జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

ఎవరు 2

ఇది ఎవరు అను వ్యాసమునకు తరువాయి భాగం.

ఈ సృష్టి సృష్టించడానికి ముందు ఎప్పుడైన ఏమైన ఉందా? అను వ్యాసంతో ఆరంభమై ఏదో ఒకటి మరియు ఎవరుతో కొనసాగిన ఈ సిరీస్ లో ఇది ఆఖరి వ్యాసం. ఆ అధ్యయనాలలో చేయబడిన ప్రాధమిక బిందువులు ఇవి:

(1) ఏది ఉనికిలో లేకుండా ఎన్నడు లేదు. అలా అయిన యెడల, నేడు కూడా ఏది ఉనికిలో ఉండేది కాదు. కాని నేడు ఏదో ఒకటి ఉనికిలో ఉంది. ఉదాహరణకు నీవు.

(2) ఏది ఉనికిలో లేకుండా ఎన్నడు లేదు కాబట్టి, ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉనికిలో ఉంది. ఈ ఏదో ఒకటిని మనం నిత్యమైన ఏదో ఒకటి అని పిలువవచ్చు. ఈ నిత్యమైనదానికి ఆరంభము మరియు అంతము లేదు, స్వయంగా తాను తీర్చుకోలేని అవసరతలు ఏమి లేవు, సాధ్యమైన ప్రతిది అది స్వయంగా చేయగలదు, మరియు అది సృష్టించు ప్రతి దాని కంటే అది ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుంది.

(3) ఈ నిత్యమైన ఏదో ఒకటి యంత్రం కాదు, మరియు దానికి వెలుపల ఉన్న ఏ శక్తి ద్వారా అది నియంత్రించబడదు. మరియు దానికి ఎలాంటి అవసరతలు లేవు కాబట్టి ఆ నిత్యమైన ఏదో ఒకటి అవసరతలో నుండి పుట్టదు. కాబట్టి, అది వేరే దేనినైనా సృష్టిస్తే, అలా చేయుటకు అది నిర్ణయించుకోవాలి. అనగా నిత్యమైనదానికి చిత్తం ఉంది అని అర్థం; ఆ విధంగా, అది వ్యక్తిగతమైనది. కాబట్టి, ఆ నిత్యమైన ఏదో ఒకటి ఒక నిత్యమైన వ్యక్తియైయుండాలి.

కొనసాగిస్తూ, ఈ నిత్యమైన వ్యక్తిని గూర్చి మనం ఏమి గ్రహించగలం, ఇప్పటి వరకు చెప్పిన దానికి మించి? (నిత్యమైనది నిత్యమైన వ్యక్తి కాబట్టి ఇక్కడ “అది” నుండి “అతడు” లేక ఆమె” అను మాటలను ఉపయోగించవలసిన అవసరం ఉంది. “అతడు” ఎన్నుకొనబడినది కాని ఈ చర్చలో లింగము గొప్ప విషయము కాదు.)

ఈ నిత్యమైన వ్యక్తికి తాను స్వయంగా తీర్చుకొనలేని అవసరతలు ఏమి లేవు కాబట్టి, ఆయన ఎలాంటి వాతావరణం యొక్క అవసరత లేకుండా ఉనికిలో ఉండగలడు, మరియు ఆయన తప్ప ఏది ఉనికిలో లేనప్పుడు కూడా ఆయన ఒంటరిగా ఉనికిలో ఉన్నాడు. వాతావరణం అంతా ఆయనకు వెలుపల ఉంది కాబట్టి, దానిని సృష్టించవలసిన అవసరం ఉంది. కాని అక్కడ ఉన్నదంతా ఆయన మాత్రమే.

అంటే ఆ నిత్యమైనవాడు అన్నిటికి మించినవాడైయుండవచ్చు. అనగా, అతడు దేనితో బంధించబడలేదు కాబట్టి, అతడు కాలం మరియు స్థలమునకు వెలుపల ఉనికిలో ఉండగలడు. అతడు నిత్యము నుండి ఉనికిలో ఉన్నాడు కాబట్టి, కాలమునకు ఆయనపై ప్రభావం లేదు. మరియు వాతావరణం యొక్క అవసరత లేకుండా అతడు స్థలమునకు వెలుపల ఉన్నాడు.

కాలం మరియు స్థలమునకు వెలుపల ఉండుట ద్వారా, ఆ నిత్యమైనవాడు మనం అదృశ్యమైనవాడు అని పిలిచేవాడు కావచ్చు. స్థలములో పరిమితి కలిగి ఉండేది మాత్రమే కనిపించేదిగా ఉంటుంది. ఒక స్థలమునకు వెలుపల ఉన్నది ఎలా కనబడుతుంది? అదే విధంగా, నిత్యమైనవాడు కూడా అదృశ్యమైనవాడై ఎలాంటి శరీరం మరియు రూపం లేకుండా ఉనికిలో ఉండగలడు.

మన చర్చ నిమిత్తం, నిత్యమైనవాడు మరొకదానిని లేక మరొకరిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడని అనుకుందాం. ఆ నిత్యమైన వాడు కొన్ని విషయాలలో తన పోలికలో ఉన్నవాడిని సృష్టిస్తాడు. ఆయన వలె, ఆ వేరేవానికి కూడా కొంత స్వయం-ఆలోచన ఉంటుంది, మరియు చిత్తము కలిగియుండుటకు అది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి ఆ వేరేవాడు స్వార్థం కలిగినవాడు మరియు చిత్తం కలిగినవాడు.

ఈ వేరే వ్యక్తిని గూర్చి మనం ఏమి నిర్థారించగలము? ఈ వేరే వ్యక్తి కూడా కాలంతో ప్రమేయం లేకుండా ఉంటాడా? లేదు, ఈ వేరే వ్యక్తి నిత్యము ఉనికిలో ఉండువాడు కాదు. ఈ వేరే వ్యక్తికి ఆరంభం ఉన్నది కాబట్టి అతడు కాల పరిమితి గలవాడు.

ఆ నిత్యమైనవాడు సృష్టించు ప్రతిది కాలం మరియు స్థలం విషయంలో తక్కువవానిగా ఉంటాడు అన్న విషయం గుర్తు చేసుకోండి. దానిని ఏ విధంగాను మనం నిరాకరించలేము. ఒకవేళ, ఆ వేరే వ్యక్తి ఇక నిత్యము జీవించవలసియున్నపట్టికి గాని, కాలములో అతనికి ఆరంభం ఒకటి ఉంది. వాస్తవానికి, అతని కాలక్రమం నిత్యమైనవాని యొక్క [అనంతమైన] కాలక్రమంలో ఒక భాగంగా ఉంటుంది.

స్థలము విషయం ఏమిటి? ఆ వేరే వ్యక్తి స్థాన పరిమితి కలిగియుంటాడా? అవును. కేవలం నిత్యమైనవాడు మాత్రమే ఎలాంటి వాతావరణం లేకుండా జీవించగలడు. వేరే వ్యక్తికి జీవించడానికి ఒక వాతావరణం కావాలి, కాని ఏమిటి? సమయం వలెనే స్థానమును గూర్చి కూడా ఆలోచన చెయ్యండి. ఆ వేరే వ్యక్తి నిత్యమైనవాని యొక్క కాలక్రమంలో భాగముగా మాత్రమే ఉండగలడు. అదే విధంగా, ఆ వేరే వ్యక్తి నిత్యమైనవాని యొక్క “స్థాన క్రమంలో” మాత్రమే ఉనికిలో ఉండగలడు.

నిత్యమైనవాడు స్థానమును మించినవాడు. కాబట్టి, కాలం విషయంలో ఆయన అన్ని చోట్ల ఉన్నట్లే, స్థానం విషయంలో కూడా ఆయన అన్ని చోట్ల ఉండగలడు. కాబట్టి, వేరే వ్యక్తి చేయబడినప్పుడు, అతడు నిత్యమైనవాని యొక్క కాలం మరియు స్థానములో మాత్రమే ఉనికిలో ఉండగలడు.

ఇప్పుడు మన యొద్ద నిత్యమైనవాడు మరియు వేరేవాడు ఉన్నాడు, కాని ఓమ సమస్య ఇక్కడ ఉంది. నిత్యమైనవాడు స్థానమునకు వెలుపల ఉంటాడు కాబట్టి చేయబడినవాడు ఆయనను చూడలేడు. ఆయన ప్రపంచంలో ఒక స్థలములో ఉండడు.

కాబట్టి వేరే వాడు నిత్యమైనవానిని కనుగొనలేడు. వేరే వాని ద్వారా కనుగొనబడాలంటే ఇప్పుడు ఈ నిత్యమైనవానికి ఏమి చేయవలసియుంది? ఆయన “కనిపించేవాడు” అవ్వాలి. ఆయన ఏదో ఒక విధంగా కనిపించాలి. అది సాధ్యమా?

చేయదగిన ప్రతిది నిత్యమైనవాడు చేయగలడు అను విషయం గుర్తుంచుకోండి. అతడు తన్ను తాను ఇతరులకు బయలుపరచుకొనగలడు. ఎలా?

చూపు, వాసన, స్పర్శ, రుచి, వినుట ద్వారా మన లోకములో వేరొకరిని మనం కనుగొనవచ్చు. నిత్యమైనవాడు ఆ వేరే వానికి చూచు లేక విను శక్తిని ఇచ్చినట్లైతే, ఉదాహరణకు, ఆ నిత్యమైనవాడు (1) కనిపించు రూపంలో ప్రత్యక్షమవ్వవచ్చు, (2) వేరే వానితో మాట్లాడవచ్చు, లేక (3) రెండు ఒకే సారి చేయవచ్చు. నిత్యమైనవాడు వేరేవాని ద్వారా కనుగొనబడుటకు ఇవి తన్ను తాను తగ్గించుకొను మార్గములు.

వేరే వ్యక్తి సృష్టించబడెను అని గుర్తుంచుకోండి. అందువలన, ఆ వేరే వ్యక్తి సమయ మరియు స్థాన పరిమితి కలిగినవాడు. కాబట్టి, ఆ వేరే వానికి ఇచ్చిన రూపమునే నిత్యమైనవాడు తీసుకోవలసిన ఉంది. తన్ను తాను కనబడునట్లు చేయుటకు అది ఒక మార్గం.

కాని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది: కనబడునట్లు నిత్యమైనవాడు తనను తాను తగ్గించుకొంటె, అది ఆ నిత్యమైనవాని యొక్క సమస్తమవుతుందా? లేదు! ఆయన కనుపరచిన అనేక విషయములు ఇంకా ఉంటాయి. ఆయన తనను గూర్చి అనేక విషయాలు బయలుపరచినా, వేరే వ్యక్తి అతనిని సంపూర్ణంగా గ్రహించలేడు లేక తెలుసుకొనలేడు.

ఆశ్చర్యకరంగా, పైన వివరించబడిన దానినే మనం ఖచ్చితంగా బైబిల్ లో చూస్తాము. మనం ఆ వేరే వ్యక్తి వలె ఉన్నాము. మనం కాలం మరియు స్థాన పరిమితి కలిగియున్నాము. కాని దేవుడు నిత్యమైనవాడు. ఆయన యేసు క్రీస్తులో బయలుపరచబడెను. ఇంకా ఎక్కువ తెలుసుకొనుటకు, క్రింద చూడండి...

1. దేవుడు నిత్యమైనవాడు. ఆయన ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాడు మరియు నిరంతరం ఉనికిలో ఉంటాడు.

పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. (కీర్తనలు 90:2)

నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. (యెషయా 40:28)

"ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు." (యెషయా 44:6)

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. (యిర్మీయా 10:10)

"యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (యోహాను 8:58)

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. (హెబ్రీ. 13:8)

"అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు." (ప్రకటన 1:8)

"నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.” (ప్రకటన 22:13)

2. దేవుడు అదృశ్యమైనవాడు.

ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను. (యోహాను 1:18)

దేవుడు ఆత్మ. (యోహాను 4:24)

సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. (1 తిమోతి 1:17)

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. (1 తిమోతి 6:15-16)

3. దేవుడు అన్ని చోట్ల ఉండగలడు, అయినను ఆయన మనకు భిన్నంగా ఉన్నాడు.

నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. (కీర్తనలు 139:7)

"జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు. మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమోయని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు." (అపొ. 17:24-27)

4. చేయదగిన ప్రతిది, దేవుడు చేయగలడు.

"యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా?" (అది. 18:14)

మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. (కీర్తనలు 115:3)

"దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను." (యెషయా 46:10)

"దేవునికి సమస్తమును సాధ్యము." (మత్తయి 19:26)

"దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదు." (లూకా 1:37)

5. దేవునికి “తగ్గించుకొనుట” సాధ్యమే. మానవ రూపం దాల్చి ఆయన తన్ను తాను బయలుపరచుకొనగలడు.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను . . . ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. (యోహాను 1:1, 1:14)

జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. (1 యోహాను 1:1-2)

ఆయన [యేసు క్రీస్తు] అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. (కొలస్సి. 1:15-16)

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండెను. (హెబ్రీ. 1:3)

క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను! (ఫిలిప్పీ. 2:5-8)

6. దేవుడు తగ్గించుకొన్నప్పుడు, అది ఆయన సమస్తము కాదు, కాని అది ఆయనే.

"తండ్రి నాకంటె గొప్పవాడు." (యోహాను 14:28)

"నేనును తండ్రియును ఏకమై యున్నాము." (యోహాను 10:30)

"నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు." (యోహాను 14:9)


ఈ దేవుని గూర్చి మీరు తెలుసుకోవాలని ఆశపడుచున్నారా? అయితే, ఎలాగో కనుగొనండి...

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP