరియు నూతన యుగం...

మనమంతా జీవితమును విజయవంతంగా, మనం సరిగ్గా జీవించామనే ఆలోచనతో ముగించాలని ఆశపడతాము. ప్రపంచములోని ప్రధాన మతాల విషయం ఏమిటి? మన జీవితాలకు గొప్ప లోతు మరియు దిశను ఇచ్చు విషయములు దానిలో ఏమైనా ఉన్నాయా?

ఈ క్రిందవి ప్రపంచములోని ప్రధాన మతములను పరిశీలిస్తుంది...హైందవ మతం, నూతన యుగం, బౌద్ధ మతం, ఇస్లాం, మరియు క్రైస్తవ్యం.* ప్రతి దాని యొక్క సంక్షిప్త వివరణ, దేవుని గూర్చి వారి ఆలోచన, ఆ మతం నుండి ఒక వ్యక్తి ఏమి పొందుకొనగలడో దీనిలో ఉంది. చివరిలో యేసు బోధలు మిగిలిన మతముల కంటే భిన్నంగా ఎలా ఉన్నాయో వివరించబడింది.

*ప్రతి మతములోను వేర్వేరు నమ్మకములు కలిగిన పలు తెగలు ఉన్నాయి. ఇక్కడ ఇవ్వబడిన వివరణ ప్రతి మతం యొక్క ముఖ్యమైన నమ్మకాలపై దృష్టిపెడుతుంది. యూదా మతము వంటి ఇతర ప్రధాన మతాలను కూడా చర్చించవచ్చుగాని, సంక్షిప్త కొరకు వీటిని ఎన్నుకొన్నాము.

హైందవ మతము మరియు దాని నమ్మకాలు

అనేకమంది హైందవులు నిత్య ఐక్యుడైన ఒక వ్యక్తిని (బ్రహ్మ) అనేక దేవి దేవతల రూపంలో ఆరాధిస్తారు. దేవి దేవతల యొక్క పలు వ్యక్తీకరణలు విగ్రహములు, దేవాలయములు, గురువులు, నదులు, జంతువులు మొదలగువాటి ద్వారా అవతారమెత్తుతాయి.

వారి ప్రస్తుత జీవితంలోని స్థితి గత జీవితములో చేసిన క్రియల యొక్క పరిణామమని హైందవులు నమ్ముతారు. కాబట్టి ఈ జీవితంలో ఉన్న బాధ మరియు దుష్టత్వమును గూర్చి ఒక వివరణ ఇస్తుంది. ఒక వ్యక్తి యొక్క స్వభావం గత జన్మలో దుష్టమైనదిగా ఉంటే, వారు ఈ జీవితంలో గొప్ప సమస్యలను ఎదుర్కొంటారు. గత జన్మలో వారు చేసిన దుష్క్రియల వలన బాధ, రోగం, పేదరికం లేక వరదల వంటి వైపరిత్యాలు వారి జీవితాలలో జరుగుతాయి.

కర్మ నియమము నుండి విమోచన పొందుట హైందవుని యొక్క గురి...తరచు పునర్జన్మల నుండి విమోచన పొందుటకు. ఒక రోజు పునర్జన్మ చక్రం నుండి విమోచన పొంది విశ్రాంతిపొందు ఆత్మ మాత్రమే ముఖ్యమైనది.

ఆత్మీయ పరిపూర్ణత పొందుటకు మార్గమును ఎన్నుకొనుటకు హైందవ మతం ఒక వ్యక్తికి స్వతంత్రమును ఇస్తుంది. ఈ కర్మ చక్రమును నిలుపుటకు మూడు మార్గములు ఉన్నాయి: 1. హైందవ దేవుళ్ళు లేక దేవతలలో ఒకరి పట్ల పూర్ణ భక్తి కలిగియుండాలి; 2. బ్రహ్మ యొక్క ధ్యానం ద్వారా జ్ఞానములో ఎదుగుట...జీవిత పరిస్థితులు నిజమైనవి కావని గ్రహించుట, వ్యక్తిగతత్వం మాయ అని మరియు బ్రహ్మ మాత్రమే నిజమని భావించుట; 3. పలు మత పరంపరలు మరియు సంస్కరణల పట్ల సమర్పణ కలిగియుండుట.

నూతన యుగం మరియు దాని నమ్మకాలు

నూతన యుగం ఒక వ్యక్తి యొక్క సొంత శక్తి లేక దైవత్వం యొక్క అభివృద్ధిని తెలియజేస్తుంది. దేవుని గూర్చి మాట్లాడుతున్నప్పుడు, నూతన యుగమును అనుసరించువాడు లోకమును సృష్టించిన పైనున్న వ్యక్తిగత దేవుని సంబోధించుట లేదు గాని, వారిలో ఉన్న ఉన్నత వివేకమును సంబోధిస్తారు. నూతన యుగంలో ఉన్న వ్యక్తి తనను తాను దేవునిగాను, ప్రపంచముగాను, లోకముగాను చూస్తారు. వాస్తవానికి, ఒక వ్యక్తి చూచు, విను, భావించు లేక ఊహించు ప్రతిది దైవమని భావిస్తారు.

అత్యంత పరిశీలనాత్మకమైనదై, నూతన యుగం పురాతన ఆత్మీయ పరంపరల కలయికగా అందిస్తుంది. ఆత్మీయత అంతటికి మూలముగా భూమి చూడబడుతుంది, మరియు దానికి సొంత జ్ఞానం, భవములు మరియు దైవత్వం ఉంది. కాని అన్నిటిని మించినది స్వయం. స్వయం అన్నిటికి కర్త, శాసకుడు మరియు దేవుడు. ఒక వ్యక్తి నిర్థారించుదాని వెలుపల సత్యము లేదు.

శ్వాస మీద ధ్యాస, మంత్రాలపన, డప్పులు, ధ్యానం వంటి తూర్పు మర్మాలు మరియు ఆత్మీయతను, అదిభౌతిక మరియు భౌతిక పద్ధతులను నూతన యుగం బోధిస్తుంది...మార్పుచెందు మనసాక్షి మరియు సొంత దైవత్వమును అభివృద్ధి చేయుటకు.

ఒక వ్యక్తి అనుభవించు అభావర్థక అనుభవాలన్నీ (వైఫల్యాలు, దుఃఖం, కోపం, స్వార్థం, గాయం) ఒక మాయగా పరిగణిస్తారు. వారి జీవితాలపై వారికి సంపూర్ణ అధికారం ఉందని నమ్ముతూ, వారి జీవితాలలో తప్పు, బాధ అనేది లేదని భావిస్తారు. చివరికి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎంతగా అభివృద్ధి చెందుతాడంటే ఒక బాహ్య వాస్తవికత ఏది లేకుండా పోతుంది. దేవుడైన ప్రతి వ్యక్తి తన సొంత దైవమును రూపిస్తాడు.

బౌద్ధ మతం మరియు దాని నమ్మకాలు

బౌద్ధ మతం వారు ఏ దేవుడను లేక దేవతలను ఆరాధించరు. బౌద్ధ మతస్థులు బుద్ధుని ఆరాధిస్తారని బౌద్ధ మతం వెలుపల ఉన్నవారు చాలా సార్లు అనుకొంటు ఉంటారు. కాని, బుద్ధుడు (సిద్ధార్థ గౌతముడు) తాను దేవుడని ఎన్నడు చెప్పలేదుగాని, బౌద్ధ మతం వారు స్వయంగా పొందాలని ఆశించు ఆత్మీయ జ్ఞానోదయమును, మరియు దానితో, జీవ మరణ చక్రం నుండి ముక్తిని ఆయన పొందాడని నమ్ముతారు. ఒక వ్యక్తికి లెక్కలేనన్ని పునర్జన్మలు ఉన్నాయని, మరియు ప్రతి దానిలో అనివార్య దుఖం ఉందని అనేక మంది బౌద్ధమతం వారు నమ్ముతారు. ఈ పునర్జన్మలను ముగించాలని ఒక బౌద్ధ మతస్థుడు వెదకుతాడు. ఒక వ్యక్తి యొక్క తాపత్రయం, విముఖత, మరియు మాయ ఈ పునర్జన్మలను కలిగిస్తుందని వారు నమ్ముతారు. కాబట్టి, ఒకని హృదయమును శుద్ధిచేసుకొని శరీరాశల నుండి దూరమగుట బౌద్ధ మతస్థుని యొక్క గురి.

బౌద్ధ మతం వారు ఒక మత నియమాల పట్టికను మరియు గొప్ప సమర్పణ కలిగిన ధ్యానమును అనుసరిస్తారు. ఒక బౌద్ధ మతస్థుడు ధ్యానం చేసినప్పుడు అది ప్రార్థనతో సమానం కాదుగాని, అది స్వయం-క్రమశిక్షణ. ధ్యానమును అభ్యసించుట ద్వారా ఒక వ్యక్తి నిర్వానాను చేరుకోగలడు—ఆశ అను అగ్నిని “ఆర్పివేయుట.”

బౌద్ధ మతం చాలా ప్రధాన మతముల అధించువాటినే అందిస్తుంది: ఒక వ్యక్తి జీవించదగిన క్రమశిక్షణ, విలువలు, మరియు దిశలను అందిస్తుంది.

ఇస్లాం మరియు దాని నమ్మకాలు

ఏకైక శక్తిగల దేవుడు ఉన్నాడని, ఆయన పేరు అల్లాహ్ అని, ఆయన మానవుల కంటే అంత్యంత గొప్పవాడని వారికి మించినవాడని ముస్లింలు నమ్ముతారు. అల్లాహ్ సృష్టికర్త మరియు మంచి చెడులన్నిటికి మూలం అని వారు నమ్ముతారు. జరుగు ప్రతిది అల్లాహ్ యొక్క చిత్తం. ఆయన బలమైన కఠిన న్యాయవాది, మరియు తన అనుచరుల యొక్క మంచి పనులు మరియు మత భక్తి ఆధారంగా వారు ఆయన కరుణను పొందుతారు. అల్లాహ్ తో అనుచరుల అనుబంధం ఒక పనివాడు దేవునితో కలిగియున్న అనుబంధంతో సమానం.

ముస్లింలు చాలా మంది ప్రవక్తలను గౌరవించినప్పటికీ, మొహమ్మదు ప్రవక్తలందరిలో ఆఖరివాడు మరియు ఆయన మాటలు మరియు జీవన శైలి ఆ వ్యక్తి యొక్క అధికారము. ముస్లింగా ఉండుటకు ఒక వ్యక్తి ఐదు మత బాధ్యతలను నెరవేర్చాలి: 1. అల్లాహ్ మరియు మొహమ్మదును గూర్చిన ఒక విశ్వాస ప్రమాణమును చదవాలి; 2. రోజుకు ఐదు సార్లు అరబిక్ భాషలో ప్రార్థనలు చేయాలి; 3. అవసరంలో ఉన్నవారికి ఇవ్వాలి; 4. సంవత్సరానికి ఒక సారి సూర్యోదయం నుండి సుర్యాస్తమయం వరకు ఆహరం, పానీయం, రతి మరియు దూమ్రపానం నుండి ఉపవాసం చెయ్యాలి; 5. జీవితకాలంలో ఒక సారి మక్కాలో ఆరాధన చేయుటకు వెళ్లాలి. మరణించినప్పుడు—ఈ బాధ్యతలు చేపట్టిన ఆధారంగా—ఒక ముస్లిం పరదైశుకు వెళ్లాలని ఆశిస్తాడు. లేనియెడల, వారు నరకంలో నిత్యత్వం గడుపుతారు.

చాలా మందికి, మతం మరియు దైవమును గూర్చి వారు కలిగియున్న అభిప్రాయాలను ఇస్లాం తీరుస్తుంది. సత్క్రియలు మరియు క్రమశిక్షణ గల మత ఆచారముల ద్వారా ఆరాధించబడు ఏకైక శక్తిగల దేవుడు ఉన్నాడని ఇస్లాం బోధిస్తుంది. వారి మత భక్తి ఆధారంగా మరణం తరువాత ఒక వ్యక్తికి బహుమానం లేక శిక్ష కలుగుతుంది. అల్లాహ్ కొరకు ప్రాణం పెట్టుట వలన ఒకడు నిశ్చయంగా పరలోకానికి వెళ్తాడని ముస్లింల నమ్మకం.

క్రైస్తవ్యం మరియు దాని నమ్మకాలు

క్రైస్తవులు తనను తాను బయలుపరచుకున్న ప్రేమగల దేవుని, మరియు ఈ జీవితంలో వ్యక్తిగతంగా తెలుసుకొనదగిన దేవుని నమ్ముతారు. యేసు క్రీస్తులో, ఒక వ్యక్తి యొక్క దృష్టి మత పరంపరలపైన లేక సత్క్రియలు చేయుటపైనగాక, దేవునితో అనుబంధం కలిగియుండుట మరియు ఆయనను తెలుసుకొనుటలో ఎదుగుటను ఆస్వాదించుటపై ఎక్కువ దృష్టి ఉంటుంది.

యేసు క్రీస్తు యొక్క బోధలపై మాత్రమే గాక యేసు క్రీస్తుపై విశ్వాసం ద్వారా క్రైస్తవుడు జీవితంలో ఆనందం మరియు అర్థమును అనుభవిస్తాడు. యేసు తన భూలోక జీవితంలో తనను తాను దేవుని వైపు చూపించు ఒక ప్రవక్తగా లేక ఒక జ్ఞానోదయ గురువుగా కనుపరచుకొనలేదు. ఆయన అద్భుతాలు చేశాడు, ప్రజల యొక్క పాపమును క్షమించాడు మరియు ఆయనను నమ్ము ప్రతివారికి నిత్యజీవము కలుగుతుందని చెప్పాడు. ఆయన ఇలాంటి కథనాలు చేశాడు, “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును.”1

బైబిల్ దేవుడు మానవుల కొరకు వ్రాసిన సందేశమని క్రైస్తవులు నమ్ముతారు. యేసు జీవితం మరియు అద్భుతాల యొక్క చారిత్రక గ్రంథమగుటతో పాటు, బైబిల్ దేవుని వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రేమ మరియు సత్యమును మరియు ఆయనతో అనుబంధం కలిగియుండు విధానమును బయలుపరుస్తుంది.

వారి జీవితంలో క్రైస్తవులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనుచున్నప్పటికీ, వారిని నిజముగా ప్రేమించు శక్తిగల జ్ఞానవంతుడైన దేవుని వైపు వారు తిరగవచ్చని బైబిల్ బోధిస్తుంది. దేవుడు ప్రార్థనలకు జవాబు ఇస్తాడని మరియు ఆయనను గౌరవించుచుండగా జీవితానికి అర్థం కలుగుతుందని వారు నమ్ముతారు.

ఈ ప్రధాన మతములు ఎంత భిన్నత కలిగినవి?

ఆ ప్రధాన మతాలలో, మరియు దేవుని గూర్చి వారి ఆలోచనలలో, మనం గొప్ప భిన్నత్వములను చూస్తాము:

  • హైందవులు అనేకమంది దేవి దేవతలను నమ్ముతారు.
  • అసలు దైవం లేదని బౌద్ధ మతస్థులు చెబుతారు.
  • వారే దేవుడని నూతన యుగం అనుచరులు నమ్ముతారు.
  • ముస్లింలు బలమైన కాని తెలియబడని దేవుని నమ్ముతారు.
  • క్రైస్తవులు ప్రేమగల అందుబాటులో ఉండు దేవుని నమ్ముతారు.

మతములన్ని ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాయా? దీనిని మనం చూద్దాం. సార్వత్రిక మనసాక్షిని కేంద్రంగా చేసుకొని అందరు ఒక చోటికి రావాలని నూతన యుగం బోధిస్తుంది, కాని దీని అర్థం ఇస్లాం తమ ఏకైక దేవుని ఆలోచన విడిచిపెట్టాలా, హైందవ మతం అనేక దేవతలను విడిచిపెట్టాలా, మరియు బౌద్ధ మతం దేవుడు ఉన్నాడని నమ్మాలా.

ప్రపంచ ప్రధాన మతములన్ని (హైందవ మతం, నూతన యుగం, బౌద్ధ మతం, ఇస్లాం, యేసు క్రీస్తును వెంబడించుట) వాటిలో అవి విశేషమైనవి. మరియు వీటిలో ఒకటి ఒక వ్యక్తిగత, ప్రేమించు దేవుడు ఉన్నాడని మరియు ఈ జీవితంలో ఆయనను తెలుసుకొనవచ్చని చెబుతుంది. మనలను తనతో అనుబంధంలోనికి ఆహ్వానించు మరియు మన పక్షముగా ఒక ఆధారకర్తగా, సహాయకునిగా మరియు మనలను ప్రేమించు శక్తిగల దేవునిగా ఉండు ఒకడు ఉన్నాడని యేసు క్రీస్తు దేవుని గూర్చి మాట్లాడాడు.

హైందవ మతంలో ఒక వ్యక్తి తన కర్మ నుండి విముక్తి పొందుటకు స్వయంగా ప్రయత్నిస్తాడు. నూతన యుగంలో ఒక వ్యక్తి తన సొంత దైవత్వం కొరకు పని చేస్తాడు. బౌద్ధ మతంలో ఆశ నుండి స్వతంత్రులగుటకు వ్యక్తిగతంగా ప్రయత్నిస్తారు. మరియు ఇస్లాంలో, మరణం తరువాత పరలోకం కొరకు వ్యక్తులు మత నియమాలను పాటిస్తారు. యేసు బోధలలో, వ్యక్తిగత దేవునితో వ్యక్తిగత అనుబంధమును మీరు చూస్తారు—తరువాత జీవితంలోనికి కొనసాగు అనుబంధం.

ఈ జీవితంలో ఒక వ్యక్తి దేవునితో అనుబంధం కలిగియుండగలడా?

దీనికి జవాబు అవును. నీవు దేవునితో అనుబంధం కలిగియుండుట మాత్రమే కాదు, నీవు దేవునిచే అంగీకరించబడితివని మరియు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అని కూడా తెలుసుకొనవచ్చు.

చాలా ప్రపంచ మతములు ఆత్మీయ పూర్ణత పొందుటకు ప్రజలను వారి సొంత శక్తిపై వదిలిపెడతాయి.

ఉదాహరణకు బుద్ధుడు, పాపరహితమును ఎన్నడు చెప్పలేదు. తాను క్షమాపణ యొక్క అవసరత కలిగియున్నానని మొహమ్మదు చెప్పాడు. “మనం ఎంత తెలివిగలవారమైనా, ఎంత నైపుణ్యం కలిగియున్నా, ఇతర ప్రవక్తలు, గురువులు, మరియు బోధకులు ఎంత ప్రఖ్యాతికలిగియున్నా, మనందరి వలె వారు కూడా అసంపూర్ణులని తెలుసుకొనుటకు వారికి ఆలోచన జ్ఞానం ఉంది.”2

కాని యేసు క్రీస్తు ఎన్నడు ఎలాంటి వ్యక్తిగత పాపమునకు లోబడలేదు. బదులుగా, యేసు ప్రజల పాపములను క్షమించాడు మరియు మన పాపములను కూడా క్షమించాలని కోరుతున్నాడు. మన బలహీనతలు, ఇతరులు మనలను కించపరచునట్లు చూడు గుణములు, మరియు మనలో ఉండకూడదని మనం ఆశపడుతున్న గుణములను గూర్చి మనకు తెలుసు...అది ఒక వ్యసనం, కోపం, అపవిత్రత, ద్వేషపూరితమైన మాటలు కావచ్చు. మనం క్షమించబడుటకు మరియు ఆయనను తెలుసుకొనుటకు దేవుడు మనకు ఒక మార్గమును అందించాడు. దేవుని కుమారుడైన మానవ రూపంలో దేవుడైన యేసు మన పాపమంతటిని ఆయనపై వేసుకొని, సిలువలో శ్రమపొంది, మన స్థానంలో ఇష్టపూర్వకంగా మరణించాడు. బైబిల్ చెబుతుంది, “ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము.”3

మన కొరకు యేసు మరణం ద్వారా దేవుడు మనకు సంపూర్ణ క్షమాపణను ఇస్తున్నాడు. అంటే మన పాపములన్నిటి కొరకు...భూత, వర్తమాన, మరియు భవిష్యత్తు పాపములు క్షమాపణ అని దీని అర్థం. లోకమును సృష్టించిన దేవుడు మనలను ప్రేమించుచున్నాడు మరియు మనతో అనుబంధం కలిగియుండాలని ఆశపడుచున్నాడు. “మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.”4

క్రీస్తు ద్వారా, మన పాపం మరియు దోషం నుండి దేవుడు మనకు నిజమైన స్వతంత్రమును కలిగిస్తాడు. రేపు ఉత్తమ మనుష్యుడు అవుతాడు అనే ఉద్దేశంతో ఆయన ఒక వ్యక్తి యొక్క వైఫల్యాలను తన భుజముల మీద వేయడు.

యేసు క్రీస్తులో, దేవుడు మానవాళి యొద్దకు చేరి, ఆయనను తెలుసుకొనుటకు ఒక మార్గమును ఇస్తున్నాడు. " దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను."5

మనం ఆయనను తెలుసుకోవాలని దేవుడు కోరుచున్నాడు.

ఆయనతో అనుబంధం కలిగి జీవించుటకు దేవుడు మనలను సృష్టించాడు. యేసు అన్నాడు, "నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను."6 యేసు ప్రజలను కేవలం తన బోధలను మాత్రమే పాటించమని చెప్పలేదు గాని, ఆయనను అనుసరించమని చెప్పాడు. ఆయన అన్నాడు, " నేనే మార్గమును, సత్యమును, జీవమును."7 ఆయనే సత్యమని దావా చేయుట ద్వారా, క్రీస్తు కేవలం సత్యమును మాట్లాడుచున్నామని చెబుతున్న ప్రవక్తలు మరియు బోధకులను మించియున్నాడు.8

తాను దేవునితో సమానుడని చెబుతూ యేసు రుజువులు కూడా ఇచ్చాడు. ఆయన సిలువవేయబడతానని మూడు దినముల తరువాత మరణము నుండి తిరిగిలేస్తానని యేసు చెప్పాడు. భవిష్యత్తులో ఒక రోజు మరలా పుడతానిని యేసు చెప్పలేదు. (ఆయన మరలా పుట్టినా ఎవరికీ తెలుస్తుంది?) మూడు రోజుల తరువాత తిరిగిలేచి ఆయన సిలువవేయబడుట చూచిన వారికి కనిపిస్తానని ఆయన చెప్పాడు. ఆ మూడవ రోజున, యేసు సమాధి ఖాళీగా కనిపించింది మరియు ఆయనను సజీవంగా చూశామని అనేకమంది సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఆయన మనకు నిత్య జీవమును వాగ్దానం చేస్తున్నాడు.

అనేక ప్రపంచ మతములకు భిన్నంగా...

అనేక మతములు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ కృషి మీద దృష్టిపెడతాయి. యేసు క్రీస్తు ద్వారా మీకు మరియు దేవునికి మధ్య ఇది ఇరు వైపుల సంభాషణ. అయన యొద్దకు వెళ్లుటకు ఆయన మనలను ఆహ్వానిస్తాడు. “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు”9 మీ ప్రార్థనలకు జవాబిచ్చు, గొప్ప శాంతి మరియు ఆనందమును అందించు, దిశను చూపు, ఆయన ప్రేమను చూపు, మరియు మీ జీవితాలను మార్చు దేవునితో మీరు సంభాషించవచ్చు. యేసు చెప్పాడు, "గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని."10 దీని అర్థం జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా మారిపోతుందని కాదు. కాని జీవితము మధ్యలో, మీ జీవితంలో పాలుపంచుకొను మరియు ప్రేమలో నమ్మకంగా ఉండు దేవునితో మీరు అనుబంధం కలిగియుండగలరు అని దీని అర్థం.

ఎనిమిదింతల మార్గం లేక ఐదు స్తంభాలు, లేక ధ్యానం, లేక సత్క్రియలు, లేక పది ఆజ్ఞల వలె కూడా ఇది స్వయం-కృషి విధానముకు సమర్పణ కాదు. ఇవి ఆత్మీయతకు స్పష్టమైన, చక్కగా నిర్వచించబడిన, సులువైన మర్గములుగా అనిపిస్తాయి. కాని అవి పూర్ణత పొందుటకు భారంగా ఉంటాయి, మరియు దేవునితో అనుబంధం దూరంగానే ఉంటుంది.

మన నిరీక్షణ నియమాలను పాటించుటలో లేదుగాని, ఆయన యందు మన విశ్వాసం ద్వారా మరియు మన కొరకు ఆయన బలి ద్వారా మనలను పూర్తిగా అంగీకరించు రక్షకుని తెలుసుకొనుటలో ఉంది. మతపరమైన పనులు లేక సత్క్రియల ద్వారా మనము పరలోకంలో స్థలము సంపాదించలేము. యేసు క్రీస్తుతో అనుబంధమును ఆరంభించినప్పుడు పరలోకం మన కొరకు ఉచిత బహుమానం అవుతుంది.

మీరు పరిపూర్ణంగా క్షమించబడి మీ కొరకు దేవుని ప్రేమను పూర్తిగా తెలుసుకోవాలని ఆశపడుచున్నారా?

దేవునితో అనుబంధమును ఆరంభించుట

మీరు దేవునితో అనుబంధమును ఇప్పుడే ఆరంభించవచ్చు. ఇది దేవుని మీ పాపములను క్షమించమని అడిగి ఆయనను మీ జీవితంలోనికి ఆహ్వానించునంత సులువైనది. యేసు అన్నాడు, "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము."11 నిన్ను సృష్టించిన దేవునితో, నిన్ను మిక్కిలిగా ప్రేమించువానితో అనుబంధం కలిగియుండాలని ఆశపడుచున్నావా? నీవు ఇప్పుడే అలా చేయగలవు: “దేవా, నన్ను క్షమించమని మరియు నా హృదయంలో ఈ క్షణమే ప్రవేశించమని ఆహ్వానించుచున్నాను. నా పాపముల కొరకు మరణించినందుకు వందనాలు యేసు. నీవు చెప్పిన విధముగా నీ జీవితంలోనికి ప్రవేశించినందుకు వందనాలు.”

"తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను."12 అని బైబిల్ మనకు చెబుతుంది. దేవుని మీ జీవితంలోనికి రమ్మని నిజాయితీగా అడిగినట్లైతే, మీరు ఆయనతో వ్యక్తిగత అనుబంధాన్ని ఆరంభించారు. ఇది మీరు దేవునితో ఇప్పుడే కలుసుకొనుటతో, మరియు ఆయనను మరింతగా తెలుసుకొనుటకు, మీ కొరకు ఆయన ప్రేమను తెలుసుకొనుటకు, మీరు ఎదుర్కొను ప్రతి నిర్ణయంలో మిమ్మును నడిపించుటకు ఆయన ఇష్టపడుటకు సమానంగా ఉంది. దేవునితో అనుబంధమును గూర్చి మరింత నేర్చుకొనుటకు బైబిల్ లోని “యోహాను” అను పుస్తకం మంచి పుస్తకం. యేసును మీ జీవితంలోనికి ఆహ్వానించుటకు మీరు తీసుకున్న నిర్ణయమును గూర్చి మీరు ఇతరులకు కూడా చెప్పవచ్చు.

ప్రపంచ మతాలలో ప్రజలు బోధలతోను, ఆలోచనలతోను, మార్గాలతోను, పరంపరలతోను అనుబంధం కలిగియుంటారు. యేసు ద్వారా, ఒక వ్యక్తి ప్రేమగల శక్తివంతమైన దేవునితో అనుబంధం కలిగియుండవచ్చు. మీరు ఆయనతో మాట్లాడవచ్చు మరియు ఆయన ఈ జీవితంలో మిమ్మును నడిపిస్తాడు. ఆయన మిమ్మును కేవలం ఒక మార్గం వైపు, ఒక తత్త్వం వైపు, లేక ఒక మతం వైపు చూపించడు. ఆయనను తెలుసుకొనుటకు, ఆయన ఆనందమును అనుభవించుటకు, జీవిత సవాళ్ళ మధ్యలో ఆయన ప్రేమలో నమ్మకమును కలిగియుండుటకు మిమ్మును ఆహ్వానించుచున్నాడు. "మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి."13

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) యోహాను 8:12 (2) Erwin W. Lutzer, Christ Among Other Gods (Chicago: Moody Press,1994), p. 63 (3) 1 యోహాను 3:16 (4) 1 యోహాను 4:9 (5) యోహాను 3:16 (6) యోహాను 6:35 (7) యోహాను 14:6 (8) Lutzer, p. 106 (9) కీర్తనలు 145:18 (10) యోహాను 10:10 (11) ప్రకటన 3:20 (12) యోహాను 1:12 (13) 1 యోహాను 3:1

ఇతరులతో పంచుకోండ  

TOP