జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

ఎవరు

ఇది ఏదో ఒకటి అను వ్యాసమునకు తరువాయి భాగం.

ఏదో ఒకటి నిత్యమైనది ఉంది. ఏదో ఒకటి ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. ఏదో ఒక దానికి ఆరంభము లేదు. ఈ ఏదో ఒకటికి ఏవైనా అవసరతలు ఉంటే, అది స్వయంగా ఆ అవసరతలు తీర్చుకొనగలదు. ఉనికిలో ఉండుటకు దానికి దేని అవసరము లేదు. మరియు తన కంటే సమానమైనదని లేక గొప్ప దానిని అది చేయలేదు. చేయబడినది ఏది నిత్యమైనది కాదు. కాబట్టి, నిత్యమైనది ఒకటి మరొక నిత్యమైన దానిని చేయలేదు. అది ఉనికిలో ఉన్న ప్రతి దానికంటే ఎల్లప్పుడూ గొప్పది.

ఇప్పుడు, ఈ నిత్యమైనది బహువచనం కాగలదా? కావచ్చు. సరే, వాస్తవంగా ఐదు నిత్యమైన ఏదో ఒకటి ఉన్నది అని అందాము. అలా అయిన ఎడల, ఆ ఐదు కాలం మరియు శక్తిలో ఖచ్చితముగా ఒకే విధమైనవిగా ఉంటాయి. ఏది చేయబడినది, అన్ని నిత్యమైనవి, అన్ని సాధ్యమైనవాటిని చేయదగినవి. పరిమాణం గాక నాణ్యత ముఖ్యమైన విషయమని ఇది మరలా చూపిస్తుంది.

కాబట్టి, నిత్యమైన ఏదో ఒకటి (ల) గూర్చి మనకు ఏమి తెలుసు? అది మాత్రమే కాదు. మరొకటి ఉనికిలో ఉంది. ఉదాహరణకు, మీరు. ఇప్పుడు మిమ్మును మీరు అడగాలి, మీరు ఆ నిత్యమైన ఏదో ఒకటియా లేక నిత్యమైన ఏదో ఒకటి(ల)లో ఒకరా? మీరు అయినయెడల, మీకు ఆరంభము లేదు, మీరు స్వయంగా తీర్చుకొనలేని అవసరతలు ఏవి లేవు, మరియు చేయదగిన ప్రతి వాటిలో మీరు చేయలేనిదీ లేదు. మీరు అలాంటివారేనా? కాని యెడల, మీరు నిజముగా వేరు, నిత్యమైన ఏదో ఒకటి కారు, నిత్యమైన ఏదో ఒకటి(ల)లో ఒకరు కూడా కారు.

మన పెద్ద నల్లటి ఖాళీ గదిలోనికి తిరిగి వెళ్దాం. కాని ఇప్పుడు ఆ గదిలో నైట్రోజన్ యొక్క ఒక కణము మరియు హైడ్రోజన్ యొక్క ఒక కణము ఉంది అనుకుందాం. మన వాదన కొరకు, ఈ రెండు నిత్యమైన ఏదో ఒకటి అని అందాం. అవి ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాయి. చేయదగిన ప్రతి పని అవి చేయగలవు.

కాబట్టి, గదిలో అవి మాత్రమే ఉన్నందున అవి వేరే ఒక దానిని చెయ్యాలని నిర్ణయించుకున్నాయి. కాని ఆగండి, హైడ్రోజన్ లేక నైట్రోజన్ నిర్ణయం తీసుకోగలవా? సరే, నిత్యమైనవి అగుట కొరకు, వాటికి నిర్ణయం తీసుకొనే శక్తి ఖచ్చితంగా ఉండాలి.

దీనిని గూర్చి ఆలోచించుడి. ఈ నిత్యమైనది విషయములను మార్చుటకు నిర్ణయించుకోవాలి. ఈ నిత్యమైనది నిరంతరము ఉన్నది. ఇతరులతో ప్రమేయం లేకుండా అది ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. ముఖ్యంగా, అది మాత్రమే ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. దీని అర్థం ఏమిటి? అంటే ఆ నిత్యమైనది చెప్పకుండా ఏ కార్యము జరగలేదు.

ఆ నిత్యమైనది దానిలోనే పూర్ణమైనది. కాబట్టి, ఈ నిత్యమైన దాని ఒంటరి తనమును మార్చగలిగినది స్వయంగా ఆ నిత్యమైనదే. ఈ నిత్యమైన దాని వెలుపల ఏ శక్తి లేదు ఎందుకంటే ఆ నిత్యమైనది మాత్రమే ఉనికిలో ఉంది.

కాబట్టి, హైడ్రోజన్ యొక్క ఒక కణం మరియు నైట్రోజన్ యొక్క ఒక కణం ఆ నిత్యమైనవి అయితే బాహ్య శక్తి ఏది కూడా వాటిని శాసించలేదు. అవి మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే ఉనికిలో ఉన్న శక్తి.

ఉనికిలో ఉన్న ఏకైక శక్తిగా వాటి ఒంటరితనమును మార్చగలిగినవి అవి మాత్రమే. వేరొక దానిని చేయుట కొరకు అనుకోకుండా వాటి పై ప్రభావం చూపగలిగినది ఏది కూడా ఉనికిలో లేదు.

అనుకోకుండా (అవకాశం కొలది) ఏది సృష్టించబడలేదు. ఎందుకు? ఎందుకంటే అలా జరుగుటకు ఆ “అవకాశం” హైడ్రోజన్ మరియు నైట్రోజన్ కణములను అధిగమించవలసియుంటుంది. కాని అవి మాత్రమే అక్కడ ఉన్నాయి. ఏదైనా చెయ్యాలంటే అవి మాత్రమే చేయగలవు. “అవకాశం” అంటే వేరేది. ఆ వేరేది ఏది నిత్యము ఉన్నదానిని అధిగమించలేదు. వాస్తవానికి, ఈ స్థితిలో, అసలు అవకాశం ఉనికిలో కూడా లేదు.

ఈ అవకాశం అనేది ఆ నిత్యమైనదానికి వెలుపల ఉంటే, ఆ నిత్యమైనది సృష్టించకుండా అది ఉనికిలోనికి రాలేదు. కాని ఒకవేళ ఆవశమును ఆ నిత్యమైనది సృష్టించినా అది వేరేది కాబట్టి ఎల్లప్పుడూ నిత్యమైనదాని కంటే తక్కువగానే ఉంటుంది.

కాబట్టి, ఒకవేళ వేరేది సృష్టించబడినా, అది నిత్యమైనదాని యొక్క శక్తి మరియు చిత్తముతో చేయబడుతుంది. ఆ వేరేది అవకాశం ద్వారా అనుకోకుండా చేయబడుటకు ఆ అవకాశం అనేది ముందుగా చేయబడాలి. కాని అవకాశం అనేది స్వయంగా అవకాశం ద్వారా సృష్టించబడలేదు. నిత్యమైనదాని యొక్క చిత్తము ద్వారా అది సృష్టించబడాలి.

మన హైడ్రోజన్ మరియు నైట్రోజన్ కణములను గూర్చి ఇది మనకు ఏమి చెబుతుంది? అవి కేవలం నిత్యమైన ఏదైనా ఒకటి(లు) కాదని, అవి నిత్యమైన వ్యక్తులని చెబుతుంది. వాటికి చిత్తం ఉంది. అంటే, వాటికి నిర్ణయించే శక్తి ఉండాలి. కాబట్టి, అవి వ్యక్తిగతమైనవి.

మరలా, ఈ నిత్యమైనదానికి నిర్ణయించే శక్తి ఎందుకు ఉండాలి? కేవలం హైడ్రోజన్ మరియు నైట్రోజన్ కణములు కలిగి ఖాళీగా ఉన్న ఆ గదిని మరలా జ్ఞాపకం చేసుకొండి. అవి నిత్యమైన ఏదో ఒకటి (లు). అవి మాత్రమే గదిలో ఉన్నాయి, మరియు నిత్యము నుండి అక్కడ ఉన్నాయి.

వేరే దానితో ప్రమేయం లేకుండా అవి ఉన్నాయి. నివసించుటకు, వాటికి వేరొకరి అవసరత లేదు. కాబట్టి, అవి దేనినైనా చేస్తే, అవసరం ఉండి చేయవు (మనం జంతువులలో చూచునట్లు జీవించుటకు). మరియు, అవి వేరే దేనినైనా సృష్టిస్తే, అవి అనుకోకుండా కాదు--ముందుగా అవకాశమును సృష్టిస్తే తప్ప. అవకాశం ఒక శక్తి, కాని నిత్యమైనవి (రెండు కణములు) కేవలం ఉనికిలో ఉన్న శక్తులు.

అంతేగాక, కణములు కేవలం యంత్రములు మాత్రమే కాదు. యంత్రములు ఒక బాహ్య శక్తి ద్వారా నిర్మించి చేయబడినవి. కాని కణములు (నిత్యమైనవి) మాత్రమే ఉనికిలో ఉన్న శక్తులు. వాటి వెలుపల ఏ శక్తి ఉనికిలో లేదు.

కాబట్టి, ఆ గదిలో అవి దేనినైనా సృష్టించిన యెడల, దానిలో మరి ఏ శక్తి లేదు కాబట్టి, దాని సృష్టి యొక్క కారణము కేవలం అవి మాత్రమే. అవి తప్ప గదిలో ఏవి ఉనికిలో లేవు.

అనుకోకుండా, సరదాగా, అవసరంతో, లేక ఇతరుల చిత్తంతో వేరే దేనిని సృష్టించుటకు వాటిని ఎవ్వరు బలవంతం చేయలేరు. వాటిని ఎవరు శాసించలేరు. అవి చేయు ప్రతిది వాటి సొంత కారణాల వలన చేయబడతాయి.

ఆ కారణం వాటి చిత్తం మాత్రమే. అవి వేరే వాటిని సృష్టించుటకు నిర్ణయించుకోవాలి. లేనిచో మరి ఏది ఉనికిలోనికి రాదు. అవి వేరే దానిని సృష్టించుటకు నిర్ణయించనంత వరకు ఆ గదిలో అవి ఒంటరిగానే ఉంటాయి. వేరే దానిని సృష్టించుటకు--ఏదో ఒక తరుణంలో-- వాటి శక్తిని ఉపయోగించుటకు అవి నిర్ణయించుకోవాలి.

వాటికి ఎలాంటి చిత్తము లేని యెడల (మనం మునుపు పాఠంలో చదివిన టెన్నిస్ బంతి వలె), వేరొక దానిని చేయుటకు వాటి శక్తి ఎన్నడు ఉపయోగపడదు. వాటి ఉనికిని కొనసాగించుటకు మాత్రమే వాటి శక్తి ఉపయోగపడుతుంది. మరియు వాటి ఒంటరితనం శాశ్వతంగా నిలిచిపోతుంది.

నిత్యమైనది నిత్యము నుండి ఒంటరిగా ఉనికిలో ఉంది. అది మారుటకు ఆ నిత్యమైనదానిలో ఏదో ఒక కారణం ఉండాలి. ఏదైనా వేరేది ఉనికిలోనికి వస్తే, ఆ నిత్యమైన దాని వలన అది ఉనికిలోనికి వస్తుంది, ఎందుకంటే ఆ నిత్యమైనది తన ఒంటరితనమును ముగించుటకు నిర్ణయించుకొన్నది.

ఆ వేరేదానికి కారణం ఆ నిత్యమైనదానిలో లేనియెడల, ఆ వేరేది ఎన్నడు ఉనికిలోనికి రాదు. ఎందుకంటే ఒకానొక సమయంలో ఆ నిత్యమైనది మాత్రమే ఉనికిలో ఉండేది.

కాని ఆ వేరేది ఉనికిలో ఉన్నదని మనకు తెలుసు. కాబట్టి, తన శక్తిని ఉపయోగించుటకు నిర్ణయించుకొనగల శక్తి ఆ నిత్యమైనదానికి ఉంది. దానికి వెలుపల ఒక దానిని సృష్టించగల శక్తి ఆ నిత్యమైనదానికి ఉండాలి. దానికి చిత్తము ఉంది1 కాబట్టి, ఆ నిత్యమైనది వ్యక్తిగతమైనది. అంటే ఆ నిత్యమైనది ఒక నిత్యమైనవాడు అని అర్థం.

ఈ నిత్యమైనవాడు ఉనికిలో ఉండుటకు ఏదో ఒకటి చేయవలసిన పని లేదు, ఎందుకంటే వానికి అవసరతలు లేవు మరియు అతడు ఉనికిలో లేకుండా పోలేడు. అంతేగాక, ఈ నిత్యమైనవాడు అనుకోకుండా అవకాశం ద్వారా సృష్టించబడడు, ఎందుకంటే ముందుగా వాడు అవకాశము సృష్టించాలి. అవకాశం అనునది నిత్యుడైనవాని ద్వారా చేయబడాలి, లేకపోతే అది లేనేలేదు. చివరిగా, ఆ నిత్యమైనవాడు ఒక యంత్రము కాదు. అతని వెలుపల, వానిని శాసించువాడు, బలవంతము చేయువాడు, నియంత్రించువాడు లేనేలేడు.

ఈ అధ్యయనం కొనసాగించుటకు, చూడండిి ఎవరు 2.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) "ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు.” (బైబిల్, ప్రకటన 4:11)

ఇతరులతో పంచుకోండ  

TOP