జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

యేసు ఎందుకు మరణించెను?

యేసు మరణముయొక్క ఉద్దేశము ఏమిటి? మన కొరకు యేసు ఎందుకు మరణించవలసి వచ్చెను?

మత నాయకులు దైవదూషణ నిమిత్తం –తాను దేవుడని చెప్పినందుకు—యేసును సిలువవేసారు. అందు నిమిత్తం వారు ఆయనను హతమార్చారు. కాని, వారు నిజముగా దానికి అధిపతులుగా ఉన్నారా?

సిలువ వేయబడుటకు ముందు, అనేక సార్లు యేసు, తాను సిలువవేయ బడుదునని శిష్యులకు చెప్పాడు. వారి పాపముల క్షమాపణ నిమిత్తం ఆయన దానిని ఇష్టపూర్వకంగా చేస్తున్నానని ఆయన అన్నాడు.

ఒక మెస్సీయ, రక్షకుడు వస్తాడని ప్రవక్తలు ప్రకటించారు. ఆయను గూర్చి యెషయా ఇలా వ్రాసాడు: “మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.”1

వారి పాపములకు తాత్కాలిక ప్రాయశ్చిత్తం నిమిత్తం ప్రతి సంవత్సరం యూదులు ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించేవారు.

యేసు వచ్చినప్పుడు, బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను గూర్చి సరిగా చెప్పాడు, “ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.”2 యేసు మన పాపములను తీసుకొని మన స్థానంలో వాటి కొరకు మరణించాడు. మన కొరకు మన శిక్షను ఆయన తీసుకున్నాడు.

అయితే, యేసు కేవలం మానవాళికి ప్రాతినిథ్యం వహించిన ఒక ప్రవక్త మాత్రమే కాదు. యేసు తన దైవత్వమును గూర్చి స్పష్టముగా మాట్లాడెను. ఆయన సృష్టికి ముందు ఉన్నానని, పాపములను క్షమించుటకు, ప్రార్థనలకు జవాబిచ్చుటకు మరియు నిత్యజీవమును ఇచ్చుటకు తనకు శక్తి ఉందని యేసు చెప్పాడు.

మరలా, తాను దేవుడని చెప్పినందున మాత్రమే యూదుల అధికారులు ఆయనను సిలువవేసారు.

అయినను యేసు ఒక రుజువును చూపించాడు. కేవలం యేసు సిలువవేయబడుటకు కొన్ని వారముల ముందే, యేసు స్నేహితుడైన లాజరు మరణించాడు. ఆయన మరణించి నాలుగు దినములైన తరువాత, యేసు బహిరంగంగా ఆయనను మరణము నుండి లేపాడు. ప్రతి నగరములో, యేసు ప్రతి రోగమును, ప్రతి అనారోగ్యమును స్వస్థపరచెను. ఆయన సిలువవేయబడుటకు ముందే మత అధికారులు ఈ విధంగా చెప్పారు, “ఇదిగో లోకము ఆయనవెంట పోయినది”3 మరియు “మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు.”4 ఆయనకు అద్భుత శక్తి ఉన్నదని యేసు రుజువుచేసాడు.

ఈ విషయం యొక్క వెలుగులో, కొరడా దెబ్బలు, తలలో ముళ్ళు, కాళ్ళ చేతులలో మేకులు ఆయనను చంపలేదు. సిలువపై కలిగిన దీర్ఘ వేదన కూడా చంపలేదు. యేసు సిలువపై నుండి ఏ క్షణమైనా దిగివచ్చియుండవచ్చు.

ఇది ఒకరు క్రిందికి వంగి తమ తల నీటిలో పెట్టి, ఏ క్షణమైనా తల లేపే శక్తి ఉన్నప్పటికీ కావాలని మునిగిపోవాలని ఎన్నుకొనే వానిని పోలియుంది. యేసు మరణించాలని నిర్ణయించుకున్నాడు.

ఆయన దీనిని గూర్చి స్పష్టముగా ఉన్నాడు. తన ప్రాణము పెట్టుటకు ఆయన నిర్ణయించుకున్నాడని యేసు చెప్పాడు. మన కొరకు. “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు”5 అని యేసు చెప్పాడు. కాని ఎందుకు?

ఎందుకంటే ఆయన మన హృదయాలను, మన క్రియలను చూచి, మనం రోగముతో, అవసరతతో, బలహీనంగా, పాపముతో నశించి ఉన్నామని గుర్తించాడు. ఇది మన గూర్చి యేసు చెప్పిన ఆలోచన, మరియు ఇది మనకు నచ్చదు. అయితే దీనిని గూర్చి ఆయన క్రియలు కూడా మీరు చూడాలి. అది ఒక దూరం నుండి ఇచ్చే తీర్పు లేక శిక్ష కాదు. అది పాలుపంపులులేనిది, లేక జాలి లేనిదీ కాదు. మీరు ఆయనతో సమ్మతించినా లేకపోయినా, మనం గొప్ప అవసరతలో ఉన్నట్లు ఆయన చూశాడు. మన జీవితాలు సరిగా పనిచేయకుండుట ఆయన చూశాడు. సంపూర్ణంగా లేక అయన మన కొరకు సృష్టించిన మంచితనంలో జీవించలేకపోవుట.

మరియు, నిత్యత్వంలో ఆయనకు వేరుగా మనం మరణించే ప్రమాదమును ఆయన చూశాడు. నిత్య జీవమును ఎన్నడు అనుభవించకుండా. మన పాపము ద్వారా ఆయనకు దూరమగుట ఆయన చూశాడు. మరియు మన అవసరతను తీర్చాలని ఆయన కోరాడు.

మనం కృతజ్ఞులమైనప్పటికీ, లేక కానప్పటికీ. మనం దాని అవసరతను చూచినప్పటికీ, చూడనప్పటికీ. మనము పొందవలసిన మరణ శిక్షను ఆయన తనపై వేసుకున్నాడు. ఇవి శ్రద్ధ చూపనివాని యొక్క క్రియలు కావు.

మనం రక్షించబడాలని, క్షమించబడాలని నమ్మి, ఆయన మన కొరకు గొప్ప శ్రమను అనుభవించాడు. సిలువపై యేసు, ప్రేమకు చిహ్నంగా మాత్రమే శ్రమపొంది మరణించలేదు. ఆయన ఆలోచన ప్రకారం, అది చాలా అవసరమైయుంది. మనమైనా మరణించాలి-మన పాపము వలన ఆయనకు నిత్యము దూరమై-లేక ఆయన మరణించాలి, మనం మరణించకుండా ఉండుటకు. మనం క్షమించబడుటకు. మనం ఆయనను నిత్యత్వములో తెలుసుకొనుటకు.

దీనిని వివరిస్తూ, బైబిల్ చెబుతుంది, “. . . మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.”6

ఆయన మరణమునకు కొన్ని గంటల ముందు, రానున్న సిలువ మరియు పునరుత్థానమును గూర్చి పూర్తిగా తెలుసుకొనియుండి, తండ్రితో మాట్లాడుతూ యేసు తన ఆలోచనను చెప్పాడు. “నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.”7

ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నకు దారితీస్తుంది: మనం రక్షించబడవలసిన అవసరం ఉందా? మనలో మనం చూడలేనిది యేసు ఏమి చూశాడు? ఆయన మన కొరకు సిలువలోనికి వెళ్లి, హింసించబడి, మరణించుటకు నిర్ణయించుకున్నాడు. ఇది ఎందుకు అవసరమైనది?

మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో ఆయన చూసియుండవచ్చు. మన కోపం, ద్వేషం. మన అసహనం, మరియు గాయపరచు మాటలు మరియు క్రియలు. మనం ఇతరులకు విరోధంగా పాపము చేస్తాము, మరియు కొన్ని సార్లు మనకు విరోధంగా పాపం చేస్తారు. దేవుడు మనలను సృష్టించిన మంచితనమును చేయుటలో మనం విఫలమవుతాము. ఆయన విషయం మర్చిపొండి, మనం మన సొంత స్థాయినే అందుకోలేకపోతాము. నిజాయితీగా ఉన్నప్పుడు, మనమంటే మనకే అసహ్యం పుడుతుంది. కాబట్టి పరిపూర్ణమైన పరిశుద్ధ దేవుడు ఏమి చూస్తాడు?

ఆయనతో మనకు సంబంధం వద్దు మరియు మన జీవితాలలో ఆయన జోక్యం చేసుకొనవలసిన అవసరం లేదని చెప్పు మన విషయం ఏమిటి?

ఆయన మన నుండి ఎందుకు వెళ్లిపోలేదు? ఆయన ఎందుకు వెనుకకు తిరగలేదు?

మన పాపముల యొక్క పరిణామాలను ఎదుర్కొనుటకు మనలను విడిచిపెట్టుటకు బదులుగా, ఆయన మన యొద్దకు వచ్చాడు. ఆయన మన లోకములోనికి వచ్చాడు. ఆయన మన పాపముల యొక్క శిక్షను తీసుకొని స్వయంగా మన మరణమును అనుభవించాడు.

“అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసు కృపచేత మీరు రక్షింపబడియున్నారు.”8

ఆయన మన పాపములను చూడకుండా, దానిని ఒక మాటతో క్షమించే అవకాశం లేదా? అది మనకు సాధ్యముగా అనిపించవచ్చు, కాని మన పాపము ఆ విధంగా కొట్టివేయుటకు చాలా ఘోరమైనది. మన పాపం యొక్క తీవ్రత మరియు మన పట్ల ఆయన ప్రేమ వలన ఈ కార్యం జరిగింది.

ఒకరిని క్షమించుట నుండి వచ్చు బాధ మనమంతా అనుభవిస్తాము. మనకు విరోధంగా ఒక వ్యక్తి యొక్క పాపం ఎంత గొప్పదైతే, అంతగా ఆ వ్యక్తిని క్షమించుట కష్టమవుతుంది. యేసు మనలను నిత్యత్వములో ప్రేమించాలని ఆశించుచున్నాడు. మనం సంపూర్ణంగా, పూర్తిగా క్షమించబడాలని ఆయన కోరుతున్నాడు. ఆయన మనలను పూర్తిగా అంగీకరిస్తాడని మరియు మన పాపం ఇక మన మధ్య గోడగా ఉండవలసిన అవసరం లేదని మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. "ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."9

ఆయన మన పాపము నిమిత్తం శ్రమపొంది మరణించాడు, దానిని పూర్తిగా అధిగమించి మూడు రోజుల తరువాత మరణం నుండి తిరిగిలేచాడు. పాపం లేక మరణం ఆయనను ఆపలేదు. మరియు ఆయనలో మనం దానినే అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన అందించు క్షమాపణను అంగీకరించి, ఆయన వైపుకు నడచి, మనలను క్షమించి మన జీవితాలలోనికి ప్రవేశించమని ఆయనను అడుగుట మన సొంత నిర్ణయం.

యోహాను దీనిని బైబిల్ లో చక్కగా వర్ణిస్తున్నాడు, "మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము."10

మరణమునకు ముందు యేసు చేసిన ప్రార్థన: " నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను."11

మీ జీవితములో ఈ క్షణమే యేసు క్రీస్తును ఆహ్వానించాలని మీరు ఆశించుచున్నారా? మీరు ఈ విధంగా ఆహ్వానించవచ్చు.

"యేసు, నా జీవితములోనికి రమ్మని అడుగుచున్నాను. నా పాపమును క్షమించు. నా కొరకు సిలువలో మరణించినందుకు వందనాలు. నీ ఇష్ట ప్రకారం నా జీవితాన్ని నడిపించు. నా జీవితములోనికి వచ్చి నీతో ఒక బంధమును ఇచ్చినందుకు వందనాలు. ఆమెన్.”

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) యెషయా 53:5, 6 (2) యోహాను 1:29 (3) యోహాను 12:19 (4) యోహాను 11:48 (5) యోహాను 15:13 (6) రోమా. 5:7, 8 (7) యోహాను 17:23 (8) ఎఫెసీ. 2:4, 5 (9) రోమా. 6:23 (10) 1 యోహాను 4:16, 17 (11) యోహాను 17:25, 26

ఇతరులతో పంచుకోండ  

TOP